Special Chief Secretary
-
సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్‌రెడ్డి బాధ్యతలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. ఇంతకుముందు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. -
AP: ముగ్గురు ఐఏఎస్‌లకు స్పెషల్ సీఎస్‌లుగా పదోన్నతి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేడర్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ), ఎక్స్ అఫీసియో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న కే. విజయా నంద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్, రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న బి. రాజశేఖర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న పోస్టుల్లోనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కలిసిన ఏపీఆర్ఎస్ఏ నేతలు
సాక్షి, అమరావతి: 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించడంతో ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కలిసి ఏపీఆర్ఎస్ఏ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ‘30-35 ఏళ్లపాటు రెవెన్యూశాఖలో ఉద్యోగులు సుదీర్ఘమైన సేవలందిస్తారని.. తహశీల్దార్‌గా పదోన్నతి పొంది పదవీ విరమణ చేయడం ఉద్యోగి కల’ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అటువంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీసీఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని బొప్పరాజు అన్నారు. -
అసత్య వార్తలపై హెల్త్ స్పెషల్ సీఎస్ సీరియస్
సాక్షి, అమరావతి: అభినందించకపోయిన పర్వాలేదని.. విమర్శలు మాత్రం చేయొద్దని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు అసత్య వార్తలను ప్రచురించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పడు సమాచారం ప్రచురించవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. ప్రస్తుతం తొమ్మిది ల్యాబ్‌ల్లో రోజుకు 3,480 టెస్టులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 45 వేల టెస్ట్‌లు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ జోన్లలో 56, ఆరెంజ్ జోన్లలో 47, కేసులు నమోదు కాని గ్రీన్ జోన్లలో 573 మండలాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. (కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష) సగటున 830 టెస్టులు.. ఏపీలో 10 లక్షల మందికి సగటున 830 టెస్టులు చేస్తున్నామని.. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో నాలుగు స్టేట్ కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయని.. కర్నూలు ఆసుపత్రిని కూడా స్టేట్ కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించామని తెలిపారు. 13 జిల్లాల కోవిడ్ ఆసుపత్రులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 మంది కరోనా బారినపడి మరణించారని తెలిపారు. (రెడ్జోన్లలో మిని కోవిడ్-19 సెంటర్లు: ఆళ్ల నాని) రాష్ట్రంలో 3 లక్షలకుపైగా పీపీఈ కిట్లు.. రాష్ట్రంలో పీపీఈ కిట్లు 3 లక్షలకు పైగా ఉన్నాయని.. లక్షా 40వేలు దాకా ఎన్-95 మాస్క్‌లు ఉన్నాయని చెప్పారు. మనిషికి 3 మాస్క్‌లు చొప్పున 16 కోట్లు మాస్క్‌లే పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలనే నిబంధన కూడా అమలు చేస్తామన్నారు. కొత్తగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఓరుగల్లు ఆతిథ్యం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు చారిత్రక ఓరుగల్లు ఆతిథ్యమిచ్చింది. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు హన్మకొండలోని హరిత హోటల్లో ఏర్పాటుచేసిన సమావేశానికి మూడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల కలెక్టర్లతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ హాజరయ్యారు. సుదీర్ఘంగా సుమారు 7.50 గంటల పాటు ఈ సమావేశం జరగగా మధ్యాహ్న భోజనం హరిత హోటల్లో.. రాత్రి భోజనం అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేశారు. నోరూరించే తెలంగాణ రుచులతో భోజన ఏర్పాట్లు చేయగా పాత, కొత్త అధికారుల పలకరింపులతో సమావేశం సాగింది. ఇక రాత్రి ఇక్కడ బస చేసిన కలెక్టర్లు బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తున్నట్లు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ తెలిపారు. ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహఱిస్తున్న సోమేష్‌కుమార్ మంగళవారం హన్మకొండలోని హరిత హోటల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై చర్చించారు. ఆనంతరం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. మూడేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూడడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మొదటగా రెవెన్యూ వ్యవస్థను మెరుగుపరిచేందుకు జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించినట్లు వివరించారు. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా మెరుగైన పౌర సేవలను సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను కార్యాచరణలోకి తీసుకుని ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లనున్నట్లు సోమేష్‌కుమార్ వెల్లడించారు. సోమేష్‌కుమార్‌తో మొదలు... హరిత కాకతీయ హోటల్లో మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలకు సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి 30 జిల్లాల కలెక్టర్లతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటట్రీ సోమేష్‌కుమార్, ముఖ్య అధికారులు హాజరయ్యారు. అధికారుల్లో మొదటగా సీసీఏల్ఏ సోమేష్‌కుమార్ ఉదయం 11గంటలకు హరిత హోటల్‌కు చేరుకోగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఆర్డీఓ వెంకారెడ్డి, హన్మకొండ తహసీల్దార్ బావుసింగ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమావేశ ఏర్పాట్లపై ఆయనకు వివరించారు. కలెక్టర్ల కాళేశ్వరం టూర్‌కు రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు వస్తారని ముందుగా అనుకున్నప్పటికీ మంగళవారం సీసీఎల్ఏ సోమేష్‌కుమార్ సమావేశం ముగిసే మహబూబ్‌నగర్, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లా కలెక్టర్లు మినహా మిగిలిన వారందరూ వచ్చారు. అయితే వీరు బుధవారం కాళేశ్వరం సందర్శనకు వచ్చే అవకాశముందని సమాచారం. ప్రత్యేక బస్సులో కాళేశ్వరానికి... అన్ని జిల్లాల కలెక్టర్లు బుధవారం ఉదయమే తెలంగాణ టూరిజం శాఖకు చెందిన ప్రత్యేక ఏసీ బస్సు(ఏపీ 23 వై 5128) లో ఉదయం 6 గంటలకు కా>ళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. హరిత హోటల్లో మంగళవారం జరిగిన వర్క్‌షాప్ అనంతరం రాత్రి వరంగల్ అర్బన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. నోరూరించే రుచులతో విందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆధ్వర్యంలో మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. ఇదే విషయాన్ని సమావేశం ప్రారంభంలో సీసీఎల్ఏ సోమేష్‌కుమార్ ప్రస్తావిస్తూ కలెక్టర్‌ను అబినందించారు. తక్కువ సమయంలో మంచి ఆతిథ్యం ఏర్పాటుచేశారని కొనియాడారు. హరిత హోటల్ లో మధ్యాహ్న భోజనంగా పసందైన రుచులు వడ్డించారు. తెలంగాణ, ఆంధ్రా వంటకాలతో పాటు నార్త్, సౌత్ ఇండియా ఫేమస్ వంటకాలు ఉన్నాయి. నాటు కోడి, బాయిలర్ కోడి, మేక మాంసం, కొర్రమీను ప్రై, కోడిగుడ్లతోపాటు స్వీట్లు కుర్బానీకా మీటా, కాలా జామూన్, ఐస్‌క్రీంలు ఇందులో ఉన్నాయి. కలెక్టర్లకు సూచనలు చేస్తున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్ నేడు కాళేశ్వరానికి కలెక్టర్ల బృందం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లు బుధవారం సందర్శించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హన్మకొండలో ఉన్న కలెక్టర్లు బుధవారం ఉదయం 6.30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 9.15గంటలకు మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడ అల్ఫాహారం తీసుకున్నాక 10.15గంటలకు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌తో సమావేశమవుతారు. ఇక 11గంటలకు మేడిగడ్డ బ్యారేజీని వీక్షించి కాళేశ్వరం చేరుకుని శ్రీకాళేశ్వరముక్తీశ్వరాలయంలో పూజలు చేస్తారు. ఆ తర్వాత 12.30గంటలకు కన్నెపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న కలెక్టర్లు మధ్యాహ్నం ఒంటి గంటకు లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 1.45గంటలకు కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో భోజనం చేశాక పెద్దపల్లి జిల్లా నందిమేడారం టన్నల్ పంపుహౌస్ పరిశీలించేందుకు బయలుదేరతారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కలెక్టర్ బంగ్లాలో రాత్రి భోజనం రెండు రోజుల కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన కలెక్టర్లకు మొదటి రోజైన మంగళవారం మధ్యాహ్న భోజనం, బస హరిత హోటల్లో ఏర్పాటు చేశారు. ఇక