solving cases
-
దొంగకు ఖాకీ మద్దతు.. తొమ్మిది నెలలుగా కేసు చేధించకుండా..
సాక్షి, పుట్టపర్తి: ‘నా ఇంట్లో చోరీ జరిగి 9 నెలల వుతోంది. 20 తులాల బంగారాన్ని అపహరించుకెళ్లారు. ఈ సొత్తు రికవరీలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న హోంగార్డు నాగరాజు నాయక్.. పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు స్టేషన్‌కెళ్లి సీఐను కలిసినా ఫలితం లేకుండా పోతోంది. పైగా నన్నే దుర్భాషలాడుతూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎదుట హోంగార్డు లక్ష్మణ నాయక్ వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పీని కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు. పుట్టపర్తిలోని శిల్పారామం సమీపంలో నివాసముంటున్న లక్ష్మణ నాయక్ ఇంట్లో 2022, జూన్ 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ.11 వేలను అపహరించుకెళ్లారు. గోకులం ప్రాంతానికి చెందిన కాటమయ్య, హోంగార్డు నాగరాజు నాయక్‌ను అనుమానితులగా పేర్కొంటూ అప్పట్లో పుట్టపర్తి అర్బన్ పోలీసులకు లక్ష్మణ నాయక్ ఫిర్యాదు చేశాడు. నాగరాజు నాయక్‌పై గతంలోనూ చోరీ కేసులున్నాయని అందులో గుర్తు చేశాడు. బైక్ చోరీ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి వచ్చిన నాగరాజు నాయక్‌ను పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చేరదీసి డ్రైవర్‌గా పెట్టుకున్నారని వివరించాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో అంతులేని నిరక్ష్యం కనబరుస్తున్నారని బాధితుడు వాపోయాడు. చోరీ సొత్తు రికవరీ చేసివ్వాలంటూ స్టేషన్‌కెళ్లి అడిగితే దుర్భాషలాడుతున్నారని వాపోయాడు. పైగా ‘ఎమ్మెల్యేతో ఫోన్‌చేయిస్తే బంగారాన్ని రికవరీ చేయాలా? నా దగ్గర పనిచేసే డ్రైవర్ దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇంకోసారి స్టేషన్‌కు వస్తే బాగుండదు. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని కోరాడు. 63 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. తొలుత ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించి, పరిశీలించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ చేరుకుని అర్జీదారులతో మాట్లాడి సమస్య తీవ్రతపై ఆరా తీశారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. (చదవండి: కనుమరుగవుతున్న కష్టజీవి..) -
ఆ స్టేషన్ పేరువింటే నేరగాళ్లకు హడల్
హైదరాబాద్: 'ఎవరి పేరు చెబితే శత్రువుల గుండెల్లో గుబులు పుడుతుందో..'అనే సినిమా డైలాగ్ గుర్తుందికదా. సరిగ్గా అలాంటి గుబులే ఇప్పుడు నేరస్తులకు కలుగుతోంది ఓ పోలీస్ స్టేషన్ పేరు వింటే! అది.. సినిమా తారలు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతం. అంతకు మించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాక కూడా పోలీసులకు సవాళ్లు విసిరే పొగరుబోతులు తిరిగే చోటు, అప్పుడప్పుడూ రాత్రిపూట కార్లు రోడ్లను వీడి ఫుట్ పాత్ లపైకి వెళుంటాయక్కడ. ఒక్క కేసు నమోదు చేయాలంటే వంద వైపుల నుంచి ఒత్తిళ్లు. ఒక్క నిందితుణ్ని లాకప్ లో పెట్టాలంటే లక్ష తలనొప్పులు! అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. నేరగాళ్లకు శిక్షలు పడేలా కేసులను త్వరితగతిన కేసులను పరిష్కరిస్తూ రికార్డు సాధించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఆ స్టేషన్ పరిథిలో ఎలాంటి నేరానికి పాల్పడేవారైనా హడలెత్తుతున్నారు. వెస్ట్ జోన్ పరిధిలోని 13 స్టేషన్లలో జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదైన కేసుల పరిష్కారంలో అందరి కంటే ముందున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్(యూఐ) కేసుల మేళాలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. పెండింగ్ ఫైళ్లు, కేసుల పరిష్కారంలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అండర్ ఇన్వెస్టిగేషన్ మేళా(యూఐ) నిర్వహించారు. వెస్ట్‌జోన్ పరిధిలోని 13 పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు ఈ మేళాలో పాల్గొని గత మూడు నెలల నుంచి తాము సాధించిన పురోగతిని వివరించారు. ఎన్ని ఫైళ్లను పరిష్కరించారో చూపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేళాలో హైలెట్‌గా నిలిచారు. నగర పోలీస్ కమిషనర్ ఇచ్చిన 227 కేసుల్లో జూబ్లీహిల్స్ పోలీసులు 218 కేసులను పరిష్కరించారు. జూబ్లీహిల్స్ పోలీసులు చేసిన కృషిని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు. ఈ పోలీసులు 104.1 శాతం కేసులను పరిష్కరించినట్లయింది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 348 యూఐ కేసులుండగా 218 కేసులను పరిష్కరించడం అభినందనీయమని తెలిపారు. కేసుల పరిష్కారంలో ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డితో పాటు ఎస్ఐలు డి.శ్రీను, గురుస్వామి, జగదీశ్, లోకారెడ్డి, రమేష్, డీఐ ముత్తు తదితరులు చేసిన కృషి ఫలితమిదని ఆయన అన్నారు.