పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి సమీక్షించారు.
సాక్షి, హైదరాబాద్: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి సమీక్షించారు. ఈ సమీక్షకు ప్రాజెక్టు సీఈ లింగరాజు, ఎస్‌ఈ రమేశ్‌లతో పాటు ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా ఉన్న ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్ ప్రతిని ధులు హాజరయ్యారు. ప్రాజెక్టు భూ సేకరణ, కాంట్రాక్టు ఏజెన్సీల పను లు, నిధుల ఖర్చు తదితరాలపై సమీక్షించారు.
ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే అప్రోచ్ చానల్, పంప్‌హౌజ్‌ల సర్వే పూర్తై, డిస్ట్రిబ్యూటరీ కాలువల సర్వే పూర్తి కాలేదనీ, ఈ ప్రక్రియను ఆరంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిసిం ది. ఇక ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 26,506 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా 13 వేల ఎకరాలు సేకరించారని, మిగతా భూమిని వీలైనంత త్వరగా సేకరించాలని జోషి సూచించారు. ఏజెన్సీలు పనుల్లో వేగం పెంచేలా చూడాలని, వచ్చే జూన్ నాటికి మెజార్టీ పనులు ముగిం చాలని సూచించినట్లు తెలిసింది.