sonia mirza
-
ఒకే ఫోటోలో నా జీవితం: సానియా
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ చేతిలో కొడుకు ఇజహాన్‌ను.. మరో చేతిలో టెన్నిస్ రాకెట్‌ను పట్టుకుని టెన్నిస్ కోర్టు నుంచి వస్తున్న ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘ఒకే చిత్రంలో నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి వీడు నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. ’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో అటు తల్లిగా కొడుకు సంరక్షణతో పాటు ఇటు కెరీర్‌ను కూడా సమన్వయం చేస్తున్నావంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మార్చి 8న దుబాయ్‌లో జరిగిన ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా సానియా తన కొడుకును కూడ అక్కడకు తీసుకెళ్లారు. ఆటకు విరామం దొరికినప్పుడల్లా తన కొడుకుకు సమయం వెచ్చించారు. ఇక మార్చి 8న ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1తో విజయం సాధించి తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్‌లో జరిగే ప్లే ఆఫ్‌లో లాత్వియా లేదా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడుతుంది. కాగా సానియా మీర్జా తన కెరీర్లో ఇప్పటి వరకు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియాకు కొడుకు ఇజహాన్ ఉన్నాడు. View this post on Instagram My life in a picture ❤️I wouldn’t hav it any other way 🙌🏽 Allhamdulillah This is right before we played the tie against Indonesia to make the world group play offs for the first time @fedcuptennis .. he inspires me the most to do what I do and be the best I can be 🤗 🎾 👶🏽 @izhaan.mirzamalik A post shared by Sania Mirza (@mirzasaniar) on Mar 11, 2020 at 10:13am PDT -
సెమీస్‌లో భూపతి, మహేశ్
ఎస్‌ఎమ్‌టీఏ-ఏఐటీఏ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)-ఏఐటీఏ సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఎస్.భూపతి, మహేశ్ మహాపాత్ర సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మొయినాబాద్‌లోని ఎస్ఎమ్టీఏలో బుధవారం జరిగిన బాలుర అండర్-12 క్వార్టర్ ఫైనల్లో భూపతి 6-0, 6-7 (2/7), 6-2తో సందీప్‌పై, మహేశ్ 7-5, 6-1తో క్రిష్ పటేల్‌పై గెలుపొందారు. జెవియా దేవ్ 6-4, 6-3తో అనిరుధ్ కుమార్‌పై, జవేరి ఆర్యన్ 6-3, 6-2తో ఆదర్శ్ టిప్పభట్లపై నెగ్గారు. బాలికల అండర్-12 క్వార్టర్స్‌లో రేష్మ 6-3, 1-6, 6-2తో చంద్రిక జోషిపై, ధ్రుతి కపూర్ 6-2, 6-4తో వినీతపై, చౌగులే 6-7 (6/7), 6-2, 6-3తో శ్రుతిపై, శ్రేయ 7-5, 6-0తో అకాంక్షపై విజయం సాధించారు. బాలికల అండర్-14 క్వార్టర్స్‌లో శివాని 6-4, 6-2తో సైదా షకిహ బేగంపై, ధరణ ముదలియార్ 6-2, 6-4తో ఈశ్వరిపై గెలుపొందారు. షేక్ హుమేరా నుంచి రితికకు వాకోవర్ లభించింది. అండర్-14 బాలుర విభాగం క్వార్టర్ ఫైనల్లో శ్రీవత్స 6-3, 6-4తో ప్రలోక్పై, రోహిత్ 3-6, 7-5, 6-3తో నామ హెమన్పై, కుషాల్ 6-2, 6-2తో ఆర్యన్ జవేరిపై విజయం సాధించారు. -
రన్నరప్ సానియా జోడి
బీఎన్పీ పారిబా ఓపెన్ టోర్నీ ఇండియన్ వెల్స్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి బీఎన్పీ పారిబా ఓపెన్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా జోడి 6-7 (5/7), 2-6తో టాప్‌సీడ్ సై సువీ (తైవాన్)- పెంగ్ షువాయ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన సానియా జంట ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. రెండో సెట్లో మాత్రం సై సువీ ద్వయం పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. -
క్రీడాకారిణుల పట్ల దృక్పథం మారాలి
భువనేశ్వర్: భారత్‌లో ఓ మహిళ సెలబ్రెటీకి క్లిష్టమైన సవాళ్లే ఎదురవుతాయని సానియా మీర్జా చెప్పింది. పెను సవాళ్లను ఎదుర్కొనే తాను ఈ స్థాయికి ఎదిగానని తెలిపింది. పురుషాధిక్య సమాజంలో క్రీడాకారిణుల పట్ల అవలంభించే దృక్పథంలో మార్పు రావాలని ఆమె అభిప్రాయపడింది. ఆదివారం ఇక్కడ జరిగిన ‘క్రీడల్లో మహిళలు-ముందడుగు’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆమె పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ ‘ఇక్కడ మహిళా సెలబ్రిటీ కావడమే కష్టమైన పని. వీరిని ఆడిగే ప్రశ్నల సరళే ఓ విధంగా ఉంటుంది. ఏ డ్రెస్సులు వేస్తారు? ఏం మాట్లాడతారు? మీరు పిల్లల్ని ఎప్పుడు కంటారు లాంటి కొంటే ప్రశ్నలే. పురుషులకు మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఉండవు. అంతెందుకు సంతానం గురించి నన్నడిగినట్లు మావారి (షోయబ్ మాలిక్)ని ఎన్నడు అడిగిన దాఖలాల్లేవ్. ఇక్కడ నేను చెప్పేదొక్కటే... క్రీడాకారిణుల పట్ల ప్రజల ధోరణి మారాలి’ అని ఆమె పేర్కొంది. మహిళా ప్లేయర్లు సవాళ్లపై సమరం చేయాలని ఆమె సూచించింది. అప్పుడే లక్ష్య సాధనకు చేరువవుతారని చెప్పింది. ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య కటక్ వన్డే వర్షార్పణమైంది. మీడియాలో దీని ప్రాధాన్యమే వేరు. అంటే... పురుషుల క్రికెట్ ఆడినా ప్రముఖ వార్తే, రద్దయినా అంతే ప్రాధాన్యం! కానీ మహిళ క్రికెట్ మ్యాచ్‌లపై అ స్థాయి వార్తల్ని నేనెన్నడు చూడలేదు, చదవలేదు’ అని హైదరాబాదీ స్టార్ పేర్కొంది.