special parks
-
ఎస్పీబీ పేరిట ప్రత్యేకమైన పార్కు
ఈ ఏడాది సెప్టెంబర్ 25న గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కనుమరుగయ్యారు కానీ పాటల రూపంలో అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. ఆయనకు నివాళిగా తమిళనాడులోని కోయంబత్తూరులో ‘సిరు తుళి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్.పి.బి. వనం’ పేరిట ఓ ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసింది. అక్టోబర్‌లో ఈ వనం రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. గత వారం ఆవిష్కరించారు. చనిపోయే నాటికి బాలు వయసు 74. ఈ వనంలో మొత్తం 74 మొక్కలు నాటారు. ఒక్కో మొక్కకు బాలు పాడిన ఓ పాటను పేరుగా పెట్టడం విశేషం. మొక్కలన్నింటినీ ‘ట్రెబల్ క్లెఫ్’ (సంగీత స్వర చిహ్నం) ఆకారంలో నాటారు. అలాగే సంగీత వాద్యాలు తయారు చేసే చెట్లకు సంబంధించిన మొక్కలివి. కోయంబత్తూరు శివార్లలో పచ్చప్పాళయంలో 1.8 ఎకరాల ఈ వనంలో లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్, ఇంకా ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నామని ‘సిరు తుళి’ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా, ఈ వనం ఆవిష్కరణ వేడుకలో బాలు కుమారుడు ఎస్.పి. చరణ్, సోదరి ఎస్.పి. శైలజ వర్చ్యువల్‌గా పాల్గొన్నారు. -
ఆ తర్వాతే తయారీ సంస్థలు
మొబైల్ హబ్ ఏర్పాట్లపై టీఎస్ఐఐసీ కసరత్తు ప్రత్యేక పార్కుల ఏర్పాటుపై ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు అధికంగా చైనాలోనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం కేవలం మొబైల్ ఫోన్ అసెంబ్లీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల సీఎంతో భేటీ జరిపిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. మొబైల్ హబ్ నెలకొల్పేందుకు భూమితోపాటు మౌలిక సౌకర్యాలు, ఇతర అంశాలకు మద్దతు పలికేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. హబ్ ఏర్పా టు ద్వారా 1.50 లక్షల నుంచి 2 లక్షల మేర ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొబై ల్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం టీఎస్ఐఐసీ అన్వేషిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంచిరేవుల, రావిర్యాలలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమలను ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులు సందర్శించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తొలుత అసెంబ్లీ యూనిట్లు నేరుగా మొబైల్ తయారీ పరిశ్రమలు కాకుం డా అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మొబైల్ తయారీ పరిశ్రమలు వున్నాయి. ఇప్పటికే సెల్కాన్, వీడియోకాన్ వంటి మొబైల్ తయారీ పరిశ్రమలు తమ అసెంబ్లీ యూనిట్లను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నాయి.