రాత్రి భోజనాలు మాత్రం సుబేదారిలోని అర్బన్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది కోసం ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయగా అశోక హోటల్ నుంచి భోజనాలు తెప్పించారు. కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల్లోఎక్కువగా తెలంగాణ వారే ఉండటంతో రాత్రి భోజనం మెనూలో ఇక్కడి వంటలకే ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా మాంసాహారం వంటకాల్లో పచ్చి రొయ్యల వేపుడు, చేపల వేపుడు, నాటుకోడి వేపుడు, చికెన్ పింగ్ రోల్స్, చికెన్ కబాబ్స్, మటన్ ఫ్రై, మటన్ కర్రీ, బగారా, బిర్యానీ తెప్పించారు. అలాగే, శాఖాహారంలోనూ సాంబార్, ఇతర కూరలు, చట్నీలు ఉన్నాయి. స్వీట్ల విషయంలో ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్‌తో సిద్ధం చేయించగా వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్‌తో పాటు అధికారులను అందరూ అభినందించారు. పాతవారి పలకరింపులు హరిత హోటల్లో జరిగిన సమావేశానికి హాజరైన కలెక్టర్లలో కొందరు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన వారు ఉన్నారు. దీంతో జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు వారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ మేరకు కలెక్టర్లు సైతం తమ వద్ద పనిచేసిన ఉద్యోగులను పేరుపేరునా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. సమావేశం ప్రారంభానికి ముందు కొంతసేపు ఇదే కార్యక్రమం కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో వరంగల్ ఆర్డీవోగా పనిచేసి సర్వే సంగీత, డీఆర్డీఏ పీడీ, జెడ్పీ సీఈఓగా పనిచేసిన వాసం వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఐఏఎస్ అధికారులుగా జిల్లాకు వచ్చారు. దీంతో గతంలో వారి వద్ద పనిచేసిన అధికారులు, ఉద్యోగులు కలిశారు. రెవెన్యూ... పోలీసు... ఎక్సైజ్ హన్మకొండలోని హరిత హోటల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అత్యున్నత అధికారులందరూ రానుండడంతో జిల్లా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడే మకాం వేసి ఏ లోటు రాకుండా చూశారు. హరితహోటల్ ఆవరణలోకి కేవలం కలెక్టర్ల వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. ఇక కలెక్టర్ల సహాయకులు, భధ్రతా సిబ్బందికి ఆర్అండ్బీ, సర్క్యూట్ అతి«థిగృహాల్లో గదులు కేటాయించారు. భోజనాలు మాత్రం అందరికీ హరిత హోటల్లో ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధ్వర్యాన కట్టుదిట్టమైన భద్రత కొనసాగింది. ప్రతి ఒక్కరినుంచి వివరాలు అడిగి తీసుకున్నారు. స్థానిక అధికారులతో నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులను లోపల ఉండనిచ్చారు. వర్క్‌షాప్‌లో అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లు సీహెచ్.శివలింగయ్య, వాసం వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, వినయ్‌కృష్ణారెడ్డి, హరిత, శ్వేతా మహంతి, ఆర్వీ.కర్ణన్, కృష్ణభాస్కర్, అనితా రామచంద్రన్, రజత్‌కుమార్ షైనీ, సర్ఫరాజ్ అహ్మద్, హన్మంతరావు, భారతి హోలీకేరి, శశాంక, శ్రీధర్, వెంకట్రావు, అమయ్‌కుమార్, దివ్య దేవరాజన్, రాజీవ్‌గాంధీ హన్మంతు, మాణిక్ రాజా, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’లో మొదలుకానున్న డిస్ట్రిబ్యూటరీల సర్వే
సాక్షి, హైదరాబాద్: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి సమీక్షించారు. ఈ సమీక్షకు ప్రాజెక్టు సీఈ లింగరాజు, ఎస్ఈ రమేశ్‌లతో పాటు ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా ఉన్న ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్ ప్రతిని ధులు హాజరయ్యారు. ప్రాజెక్టు భూ సేకరణ, కాంట్రాక్టు ఏజెన్సీల పను లు, నిధుల ఖర్చు తదితరాలపై సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అప్రోచ్ చానల్, పంప్‌హౌజ్‌ల సర్వే పూర్తై, డిస్ట్రిబ్యూటరీ కాలువల సర్వే పూర్తి కాలేదనీ, ఈ ప్రక్రియను ఆరంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిసిం ది. ఇక ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 26,506 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా 13 వేల ఎకరాలు సేకరించారని, మిగతా భూమిని వీలైనంత త్వరగా సేకరించాలని జోషి సూచించారు. ఏజెన్సీలు పనుల్లో వేగం పెంచేలా చూడాలని, వచ్చే జూన్ నాటికి మెజార్టీ పనులు ముగిం చాలని సూచించినట్లు తెలిసింది. -
స్వర్గమా.. సెస్‌కు నరకమా!
