నత్తే నయం
ఏళ్ల తరబడి సాగుతున్న సోమశిల-రాళ్లపాడు ప్రాజెక్టుల అనుసంధానం
సోమశిల ఉత్తర కాల్వ పొడిగింపు పనుల్లో అలసత్వం
పనులు చేయడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
కందుకూరుసోమశిల-రాళ్లపాడు ప్రాజెక్టుల అనుసంధాన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రైతులను సా గునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రాళ్లపాడు ఆయకట్టు రైతుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే సోమశిల ఉత్తర కాల్వ పొడిగింపులో ఏళ్లకు ఏళ్లు కరిగిపోతున్నాయే తప్ప, పనులు మాత్రం అడుగు ముందుకు కదలడ ం లేదు. దీంతో ఇవి ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
33 కిలోమీటర్ల భారీ కాలువ...
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అ యిన రాళ్లపాడుపై ఆధారపడి ని యోజకవర్గంలోని లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెంతో పా టు, నెల్లూరు జిల్లా కొండాపురం మండల రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. అలాగే వందలాది గ్రామాలకు తాగునీరు అం దించే మంచినీటి పథకాలున్నాయి. అయితే మొదటి నుంచి రాళ్లపాడు రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం వర్షాలపైనే ఆధారపడి ప్రాజెక్టు నిండాల్సి ఉంది. దీంతో ఒక ఏడాది పంటలు పండితే మరో ఏడాది పొలాలు బీడులుగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ కష్టాలను అధిగమించేందుకు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడుకు నీరు తరలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా సోమశిల ఉత్తర కాల్వను పొడిగించడం ద్వారా 1.5 టీఎంసీల నీటిని రాళ్లపాడుకు అందించాలనేది ప్రణాళిక. ఈ పథకానికి అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు. 2006 జూన్ 4న దాదాపు రూ.160 కోట్ల నిధులతో కాల్వ పనులకు బీజం పడింది. సోమశిల ప్రాజెక్టు‘0’ మైలు నుంచి రాళ్లపాడు వద్ద 106.2 మైలు వరకు కాల్వ తవ్వాల్సి ఉంది. అయితే నెల్లూరు జిల్లాలోని రైతులకు నీరందించేందుకు ఆ జిల్లాలోని గుడిపాడు వద్ద 73.92 మైలు వరకు కాల్వ నిర్మించి ఉంది. అక్కడి నుంచి రాళ్లపాడు వరకు 33 కిలోమీటర్ల మేర కాల్వను నిర్మిస్తే సోమశిల-రాళ్లపాడు ప్రాజెక్టుల అనుసంధానం పూర్తవుతుంది. ఈ పనుల కోసం రూ.80 కోట్లు కేటాయించి కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కేవలం గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన పనులు మాత్రమే పూర్తి చేశారు. భారీ సైజులో తవ్విన ఈ కాల్వపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. అయినా వాటి గురించి పట్టించుకోలేదు. కొంతకాలం నిధుల కొరత, కాంట్రాక్టర్ పనులు చేయకపోవడం వంటి ఇబ్బందులతో ఏళ్ల తరబడి పనులు సాగాయి. పనులు చేసే గడువును 2015 వరకు పొడిగించారు. అయితే ఈసారైనా పనులు సకాలంలో పూర్తవుతాయా లేదా అన్న అనిశ్చితి నెలకొని ఉంది.
ఐదేళ్లుగా నిలిచిన కాల్వ పనులు
ఇంకా ఐదు కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉంది. భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులతో ఐదేళ్లుగా ఈ పనులు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా చింతలదీవికి చెందిన రైతులు పరిహారం విషయంలో కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కాల్వ తవ్వకం ఆ గ్రామం వరకు పూర్తయి నిలిచిపోయింది. అక్కడి నుంచి మరో ఐదు కిలోమీటర్ల మేర తవ్వితే రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కాల్వ పూర్తవుతుంది. అయితే పరిహారం విషయం తేలక పనులు నిలిచిపోయాయి.
ఉప్పుటేరు కథ కంచికేనా...
ఇదిలా ఉంటే ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఉప్పుటేరు నుంచి ప్రాజెక్టులోకి నీరు మళ్లించే బృహత్తర ప్రణాళికకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఉప్పుటేరుపై చెక్‌డ్యాం నిర్మించడం ద్వారా సముద్రంలో కలుస్తున్న వర్షం నీటిని ప్రాజెక్టులోకి మళ్లించాలనేది ప్రణాళిక. దీని కోసం రూ.23 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు సిద్ధమై ఆమోద దశకు వెళ్లాయి. అయితే ప్రభుత్వం మారడంతో అవీ బుట్టదాఖలయ్యాయి. దీనిపై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్ర ద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రాళ్లపాడు రైతుల కష్టాలు తీర్చేందుకు రెండు అవకాశాలు అందుబాటులో ఉన్నా అవి మాత్రం అమలుకు నోచుకోవడం లేదు.