మొబైల్ హబ్ ఏర్పాట్లపై టీఎస్‌ఐఐసీ కసరత్తు
ప్రత్యేక పార్కుల ఏర్పాటుపై ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు అధికంగా చైనాలోనే ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం కేవలం మొబైల్ ఫోన్ అసెంబ్లీ యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల సీఎంతో భేటీ జరిపిన ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధి బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ను మొబైల్ ఫోన్ల తయారీ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. మొబైల్ హబ్ నెలకొల్పేందుకు భూమితోపాటు మౌలిక సౌకర్యాలు, ఇతర అంశాలకు మద్దతు పలికేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.
హబ్ ఏర్పా టు ద్వారా 1.50 లక్షల నుంచి 2 లక్షల మేర ఉద్యోగాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మొబై ల్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం టీఎస్‌ఐఐసీ అన్వేషిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంచిరేవుల, రావిర్యాలలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమలను ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులు సందర్శించారు. సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
తొలుత అసెంబ్లీ యూనిట్లు
నేరుగా మొబైల్ తయారీ పరిశ్రమలు కాకుం డా అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మొబైల్ తయారీ పరిశ్రమలు వున్నాయి. ఇప్పటికే సెల్‌కాన్, వీడియోకాన్ వంటి మొబైల్ తయారీ పరిశ్రమలు తమ అసెంబ్లీ యూనిట్లను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నాయి.
ఆ తర్వాతే తయారీ సంస్థలు
Published Fri, Jun 5 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement