ఒకే ఫోటోలో నా జీవితం: సానియా | Sania Mirza Shares A Picture With Son Izhaan In Tennis Court | Sakshi
Sakshi News home page

ఒకే ఫొటోలో నా జీవితం: సానియా మీర్జా

Published Thu, Mar 12 2020 1:38 PM | Last Updated on Thu, Mar 12 2020 1:41 PM

Sania Mirza Shares A Picture With Son Izhaan In Tennis Court - Sakshi

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తాజాగా ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఓ చేతిలో కొడుకు ఇజహాన్‌ను.. మరో చేతిలో టెన్నిస్‌ రాకెట్‌ను పట్టుకుని టెన్నిస్‌ కోర్టు నుంచి వస్తున్న ఫోటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఒకే చిత్రంలో నా జీవితం. నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి వీడు నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. ’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో అటు తల్లిగా కొడుకు సంరక్షణతో పాటు ఇటు కెరీర్‌ను కూడా సమన్వయం చేస్తున్నావంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా మార్చి 8న దుబాయ్‌లో జరిగిన ఫెడ్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ సందర్భంగా సానియా తన కొడుకును కూడ అక్కడకు తీసుకెళ్లారు. ఆటకు విరామం దొరికినప్పుడల్లా తన కొడుకుకు సమయం వెచ్చించారు. ఇక మార్చి 8న ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1తో విజయం సాధించి తొలిసారి వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఆరు జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్‌లో జరిగే ప్లే ఆఫ్‌లో లాత్వియా లేదా నెదర్లాండ్స్‌ జట్టుతో భారత్‌ ఆడుతుంది. కాగా సానియా మీర్జా తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. 2010లో పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న సానియాకు కొడుకు ఇజహాన్ ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement