నగరంలో మరో 7 స్వైన్ఫ్లూ కేసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో గురువారం మరో ఏడు స్వైన్ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులున్నారు. వీరంతా నగరంలోని కిమ్స్, హైదర్గూడ అపోలో, అనుపమ, సోమాజిగూడ యశోద, జూబ్లీహిల్స్ అపోలో,ఆదిత్య,రష్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో మహిళలు 40-50 ఏళ్లు, పురుషులు 30-53 ఏళ్ల మధ్య వారున్నారు. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్ష కోసం ఐపీఎంకు పంపగా స్వైన్ఫ్లూ పాజిటివ్ అని తేలింది.