special adviser
-
ట్రంప్ సలహాదారుగా భారతీయుడు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ప్రత్యేక సలహాదారుగా భారత సంతతికి చెందిన న్యాయవాది ఉత్తమ్ ధిలాన్ నియమితులయ్యారు. న్యాయం, నైతికతకు సంబంధించిన విషయాల్లో ట్రంప్‌కి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా డొనాల్డ్ ఎఫ్ మెక్ గాన్ నేతృత్వంలోని వైట్ హౌస్ కమిటీలో స్థానం సాధించారు. ప్రస్తుతం ఆయన హౌస్ బ్యాంకింగ్ కమిటీలో చీఫ్ ఓవర్‌సైట్ కౌన్సిల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కౌంటర్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్మెంట్ విభాగంలో హోంలాండ్ సెక్యూరిటీ ఆఫీస్‌లో చీఫ్‌గా పనిచేశారు. -
ప్రత్యేక సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు (అంతర్రాష్ట్ర సంబంధాలు) పదవికి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అందజేయగా ప్రభుత్వం దాన్ని వెంటనే ఆమోదిస్తూ ఉత్తర్వులు (జీఓ ఆర్టీ నం.1206) జారీ చేసింది. రాష్ర్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావుతోపాటు తన పేరును పార్టీ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవిని వదులుకోవాలని డీఎస్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 31న ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతేడాది ఆగస్టు 21న ప్రభుత్వం అంతర్రాష్ట్ర సంబంధాల వ్యవహారాల కోసం డీఎస్‌ను ప్రత్యేక సలహాదారుగా ఏడాది పదవీకాలానికి నియమించింది.