special security
-
స్పెషల్ ట్రీట్మెంట్.. ఇక చాలా కష్టం!
సాక్షి, న్యూఢిల్లీ: వీఐపీ ట్రీట్మెంట్కు ముగింపు పలకాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకు వేసింది. వారి భద్రతా సిబ్బందిని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర హోంశాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. యూపీఏ హయాంలో 350 మందికి వీపీపీ ట్రీట్మెంట్ కింద ప్రత్యేక భద్రతను కల్పించగా, ఇప్పుడు 457 మందికి ఆ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ‘నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) తోపాటు పారామిలిటరీ దళాలు రెండూ కూడా వీరికి భద్రత కల్పిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలులోకి వస్తే గనుక చాలా మంది ఎన్ఎస్జీ సిబ్బందిని వదలుకోవాల్సి ఉంటుంది’ అని ఓ ఉన్నత అధికారి వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే నేతలకు ముందుగా ఈ నిర్ణయం అమలు చేయబోతున్నారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే సీనియర్ నేత కరుణానిధిలతోపాటు బీజేపీకి చెందిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌లకు భద్రతా సిబ్బందిలో కొత పడే ఆస్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరందరికి జ ఫ్లస్ సెక్యూరిటీ కింద 50 మందిని కేటాయించగా, వాళ్లు బయటకు వెళ్లే సమయాలల్లో 35 నుంచి 40 మంది ఎప్పుడూ వెంట ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య కేవలం 26గా మాత్రమే ఉండేది. అయితే భద్రతా సిబ్బందిని తగ్గించటం.. పెంచటం అనే వ్యవహారంపై పూర్తిగా రాజకీయ స్థితిగతుల మీదే ఆధారపడి ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానిస్తున్నారు. ఉదాహరణకు.. అస్సాం సీఎంగా తరుణ్ గొగోయ్ ఉన్న సమయంలో బ్లాక్ క్యాట్ కమాండోలను ఉపసంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సర్బనందా సోనోవల్ బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వెంటనే తిరిగి అదే సెక్యురిటీని కేటాయించింది. ఇదే విషయాన్ని ఆ అధికారి ప్రస్తావించారు. గతంలో తమ సిబ్బందిపై నేతలు దురుసుగా వ్యవహరించిన దాఖలాలు కూడా అనేకం ఉన్నాయని ఆయన అంటున్నారు. నేతలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఎక్స్ నుంచి జెడ్ కేటగిరిగా విభజించి వారికి భద్రతా సిబ్బందిని నియమిస్తుంటారు. వై కేటగిరీల్లో ఉన్నవారికి 11 మంది సిబ్బందిని, జెడ్ కేటగిరీల్లో ఉన్న వారికి 30 మంది సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోంది. బాబా రాందేవ్, మాతా అమృతానందమయి, మహంత్ నృత్యగోపాల్ దాస్, సాక్షి మహరాజ్, ముకేష్ అంబానీ-సతీమణి నీతా అంబాని ప్రస్తుతం వీఐపీ ట్రీట్ మెంట్ అందుకుంటుండగా.. ఉత్తర ప్రదేశ్ నుంచే ఎక్కువ మంది ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. -
తమిళనాట ఉద్రిక్తత: శబరిమలకు స్పెషల్ సెక్యురిటీ
తిరువనంతపురం : అమ్మ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాట పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. అమ్మ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తమిళనాడు నుంచి భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. దీంతో శబరిమల ఆలయంలో భద్రతను ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కొబ్బరికాయలు సమర్పించే ప్రాంతంలో కూడా అదనపు చర్యలను ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు తీసుకుంది. ఆజ్జి ప్రాంతంలో పోలీసులు కాపలా కాస్తున్నారు. జయలలిత ఆరోగ్యం క్షీణించిందనే ప్రకటనల నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, అమ్మ త్వరగా కోలుకోవాలని పూజలు చేయిస్తున్నట్టు బోర్డు పేర్కొంది. జయలలిత కోరుకోవాలని ఆకాంక్షిస్తూ ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు కూడా నేడు అన్నదానం నిర్వహించింది. మంగళవారం బాబ్రీ మసీదు డేతో పాటు, అమ్మ పరిస్థితి విషమంగా మారుతుందనే ప్రకటనల నేపథ్యంలో శబరిమలకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పెషల్ టీమ్‌ను రంగంలోకి దించారు. అదేవిధంగా ఆలయానికి సమీప ప్రాంతంలో 360 కేజీల గన్‌పౌడర్ పట్టుబడటంతో శబరిమల అడవి ప్రాంతంలో సెక్యురిటీని ఆ రాష్ట్ర పోలీసులు పెంచారు. 30 మంది సభ్యుల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అటవీ ప్రాంతాన్నంతటిన్నీ జల్లెడ పడుతుంది. ఈ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌కు బాంబ్ స్కాడ్, ఫారెస్ట్, ఫైర్, రెస్క్యూ, పోలీసులు టీమ్‌లు చేపడుతున్నారు. -
