Special Tickets
-
తిరుమల: రెండు నెలలకు 24న ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లను విడుదల చేస్తుంది. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకు 15,000 టికెట్లు చొప్పున విడుదల చేయనుంది. కాగా, ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తుంది. భక్తులు టీటీడీ వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. 26న తిరుమలలో పల్లవోత్సవం.. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈ నెల 26న పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు క్యూలైన్ వెలుపల వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇది కూడా చదవండి: ‘ఆగస్టులో మెగా డీఎస్సీ హర్షణీయం’ -
అంతా బ్లాక్!
విజయనగరం కంటోన్మెంట్: బాహుబలి టిక్కెట్ల విషయంలో ప్రేక్షకుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. రూ.40, రూ 80 ఉండే టిక్కెట్ల ధరలను భారీగా పెంచి బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాక్ టిక్కెట్ల విక్రయానికి సంబంధించి జిల్లాలోని చాలా థియేటర్ల యజమానులు రింగయినట్టు చెబుతున్నారు. అందరూ ప్రత్యేక టిక్కెట్లను ముద్రించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని థియేటర్ల యజమానులు తమ సిబ్బందితో ఆన్లైన్లో టిక్కెట్లను బుక్‌చేసుకుని, వాటిని బ్లాక్ చేస్తున్నారని పట్టణానికి చెందిన అభిమానులు కొందరు తెలిపారు. మరోవైపు ప్రభుత్వాధికారులే ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 54 థియేటర్లుండగా బాహుబలి సినిమాను ఒకటిరెండు మినహా దాదాపు అన్ని థియేటర్లలోనూ ఇదే సినిమాను ప్రదర్శించేందుకు రంగం సిద్ధమయింది. జిల్లా కేంద్రంలో ఎనిమిది థియేటర్లు ఉండగా ఏడు థియేటర్లలో బాహుబలి సినిమానే వేస్తున్నారు. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంతో పాటు ఎస్ కోట, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల వంటి చిన్న సెంటర్లలోనూ పలు థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కాగా సాలూరులో సినిమా థియేటర్ యజమానే స్వయంగా వచ్చి గ్రీవెన్స్‌సెల్‌లో అధిక రేట్లపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని సామాన్య ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్లోటిక్కెట్లు విక్రయిస్తే చర్యలు : జేసీ రామారావు అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. బాహుబలి చలన చిత్రాన్ని సినిమాటోగ్రఫీ నిబంధనల మేరకు రెగ్యులర్ సమయాలలోనే ప్రదర్శించాలని, అదనపు సీటింగ్ ఏర్పాటు చేయకూడదని పేర్కొన్నారు. ప్రేక్షకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు విక్రయించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సీటింగ్ పరిమితిని పర్యవేక్షించాలని, రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టు జేసీ తెలిపారు. -
దేదీప్యమానం.. దక్షిణకైలాసం
శివరాత్రికి శ్రీకాళహస్తి ముస్తాబు సర్వాంగసుందరంగా శివాలయం జంగమయ్య సన్నిధిలో నేడు జనజాగరణ శ్రీకాళహస్తి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి ఆలయ ఈవో రామిరెడ్డి ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులకోసం అదనంగా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక టికెట్లు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. 1.5లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఈవో రామిరెడ్డి తెలిపారు. దర్శనం తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఉంటుందని తెలిపారు. లడ్డూ, వడతో పాటు భక్తులకు అవసరమైన జిలేబి, పులిహోర, పెద్దలడ్డు తదితర ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మంగళవారం ప్రత్యేక దర్శనం కోసం భక్తులు రూ.100 టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. లింగోద్భవ దర్శనానికి ప్రత్యేక టికెట్లు లేకుండా రద్దుచేశారు. భక్తులకు సౌకర్యంగా క్యూలు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఈవో చెప్పారు. స్వామి, అమ్మవారిని సులభంగా దర్శించుకుని తిరిగి వెళ్లే విధంగా క్యూలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యూలోని భక్తులకు మంచినీటి సదుపాయంతోపాటు పాలు, మజ్జిగ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు వీక్షించేందుకు పలుచోట్ల టీవీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పది వేల మందికిపైగా అన్నప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ లఘు దర్శనమే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖమండపం(లఘుదర్శనం) నుంచే స్వామి,అమ్మవార్లను దర్శించుకుని వెళ్లేలా అధికారులు క్యూలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు గర్భాలయాన్ని ప్రదక్షిణ చేసే అవకాశం లేదు. వీఐపీలను ముఖమండపం తర్వాత అర్థమండపం నుంచి గతంలో స్వామి,అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉండేది. అయితే ఈ ఏడాది ముఖమండపం నుంచే భక్తులందరూ దర్శించుకునేలా క్యూలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈవో రామిరెడ్డ్డి క్యూల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఏపీ సీడ్స్, స్వర్ణముఖినది వద్ద ఏర్పాట్లు జరిగాయి. ఆలయంలో తనిఖీలు డీఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో భద్రాతా ఏర్పాట్లు చేస్తున్నారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులను, లగేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆలయంలోకి వెళ్లే నాలుగు ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది హోంగార్డులతో పాటు పోలీసులు కూడా మెటల్ డిటెక్టర్ల వద్ద ఉంటున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద కూడా భక్తులను తనిఖీలు చేస్తున్నారు. ఆకర్షిస్తున్న శివుని కటౌట్ శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేసిన పరమశివుని కటౌట్ అందరినీ ఆకర్షిస్తోంది. భిక్షాల గాలిగోపు రం వద్ద శివలింగం సాలెపురుగు, ఏనుగు, పాములతో కలిసి పరమశివుడు కూర్చుని ఉన్నట్లు చిత్రాన్ని తయా రుచేసిన చిత్రం ఆకట్టుకుంటోంది.సుపథమండపం, శివయ్యగోపురం, తిరుమంజనం,జ్ఞానాంబిక గోపురాలను విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. బెంగళూరునుంచి తెప్పించిన వివిధ రకాలపుష్పాలతో కలకత్తా బృందం ఆలయంలో అద్భుతంగా పుష్పాలంకారణ చేసింది. ధ్వజస్తంభాలు,గురుదక్షిణామూర్తి, వెంకటేశ్వరస్వామి,దుర్గాదేవి తదితర పరివార దేవతలను ప్రత్యేకంగా అలంకరించారు.