Special Operations
-
వెస్ట్‌బ్యాంక్‌లో ముగిసిన సైనిక ఆపరేషన్
వెస్ట్‌బ్యాంక్ మిలిటెంట్లను ఏరివేయడమే లక్ష్యంగా వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ బుధవారం ముగిసింది. ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి వెళ్లిపోయాయి. సోమవారం, మంగళవారం జరిగిన దాడుల్లో 12 మంది పాలస్తీనావాసులు, ఒక ఇజ్రాయెలీ జవాను మృతిచెందారు. తాము నిర్వహించిన డ్రోన్ దాడుల్లో చనిపోయినవారంతా మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. జెనిన్ శరణార్థుల శిబిరంలో భయం ఇంకా తొలగిపోలేదు. జనం ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. దుకాణాలు తెరుచుకుంటున్నారు. ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు క్రమంగా తిరిగివస్తున్నారు. క్యాంప్‌లో ఎక్కడ చూసినా భీతావహ వాతావరణం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంకా పునరుద్ధరించలేదు. ఇంటర్నెట్ సేవలు సైతం ఆగిపోయాయి. డ్రోన్ దాడ్రుల్లో మిలిటెంట్ ముఠాలకు భారీగా నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వెస్ట్‌బ్యాంక్ నుంచి ఉగ్రవాదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సైనిక ఆపరేషన్లు పునరావృతం కావడం తథ్యమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ హెచ్చరించారు. జెనిన్ శివారులోని ఓ సైనిక స్థావరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. -
‘పుట్ట’లోంచి బయటపడుతున్న కట్టల పాములు!
ఆపరేషన్ వన్ వీక్... డిసెంబర్ 1నుంచి ఎన్నికలు జరిగే 7వ తేదీవరకు ఆపరేషన్ వన్‌వీక్ పేరుతో ఎన్నికల స్క్వాడ్స్, పోలీస్ బృందాలు, రెవెన్యూ పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు ప్రత్యేక నిఘా పెట్టబోతున్నారు. అభ్యర్థుల అనుచరులు, వారి కదలికలను పసిగట్టి ఎక్కడికక్కడ దాడులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలు స్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఎనిమిది ప్రధాన మార్గాల్లో 18 చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. ఇప్పుడు మరో 8 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు తెలిసింది. అదే విధంగా జిల్లాల సరిహద్దుల్లో 58కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అయితే ఇప్పుడు జిల్లాలు, ప్రధాన అర్బన్ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లోకి వెళ్లే రూట్లలో ఒక్కో మార్గానికి 5 నుంచి 6 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక చెక్‌పోస్టు నుంచి తప్పించుకున్నప్పటికీ మరో చెక్‌పోస్టులో దొరికిపోయే అవకాశం ఉంటుందన్న పరిశీలకుల నివేదికతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న మద్యం, నగదు చూసి ఎన్నికల సంఘం షాక్ తింటోంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గరినుంచి ఇప్పటివరకు దాదాపుగా రూ.100 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వస్తువులను ఎన్నికల, పోలీస్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ఉధృతం చేస్తుండటం, ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రలోభాలు తీవ్రతరం కాబోతున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు చివరి వారంరోజుల్లో మరిన్ని దాడులు, సోదాలు నిర్వహించబోతున్నాయి. ఇన్నాళ్లు జరిగింది ఒక ఎత్తు, ఈ వారంరోజులు జరగబోయే తంతు మరో ఎత్తుగా ప్రత్యేక బృందాలు భావిస్తున్నాయి. బంగారం, వెండి, గంజాయి.. టికెట్ల కేటాయింపు దగ్గరి నుంచి ప్రచారం ముగిసే ఆఖరిరోజు వరకు కార్యకర్తలు, నేతలతోపాటు ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో నగదు, మద్యం, ఇతర కానుకలను ఇచ్చి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. డిసెంబర్ 7న జరిగే ఎన్నికలకు సరిగ్గా వారం రోజులముందు అంటే డిసెంబర్ 1నుంచి ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కీలకమైన రోజులను పార్టీలు, అభ్యర్థులు పెద్దఎత్తున ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనమవడమే ప్రలోభాల స్థాయికి పెద్ద ఉదాహరణ అని పోలీస్ శాఖ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ తనిఖీల్లో రూ.62.18 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఐటీ విభాగం రూ.21.22 కోట్లను స్వాధీనపర్చుకుంది. అంటే, మొత్తం నగదు రూ.83 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. ఇక పోలీస్ శాఖ తనిఖీల్లో రూ.87లక్షల విలువైన 24,087 లీటర్ల మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ నేతృత్వంలో దాడులు నిర్వహించగా రూ.9.20 కోట్ల విలువైన 41వేల లీటర్ల మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. మొత్తంగా రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యం ఎన్నికల నేపథ్యంలో స్వాధీనపరుచుకున్నారు. పోలీస్ శాఖ జరుపుతున్న తనిఖీల్లో భాగంగా బంగారం, వెండి, గుట్కా ప్యాకెట్లు, గంజాయి తదితరాలు సైతం పట్టుబడ్డాయి. ఇలా రూ.7.50 కోట్ల విలువైన బంగారం, వెండి, గుట్కా అక్రమ మార్గంలో రాష్ట్రానికి చేరినట్టు పోలీస్ శాఖ నివేదించింది. మొత్తంగా రూ.100 కోట్ల మేర నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడటం ఎన్నికల కమిషన్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జహీరాబాద్‌లో రూ. 50 లక్షలు పట్టివేత జహీరాబాద్ టౌన్: కారులో తరలిస్తున్న రూ. 50 లక్షలను జహీరాబాద్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్థానిక డీఎస్పీ నల్లమల రవి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దులోని చిరాగ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తాలో జాతీయ రహదారిపై వాహనాలను తని ఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ వద్ద రూ.50 లక్షలు లభించాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల సెల్‌కు సమాచారం అందించామని చెప్పారు. -
ఆదిలోనే అంతం చేద్దాం!
► దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, చికిత్సకు ప్రత్యేక కార్యాచరణ ► కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే ఏర్పాట్లు ► బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వ్యవస్థ సాక్షి, హైదరాబాద్: పేదల జీవితాలను, కుటుంబాలను అతలాకుతలం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, చికిత్సపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. కేన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, బీపీ.. వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఆరంభంలోనే గుర్తించి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిధులతో కేన్సర్, మధుమేహం, గుండె జబ్బుల నియంత్రణ జాతీయ కార్యక్రమం(ఎన్‌పీసీడీసీఎస్) పేరుతో ఈ కార్యక్రమం అమలవుతోంది. జనగామ, పెద్దపల్లి, సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో దీనిని అమలు చేస్తున్నారు. కాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఈ కార్యక్రమంలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1.23 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు జనగామ, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో కలిపి ఇప్పటికే 1.23 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి చికిత్స అవసరమైన వారిని గుర్తించారు. ఆందోళనకరంగా మధుమేహం, హైపర్ టెన్షన్(బీపీ) బాధితులు ఎక్కువ మంది ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. కేన్సర్ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె జబ్బులకు సంబంధించి ముందస్తుగా గుర్తించే పరిస్థితి లేకపోవడం చికిత్స అందించేందుకు అడ్డంకిగా మారుతోందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అవగాహన కార్యక్రమాలు వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, ఇతర అంటు వ్యాధుల చికిత్స కోసం వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో చికిత్సలు అందుతున్నాయి. ఇలాంటి వ్యాధుల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మారుతున్న జీవనశైలితో దీర్ఘకాలిక వ్యాధుల(అంటురోగాలు కానివి)కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశంలో కేన్సర్, మధుమేహం, గుండె జబ్బుల బాధితులు పెరుగుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స పెద్ద సమస్యగా ఉంటోంది. వ్యాధులను గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్ల ఎంత ఖర్చు చేసినా ఫలితం ఉండడంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం ఎన్‌పీసీడీసీఎస్ కార్యక్రమం మొదలుపెట్టింది. అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఎన్‌పీసీడీసీఎస్ కార్యక్రమంలో మొదట అన్ని స్థాయిల్లోని వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అనంతరం సిబ్బంది గ్రామాలకు వెళ్లి ప్రజల వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితులను సేకరిస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల వివరాలను నమోదు చేస్తారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు సమీపంలోని వైద్య కేంద్రాలకు తీసుకువచ్చి రెండో స్థాయి పరీక్షలను నిర్వహిస్తారు. వ్యాధుల తీవ్రత మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధన ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. ఇప్పటికే 9 జిల్లాల్లో స్క్రీనింగ్ పరీక్షలు జరిపిన వారి సంఖ్య 1.23 లక్షలు బీపీ ఉన్నవారి సంఖ్య 7,760 మధుమేహం ఉన్నవారి సంఖ్య 9,084 బ్రెస్ట్ కేన్సర్‌ఉన్నవారి సంఖ్య 253 నోటి కేన్సర్‌ఉన్నవారి సంఖ్య 886.