హెచ్ఐవీకి సోయా సాస్‌తో విరుగుడు
సోయా సాస్‌లో రుచిని పెంచేందుకు ఉపయోగించే ఈఎఫ్‌డీఏ అనే మాలిక్యూల్‌తో హెచ్ఐవీ, ఇతర వైరస్ల నివారణకు మందు తయారు చేయొచ్చట. ఎయిడ్స్ నివారణకు కొత్త మందులపై పరిశోధిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు ఈ దిశగా ముందడుగు వేశారు. ప్రస్తుతం ఎయిడ్స్‌కు టీనోఫోవిర్‌ను ఔషధంగా వాడుతున్నారు.
ఈ మందుకు హెచ్ఐవీ నిరోధకత ఏర్పర్చుకుంటుండటం వల్ల మరింత శక్తిమంతమైన మందులను వాడాల్సిన వస్తోంది. అయితే సోయా సాస్‌కు రుచిని పెంచే ఈఎఫ్‌డీఏ మాలిక్యూల్‌ను పరీక్షిస్తుండగా.. దీనికి వైరస్ల వ్యాప్తిని అడ్డుకునే లక్షణం ఉన్నట్లు జపాన్ కంపెనీ 2001లో గుర్తించింది. తర్వాత దీనిపై కొనసాగుతూ వచ్చిన పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. హెచ్ఐవీ కణాల మూలాలపై దెబ్బకొడుతూ ఆ కణాలు విభజన చెందకుండా ఈఎఫ్‌డీఏ అడ్డుకుంటుందట. టీనోఫోవిర్ కన్నా ఈ మాలిక్యూల్ 70 రెట్లు శక్తిమంతమైనది కావడం విశేషం.