Solid fuel
-
ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా ఆదివారం సముద్ర జలాలపైకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ కొరియా, జపాన్ దీన్ని ధ్రువీకరించాయి. డిసెంబర్ 18న కూడా అమెరికా ప్రధాన భూభాగంపై సైతం దాడి చేయగల సామర్థ్యమున్న ఘన ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసంగ్–18ని ఉత్తర కొరియా ప్రయోగించింది. ఏప్రిల్‌లో దక్షిణకొరియాలో, నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకే ఉత్తరకొరియా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. -
విషవాయువుతో ఇంధనం పొడి!
ప్రపంచవ్యాప్తంగా గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించాలని దాదాపు అన్నిదేశాలు చాలా సదస్సుల్లో ఏకవాక్కు చేస్తున్నాయి. కానీ ఆ విషవాయువును తగ్గించడంలో చర్చలపై చూపుతున్న శ్రద్ధ.. ఆశించిన మేర చర్యలపై చూపడంలేదనేది అన్ని దేశాలకు మింగుడుపడని సత్యం. ఈ నేపథ్యంలో కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించడానికి జరుగుతున్న చర్యలతోపాటు వాతావరణం నుంచి దాన్ని వెలికి తీయడానికి ఇంజినీర్లు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ విషవాయువును సైతం వినియోగించుకునే విధంగా వివిధ పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చే సమర్థ విధానాన్ని కనుగొన్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను ద్రవ లేదా ఘన పదార్థం రూపంలోకి మారుస్తుంది. దీన్ని హైడ్రోజన్ లేదా మెథనాల్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఫ్యూయెల్ కణాలకు శక్తిని అందించటానికి, విద్యుత్తు ఉత్పత్తికి వాడుకోవచ్చు. ప్రయోగశాల స్థాయిలోనే దీన్ని సాధించినప్పటికీ పెద్దఎత్తున అమలు చేయొచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇళ్లకు ఉద్గార రహిత విద్యుత్తు, వేడిని అందించొచ్చని ఆశిస్తున్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను 90% వరకు ఇంధనంగా మారుస్తుండటం గమనార్హం. ఇదీ చదవండి: ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..! ఈ ప్రక్రియలో ముందుగా కార్బన్ డయాక్సైడ్ను మాధ్యమిక రూపంలోకి.. అంటే ద్రవ లోహ బైకార్బోనేట్‌గా మారుస్తారు. అనంతరం అణు, వాయు, సౌర విద్యుత్తు వంటి స్వల్ప కర్బన విద్యుత్తుతో పనిచేసే ఎలక్ట్రోలైజర్లో విద్యుత్‌రసాయన పద్ధతిలో ద్రవ పొటాషియం లేదా సోడియం ఫార్మేట్గా మారుస్తారు. దీన్ని ఎండబెట్టి ఘన పొడిగా చేస్తారు. దాంతో ఇది స్థిరంగా ఉంటుంది. చాలాకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని ఇళ్ల నుంచి పరిశ్రమల అవసరాల వరకూ ఇంధనంగా వాడుకోవచ్చని ఇంజినీర్లు వివరించారు. -
షార్‌లో అగ్నిప్రమాదం
నిల్వ ఉంచిన ఘన ఇంధనంలో మంటలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని ఘన ఇంధనం తయారీ విభాగం (స్ప్రాబ్)లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ భవనంలో ఎలాంటి యంత్ర పరికరాలు లేవు. కేవలం మిగిలిన ఘన ఇంధనాన్ని మాత్రమే ఈ భవనంలో నిల్వ చేస్తారు. అత్యంత పటిష్టమైన ఈ భవనంలోకి మంటలు ఎలా వ్యాపించాయనేది పశ్నార్థకంగా ఉంది. అమ్మోనియం ఫర్ క్లోరైడ్, ఆక్సిడైజర్, అల్యూమినియం పౌడర్‌ను కలిపి ఘన ఇంధనం తయారు చేస్తారు. సరిపడినంత తీసుకుని మిగతా ఇంధనాన్ని 146 భవనం (పూర్తి కాంక్రీట్‌తో నిర్మించిన)లో నిల్వ చేస్తారు. ప్రమాద సమయంలో విధుల్లో ఎవరూ లేక ప్రాణనష్టం తప్పింది. కాగా ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న షార్ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వెళ్లి మంటల్ని అదుపు చేయించారు. నిల్వ ఇంధనంలో మంటలు ఎలా వచ్చాయనే దానిపై షార్ ఉన్నతాధికారుల బృందం ఆరా తీస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఒక కమిటీని వేయడానికి నిర్ణయించారు.