- గతమంతా అవినీతిమయం - ఆయనకే మళ్లీ ఎండీ పోస్టింగ్ - రూ.3.08 కోట్ల అవినీతికి జేజేలు - విచారణ నివేదిక తుంగలో తొక్కారా? - విజిలెన్స్ విచారణ ఫైలు ఎక్కడాగింది? - హాట్ టాపిక్‌గా మారిన రంగారావు నియామకం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అయిదేళ్ల కిందట ఆయన హయాంలోనే భారీగా అవినీతి జరిగింది. సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ లిమిటెడ్‌లో (సెస్)లో కనీసం రూ.3 కోట్ల సొమ్ము దుర్వినియోగమైంది. స్వయానా ఎన్పీడీసీఎల్ అధికారుల ప్రాథమిక విచారణలో ఈ అవినీతి స్వరూపం బట్టబయలైంది. ఆ విచారణ సైతం తూతూమంత్రంగానే సాగిందని... లోతుపాతులు తవ్వితే మరిన్ని లొసుగులు వెలికి వస్తాయని అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ ఈ వ్యవహారాన్ని విజిలెన్స్ విచారణకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. జేసీ రాసిన లేఖను పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఐవీఆర్ కృష్ణారావు గత ఏడాది మే 25న రిజిస్ట్రార్ అండ్ కమిషనర్‌కు రిమైండర్ రాశారు. కానీ.. ఇప్పటికీ ఈ ఫైలు ముందుకు కదల్లేదు. దీంతో విజిలెన్స్ విచారణ ప్రారంభం కాకముందే కొండెక్కినట్లయింది. సిరిసిల్ల సెస్ కేంద్రంగా జరిగిన అవినీతి తుట్టెను కదిపితే.. ఎవరికి చుట్టుకుంటుందోననే భయంతో కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఫైలును తొక్కిపెట్టినట్లు ప్రచారం జరిగింది. ఇదంతా జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వం కొలువుదీరగానే అనుచిత నిర్ణయం వెలువడింది. అప్పట్లో ఎవరి హయాంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు... అభియోగాలున్నాయో.. ఆయననే మరోసారి సెస్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమించింది. సిరిసిల్ల సెస్ ఎండీగా స్వర్గం రంగారావును నియమిస్తూ రెండు రోజుల కిందట ఎన్పీడీసీఎల్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2007 జూలై నుంచి 2010 మే వరకు ఆయన సెస్ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలోనే భారీగా అవినీతి, అవకతవకల దుమారం చెలరేగింది. 2007-2010 మధ్య కాలంలో ఇంప్రూవ్మెంట్ వర్క్స్ పేరిట జరిగిన పనుల్లో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయి. సిరిసిల్ల సెస్ పరిధిలో తొమ్మిది మండలాలున్నాయి. దాదాపు 300 గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేసే సహకార సంఘంగా దేశంలోనే సిరిసిల్ల సెస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నీటిపారుదల సదుపాయం లేని మెట్ట ప్రాంతంలో ఉన్న మండలాలకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ఢిల్లీలోని ఆర్ఈసీ ఆర్థిక సహకారంతో 43 ఏళ్ల కిందట సెస్ ఏర్పడింది. 2007-10 మధ్య కాలంలో భారీ మొత్తంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు ఎన్పీడీసీఎల్ విచారణ కమిటీని నియమించింది. అప్పటి చీఫ్ ఇంజనీర్ కె.