GHMC ఎన్నికలకు 46వేల మంది ప్రత్యేక సిబ్బంది
-
ప్రియాంక కుటుంబానికి కొనసాగనున్న ప్రత్యేక భద్రత
న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా, పిల్లలకు విమానాశ్రయాల వద్ద తనిఖీల నుంచి కల్పిస్తున్న మినహాయింపును కొనసాగించాలని కేంద్రంలోని ఏన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక భద్రతను నిరాకరించే అవకాశం ఉందంటూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా సంకేతాలివ్వడం, తర్వాత రోజు ప్రభుత్వానికి ప్రియాంక లేఖ రాసిన సంగతి తెలిసిందే. భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగా జరుగుతుందని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) వర్గాలు తెలిపాయి. కొన్ని నిబంధనల మేరకు ప్రియాంక కుటుంబానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో మార్పులు చేయాలని కోరుకోవడం లేదని ఎస్పీజీ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి కల్పిస్తున్న ప్రత్యేక భద్రతపై సమీక్షించే ఉద్దేశం లేదని వెల్లడించారు. -
ఇసుక రవాణాకు,,, ప్రత్యేక సెక్యూరిటీ పర్మిట్
మంత్రి టీబీ జయచంద్ర రోబో ఇసుక వాడకం తప్పనిసరి ఆన్లైన్లో ఇసుక విక్రయాల యోచన మైసూరు జిల్లాలో త్వరలో పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడంతో పాటు నకిలీ పర్మిట్లను అరికట్టేందుకు ఈ నెల ఒకటో తేది నుంచి కొత్త ప్రత్యేక భద్రతా పర్మిట్ పేపర్‌ను ప్రవేశ పెట్టినట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ. జయచంద్ర వెల్లడించారు. ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్పతో కలసి శుక్రవారం సాయంత్రం విధాన సౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక మీదట ఎం-ఇసుక(మాన్యుఫ్యాక్చర్డ్ (తయారీ) ఇసుక) వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దీనినే రోబో ఇసుక అని కూడా వ్యవహరిస్తారని చెప్పారు. స్టోన్ క్రషర్లలో తయారయ్యే ఈ ఇసుక వినియోగం ద్వారా పర్యావరణానికి కొంత మేర నష్టం వాటిల్లకుండా చూడవచ్చని చెప్పారు. కాగా ఇసుక ఏయే ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నదీ ఆన్లైన్లో తెలుసుకోవడానికి నర్మద ఫర్జిలైజర్ కంపెనీతో కలసి సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పరచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వందల నుంచి ఏడు వందలస్టోన్ క్రషర్లు చట్ట పరిధిలో పని చేస్తున్నాయని తెలిపారు. నదుల్లో ఇసుక తవ్వకాలను సమతుల్య పరచే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఇంకా స్టోన్ క్రషింగ్‌కు అవకాశమున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం నిర్మాణ రంగానికి పది నుంచి 15 శాతం రోబో ఇసుక లభిస్తోందన్నారు. ప్రభుత్వ నిర్మాణాలకు విధిగా రోబో ఇసుకను వాడాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఏటా రెండు కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం కాగా 90 లక్షల టన్నుల నది ఇసుక మాత్రమే లభ్యమవుతోందని చెప్పారు. కాగా ఆన్లైన్లో ఇసుక విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వారు వెల్లడించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ వెబ్సైట్లో ఎక్కడెక్కడ ఇసుక అందుబాటులో ఉన్నదీ తెలుసుకోవచ్చన్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఇసుక రేటును నిర్ణయిస్తారని, ప్రతి జిల్లాలో కంట్రోల్ పాయింట్ల నుంచి ఇసుకను పొందవచ్చని వివరించారు. త్వరలో మైసూరు జిల్లాలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో రెండు నెలల్లో 201 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 117 చెక్‌పోస్టులతో సహా సీసీటీవీ కెమెరాలను నెలకొల్పనున్నట్లు వారు వెల్లడించారు.