ఎస్‌ఎమ్‌టీఏ-ఏఐటీఏ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)-ఏఐటీఏ సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఎస్.భూపతి, మహేశ్ మహాపాత్ర సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మొయినాబాద్‌లోని ఎస్‌ఎమ్‌టీఏలో బుధవారం జరిగిన బాలుర అండర్-12 క్వార్టర్ ఫైనల్లో భూపతి 6-0, 6-7 (2/7), 6-2తో సందీప్‌పై, మహేశ్ 7-5, 6-1తో క్రిష్ పటేల్‌పై గెలుపొందారు. జెవియా దేవ్ 6-4, 6-3తో అనిరుధ్ కుమార్‌పై, జవేరి ఆర్యన్ 6-3, 6-2తో ఆదర్శ్ టిప్పభట్లపై నెగ్గారు. బాలికల అండర్-12 క్వార్టర్స్‌లో రేష్మ 6-3, 1-6, 6-2తో చంద్రిక జోషిపై, ధ్రుతి కపూర్ 6-2, 6-4తో వినీతపై, చౌగులే 6-7 (6/7), 6-2, 6-3తో శ్రుతిపై, శ్రేయ 7-5, 6-0తో అకాంక్షపై విజయం సాధించారు.
బాలికల అండర్-14 క్వార్టర్స్‌లో శివాని 6-4, 6-2తో సైదా షకిహ బేగంపై, ధరణ ముదలియార్ 6-2, 6-4తో ఈశ్వరిపై గెలుపొందారు. షేక్ హుమేరా నుంచి రితికకు వాకోవర్ లభించింది. అండర్-14 బాలుర విభాగం క్వార్టర్ ఫైనల్లో శ్రీవత్స 6-3, 6-4తో ప్రలోక్‌పై, రోహిత్ 3-6, 7-5, 6-3తో నామ హెమన్‌పై, కుషాల్ 6-2, 6-2తో ఆర్యన్ జవేరిపై విజయం సాధించారు.
సెమీస్‌లో భూపతి, మహేశ్
Published Thu, Apr 24 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM
Advertisement
Advertisement