కృష్ణయ్యను విచారణ అధికారిగా నియమించారు. వరుసగా మూడేళ్ల వ్యవధిలో జరిగిన అవకతవకలు, అందుకు బాధ్యులైన ఉద్యోగులు, అధికారులపై సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించింది. ఈ విచారణ కమిటీ మొత్తం రూ 3.08 కోట్ల అవినీతి జరిగినట్లు ధ్రువీకరించింది. జరిగిన అవకతవకలను ఉటంకించటంతో పాటు బాధ్యులైన ఉద్యోగులు, అధికారుల వివరాలను సైతం వేలెత్తి చూపింది. వరుసగా మూడేళ్ల వ్యవధిలో సెస్ పరిధిలో ఇంప్రూవ్మెంట్, డిపాజిట్ కంట్రిబ్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మైనర్ ఎక్స్టెన్షన్ విభాగాలుగా మొత్తం 3207 పనులు జరిగాయి. అందులో కేవలం 1837 పనులను విచారణ కమిటీ తనిఖీ చేసింది. మిగతా 1370 పనులను సెస్ అధికారులు రికార్డులు సమర్పించకపోవటంతో తనిఖీ చేయలేకపోయినట్లు విచారణ నివేదికలో పేర్కొంది. ఇంప్రూవ్మెంట్ వర్క్స్‌లోనే భారీగా దుర్వినియోగం జరిగింది. అగ్రిమెంట్లు చేసుకోకుండానే ఏడీఈ, డీఈలు కాంట్రాక్టర్లతో పనులు చేయించి ఏకంగా బిల్లులు చెల్లించినట్లు నిర్ధారించింది. కేవలం 89 పనులకు సంబంధించిన బిల్లులను కమిటీ పరిశీలించింది. అందుకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.3.16 లక్షలు చెల్లించాల్సి ఉండగా రూ.7.56 లక్షలు అదనంగా చెల్లింపులు జరిగినట్లు బయటపడింది. సెక్షన్ ఆఫీసర్లు స్టోర్ నుంచి తీసుకున్న మెటీరియల్‌లో కొంత మొత్తం వినియోగించి, మిగతాదంతా పక్కదారి పట్టించినట్లు వేలెత్తి చూపింది. పనులు పూర్తి కాకుండానే.. కనీసం వర్క్ ఆర్డర్లు, అగ్రిమెంట్లు లేకుండానే కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరగటంతో సెస్‌కు భారీ మొత్తం గండి పడింది. పలువురు ఏడీఈ, డీఈలతో పాటు ఏఏఓ, ఏఓలు, సెక్షన్ ఆఫీసర్లకు ఇందులో ప్రమేయముందని, అప్పటి ఎండీ రంగారావు పర్యవేక్షణ లోపం ఉందని విచారణ కమిటీ నిగ్గు తేల్చింది. మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈ కేసును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాలని అప్పట్లో సెస్‌కు పర్సన్ ఇన్చార్జిగా ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంత జరిగినా అప్పటి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు, దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఉన్నతాధికారులు వెనుకంజ వేయటం అనుమానాలకు తావిస్తోంది. ఈలోగా విచారణ పేరుతోమరో రూ.10 లక్షలకు పైగా సెస్ ఖజానాకు గండి పడింది. ఇదేమీ పట్టించుకోకుండా అవినీతి హయాంగా ముద్రవేసుకున్న అధికారికే మరోసారి సెస్ ఎండీగా బాధ్యతలు అప్పగించటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సెస్‌లో జరిగిన అవినీతికి ఉన్నత స్థాయిలోనే లింక్లున్నాయా.. అప్పటి అవినీతి ఫైళ్లను తొక్కిపెట్టేందుకు కొత్తగా మళ్లీ పాత ఎండీని రంగంలోకి దింపారా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నామినేటేడ్ పదవులతో ముడిపడి ఉన్న సహకార సంఘం కావటంతో సెస్ ఎండీ నియామకం అందరి నోటా హాట్ టాపిక్‌గా మారింది.