special counter
-
ఆర్టీఏలో మహిళల కోసం ప్రత్యేక కౌంటర్..
సాక్షి, హైదరాబాద్: రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ)లో మహిళలకు ప్రత్యేక సేవా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం మహిళలకు డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, లెర్నింగ్ లైసెన్స్‌లు, వాహ నాల రిజిస్ట్రేషన్లు, ఇతరత్రా పౌరసేవలను ప్రత్యేక కౌంటర్ల నుంచే అందజేశారు. ఈ కేంద్రాల్లో మహిళా ఉద్యోగులు మాత్రమే విధుల్ని నిర్వహించడం విశేషం. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లెర్నింగ్ లైసెన్స్ మేళాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన ఆర్టీఏ కేంద్రాల్లో మహిళలకు ఇకనుంచి ప్రత్యేక సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీఏ ప్రత్యేక ఏర్పాట్ల పట్ల మహిళా వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. -
విద్యుత్ బిల్లుల చెల్లింపు కష్టాలు తొలగిస్తాం
– కొత్త కౌంటర్లు ప్రారంభించిన ఎస్ఈ భార్గవ రాముడు కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ బిల్లుల చెల్లింపులో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవరాముడు స్పష్టం చేశారు. శనివారం స్థానిక పవర్ హౌస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బిల్లుల చెల్లింపు కౌంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సముదాయంలో కర్నూలు టౌన్, రూరల్స్ వియోగదారులకు సంబంధించి 8 కౌంటర్లు నిర్మించారు. ఇందులో ఆన్లైన్, స్వైప్ మిషన్, నగదు, డీడీలు, చెక్కుల పద్ధతిలో చెల్లించేందుకు వేరువేరుగా ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు క్యూ కష్టాలు ఉండరాదని అధిక సంఖ్యలో కౌంటర్లు నిర్మించినట్లు వెల్లడించారు. ఇకపై ఉదయం 8–30గంటలకు బిల్లు వసూలు కేంద్రాలు తెరుచుకుంటాయని, మధ్యాహ్నం భోజన విరామంలో కూడా బిల్లులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్ర 4:30గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఆన్లైన్, స్వైప్ మిషన్ల ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవడం లేదని, చెలామణిలో ఉన్న నోట్లను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. చెక్కులు, డీడీలు లేక ఆన్లైన్, ఏటీపీ మిషన్ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని సూచించారు. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్)ను ప్రొత్సహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ రమేష్, ఎస్ఏఓ మత్రూనాయక్, ఏడీఈలు ప్రసాద్, రంగస్వామి, శేషాద్రి, ఏఓలు విన్సెంట్, మల్లికార్జున, ఈఆర్ఓల సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ప్రజాసాధికార సర్వే
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే ముగిసిందని జాయింట్‌కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం నుంచి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సర్వే చేయని కుటుంబాలు.. సర్వేకోసం రాతపూర్వకంగా వినతిపత్రం ఇవ్వవచ్చని.. ఈ విధంగా మూడు రోజుల పాటు అంటే నవంబర్ 3 వరకు గడువు ఉందన్నారు. వినతులు ఇచ్చిన వారి ఇళ్లకు వెళ్లి ఎన్యూమరేటర్లు సర్వే చేస్తారని వివరించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో 43,42,629 మందిని సర్వే చేయాల్సి ఉండగా 33,49,817 మందిని మాత్రమే సర్వే చేశారు. మొత్తంగా 77.4 శాతం మాత్రమే సర్వే జరిగింది. -
రుణమాఫీ ఓ‘బూటకం’..!
విజయనగరంవ్యవసాయం: రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు దగ్గరపడడంతో రైతులు రుణమాఫీ సెల్‌కు బారులు తీరారు. ఉదయం 8 గంటల నుంచే రైతులు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లో ఉన్న రుణమాఫీ సెల్‌కు చేరుకున్నారు. వేలాదిగా రైతులు కలెక్టరేట్‌కు రావడంతో వ్యవసాయశాఖ అధికారులు 11 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటిలో మహిళారైతులు కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు కానీ రైతుల దాహార్తిని తీర్చడానికి కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద రైతులు ఎండలో అవస్థలు పడ్డారు. మండు టెండు లోనే గంటల తరబడి నిరీక్షించారు. కొంతమంది రైతులు ఎండనుంచి ఉపశమనం పొందడానికి ఐస్‌క్రీమ్‌లు కొనుగోలు చేశారు. రుణమాఫీ సెల్‌కు వేలాదిగా రైతులు రావడంతో వ్యవసాయశాఖ అధికారులు సైతం ఆశ్యర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి 3622 మంది రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం ఒక్క రోజు మాత్రం 1883 మంది దరఖాస్తు చేశారు. మంగళవారం 2వేల మంది వరకు రైతులు వచ్చారు. నాపేరు మత్చ కచ్చం నాయుడు: మాది నెల్లిమర్ల మండలం జోగిరాజుపేట గ్రామం. నేను సతివాడ పీఏసీఎస్‌లో 2013లో రూ. 17 వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం ప్రకటించిన మొదటి, రెండు విడతల్లో రుణ మాఫీ కాలేదు. రెండు సార్లు దరఖాస్తు చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు మాఫీ చేస్తారన్న నమ్మకం లేదు. ఆయన మాటలు నమ్మడానికి వీల్లేదు. నాపేరు ఎం.ప్రకాశ్: మాది నెల్లిమర్ల మండలం మధుపాడ గ్రామం. నేను 2013లో సతివాడ పీఏసీఎస్‌లో రూ.15 వేలు రుణం తీసుకున్నాను. మొదటి, రెండు విడతల్లో నాకు మాఫీ కాలేదు. ఇప్పటికి మూడుసార్లు అధికారులకు దరఖాస్తు చేసాను. ఇప్పుడు మళ్లీ చేయమంటున్నారు. అధికారుల చుట్టూ తిరగలేకున్నాం. మాఫీ చేస్తారని నేను అనుకోవడం లేదు. చంద్రబాబు పై నాకు నమ్మకం లేదు. ఇది ఈఇద్దరి రైతులమాటే కాదు. జిల్లాలో ఉన్న వేలాదిమంది రైతులు చెబుతున్న మాట. అధికారంలోకి రాగానే రైతులందరి రుణాలను మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. రుణమాఫీ చేయడానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, విస్తీర్ణం సరిపడా లేదు తదితర కుంటి సాకులు చెప్పి రైతులకు రుణమాఫీ చేయడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు మాఫీపైనే ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ సర్కార్ పుణ్యాన రైతుల ఆశలు అడుగంటుతున్నాయి.