Special corridor
-
Visakhapatnam: 49 కిలోమీటర్లు.. 55 నిమిషాల్లో వెళ్లేలా..
విశాలమైన సముద్రతీరం.. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కెరటాలు.. ఆ అలల సవ్వడుల నుంచి మనసును హత్తుకునేలా వీస్తున్న చల్లని చిరు గాలులు. ఆ గాలుల మధ్య నుంచి ప్రయాణం ఎంత బాగుంటుందో కదా.. త్వరలో ఆ అనుభూతులను ఇక్కడే పొందవచ్చు. విశాఖ సాగరతీరం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా 40 నుంచి 70 మీటర్ల వెడల్పుతో కోస్టల్ బ్యాటరీ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు కానుంది. – సాక్షి, విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు నేపథ్యంలో విశాఖ నుంచి భోగాపురం వెళ్లేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ఒక్కో అడుగు పడుతోంది. ఎన్‌హెచ్–16 ఉన్నప్పటికీ.. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరో ప్రధాన రహదారి కచ్చితంగా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా రాజధానికి రాచమార్గంగా కోస్టల్ హైవే నిర్మాణానికి అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముందుగా భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆరు లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని భావించారు. అయితే నగరానికి అనుసంధానం చేస్తూ ఈ రహదారి ఉండాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలతో కోస్టల్ బ్యాటరీ నుంచి నేరెళ్లవలస వరకు ఒక విభాగంగా, అక్కడి నుంచి భోగాపురం వరకు గ్రీన్‌ఫీల్డ్ విభాగంగా విస్తరించేందుకు సమాయత్తమవుతున్నారు. చదవండి: (ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ) కోస్టల్ బ్యాటరీ నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్ బీచ్‌రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ నుంచి నేరెళ్లవలస వరకు మాస్టర్‌ప్లాన్ రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జీవీఎంసీ సహకారంతో వీఎంఆర్డీఏ 49 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయనుంది. ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి.. రహదారి నిర్మాణం చేపట్టాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి కైలాసగిరి రోప్‌వే వరకు 40 మీటర్ల రహదారిగా, రోప్‌వే నుంచి జోడుగుళ్ల పాలెం వరకు 45 మీటర్లు, జోడుగుళ్లపాలెం నుంచి నేరెళ్లవలస వరకు 60 మీటర్ల రహదారిగానూ అభివృద్ధి చేయనున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రూ.116.71 కోట్లతో బీచ్‌ఫ్రంట్ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సమాయత్తమవుతోంది. సీఆర్‌జెడ్ అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. పార్క్‌హోటల్ నుంచి వీఎంఆర్డీఏ మిగిలిన పనులకు శ్రీకారం చుట్టనుంది. భీమిలి బీచ్‌రోడ్డు 49 కిలోమీటర్లు.. 55 నిమిషాలు మొత్తంగా విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు తీరం వెంబడి ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం 49 కిలోమీటర్ల 6 నుంచి 8 లైన్ల రోడ్డు నిర్మాణం సాగనుంది. ఈ రహదారి వెంబడి అవకాశం ఉన్న చోట ఇండ్రస్టియల్ పార్కులు, ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ రహదారి వెంబడి ప్రభుత్వ భూమి ఎంత ఉంది.. సాధ్యాసాధ్యాలపై నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల ప్రకారం భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 714.60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి వంపులు లేకుండా ప్రయాణం కాస్తా సాఫీగా సాగేలా 90 డిగ్రీల కోణంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. భీమిలి నుంచి భోగాపురం వరకు 60 నుంచి 70 మీటర్ల విస్తీర్ణంతో రహదారి నిర్మాణం సాగించాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 49 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లో వెళ్లేలా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచాం విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మెయిన్ గేట్ వరకు 49 కిలోమీటర్ల కోస్టల్ హైవే నిర్మాణం జరగనుంది. బంగాళాఖాతం వెంబడి ఈ కోస్టల్ హైవే నిర్మాణం జరగనున్న నేపథ్యంలో...వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నిపుణులతో అధ్యయనం చేస్తున్నాం. కమిషనర్ సూచనల మేరకు ఆర్ అండ్ బీ అలైన్మెంట్తో మాస్టర్‌ప్లాన్–2041లో ఈ రహదారిని పొందుపరిచాం. ప్రాజెక్ట్ అంచనా వ్యయం, నిధుల సమీకరణ మొదలైన అంశాలనీ ప్రభుత్వం పరిశీలించనుంది. ఎలాంటి వంపులు లేకుండా పూర్తిస్థాయిలో రోడ్డు నేరుగా ఉండాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం డైమండ్ సర్క్యూట్ ఆకారంలో రోడ్డును నిర్మించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. – సురేష్‌కుమార్, వీఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ -
‘నా కౌగిలింత పని చేసింది’
చండీగఢ్ : నేను ఇచ్చిన ‘జప్పి’(కౌగిలింత) పనిచేసిందంటున్నారు భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ. భారత్ – పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు పాక్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన సిద్ధూ.. పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత గురించి సిద్ధూ ‘అతనే నా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. కర్తార్‌పూర్‌లోని సాహిబ్ కారిడార్ తెరవడం గురించి మాట్లాడుకున్నామం’టూ సిద్ధూ వివరణ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో సాహిబ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు అంగీకారం తెలపడంతో ‘నా కౌగిలింత ఫలించింది. కారిడార్ ఒపెన్ అయినప్పుడు ముద్దు ఇస్తానం’టూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. ‘సిద్ధూ పంజాబ్ క్యాబినేట్ బదులు పాక్ క్యాబినేట్లో ఉన్నాడేమో అనిపిస్తుంది. భారతదేశానికి కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి పాక్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాడంటూ’ మండిపడ్డారు. -
కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారిడాక్కు ఈ నెల 26న రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మిస్తామని పాక్ ప్రకటించింది. గురువారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం, ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న అనంతర పరిణామాలపై కేబినెట్ క్లుప్తంగా చర్చించింది. నానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయాల్లో కొన్ని.. ► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కేంద్రం నిధులతో ఆధునిక వసతులతో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు. ∙పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్‌ను భారత్ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్ ఏర్పాటు. ∙చారిత్రక సుల్తాన్పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు. ► భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలోనే కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలిæ గురుద్వారా ఏర్పాటైంది. ► ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు. ► ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు–2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి. ► అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఓకే. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి. -
వన్యప్రాణుల రక్షణకు కారిడార్
ఈ వారంలో కేంద్ర బృందంతో సమావేశం కందకాలతో ఏనుగుల దాడుల నివారణ సోలార్ ఫెన్సింగ్ పనులు త్వరలో ప్రారంభిస్తాం చిత్తూరు పశ్చిమ డీఎఫ్‌వో చక్రపాణి చిత్తూరు(అర్బన్): వన్యప్రాణాలు జనావాసాల్లోకి రాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని అడవుల్లో కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు పశ్చిమ అటవీశాఖ అధికారి చక్రపాణి తెలిపారు. ఇందుకోసం మూడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో భారత ప్రభుత్వ వన్యప్రాణి సంరక్షణ అధికారులు సమావేశం కానున్నారన్నారు. ఇటీవల పలమనే రు, కుప్పం, మామండూరు తదితర ప్రాంతాల్లో ఏనుగులు పంట పొలాల పై దాడులు చేయడం, తాజాగా రామకుప్పంలో ఓ ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం తదితర అంశాలపై డీఎఫ్‌వో చక్రపాణి శనివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.... ఏనుగులు పంట పొలాలపై దాడు లు చేయకుండా మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అడవులతో కలిపి వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నాం. ఇందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైల్డ్ అనిమల్ ప్రొటెక్ట్ అధికారులకు నివేదిక పంపాం. ఈనెల తొలి వారంలో మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శితో పాటు ఆ రెండు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర అధికారుల బృందం సమావేశవుతుంది. కుప్పం, క్రిష్ణగిరి, హోసూరు, బన్నేరుగట్టు తదితర అటవీ ప్రాంతాల మీదుగా కారిడార్ ఏర్పాటవుతుంది. పనులు, నిధులు అన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కుప్పం సమీపంలోని పెద్దకుర్తిగుంట నుంచి మోట్లచెరువు వరకు 50 కిలో మీటర్ల దూరంలో సోలార్ ఫె న్సింగ్ వేశాం. ఇంకా పది కిలో మీటర్ల దూరం వరకు గ్యాప్ ఉంది. ఈ ప్రాం తంలో బండలు, కొండలు ఎక్కువగా ఉండటంతో కాస్త ఆలస్యమైంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. అంతేగాకుండా ఈ అటవీ ప్రాంతాల నుంచి ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా ఉండటానికి కందకాలు నిర్మిస్తున్నాం. రూ.25 లక్షలు నిధులు కూడా వచ్చాయి. 12 అడుగుల ఎత్తులో గుంతలు తవ్వడాన్నే కందంకం అంటాం. ఈ గుంతల్ని చూడగానే ఏనుగులు దాటడానికి సాహసించవు. అడవుల్లోనే ఏనుగుల సంరక్షణ కోసం నీటి గుంటలు త వ్వుతాం, పచ్చిక వేయడానికి షెల్టర్ నిర్మిస్తాం. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏనుగుల దాడుల్లో 219 ఎకరాల్లో పాక్షికంగా పంట పొలాలు ధ్వంసమయ్యాయి. వరి, చెరకు పంటలకు ఎకరాకు రూ.6 వేలు, మామిడి, కొబ్బరి ఒక్కో చెట్టుకు రూ.15వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.25.20 లక్షలు పరిహారాన్ని సంబంధిత రైతులకు చెల్లించాం. ఇతర కూరగాయలు, ఆకుకూరల తోటలకు ఉద్యానవశాఖ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా పరిహారం ఇస్తున్నాం’. -
సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్
ఇవే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు! - హైదరాబాద్-వరంగల్ మార్గంలో ప్రత్యేక కారిడార్ - ఫార్మా, పౌల్ట్రీ, టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్ అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలే ఉన్నందున వారి కోసం సంక్షేమ శాఖలను తన వద్దే పెట్టుకున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్ సన్నిహిత మంత్రి ఒకరు మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి విజన్‌ను వివరించారు. ‘ఉద్యమాలు ముగిశాయి. ఇక కేసీఆర్ తన దృష్టిని పూర్తిగా తెలంగాణ అభివృద్ధిపైనే కేంద్రీకరించారు. చంద్రబాబు మాదిరిగా ప్రచారం పొందాలని చూడటం లేదు. సాగునీరు, సంక్షేమం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ‘తమిళనాడు తరహాలో పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్నారు. 125 గజాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు’ అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఏఐబీపీ నిధులను తెచ్చుకుని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తెలంగాణలో చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-వరంగల్ హైవేలో ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసి ఫార్మా, టూరిజం, పౌల్ట్రీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రహదారి పొడవునా 36 ఫార్మా కళాశాలలు, వందలాది పౌల్ట్రీ ఫారాలతోపాటు ప్రస్తుతమున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సదరు మంత్రి వెల్లడించారు.