spf police
-
యాదాద్రి టెంపుల్ క్యూ కాంప్లెక్స్‌లో అడవి పంది హల్చల్
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఓ అడవి పంది హల్చల్ చేసింది. యాద్రాది క్యూ కాంప్లెక్స్‌లోకి దూరి పరుగులు తీసింది. ఈ క్రమంలోనే క్యూ కాంప్లెక్స్ భవనంపై నుంచి పడిపోయి పంది చనిపోయింది. అనంతరం, అడవి పంది కళేబరాన్ని ఎస్పీఎఫ్ సిబ్బంది తొలగించారు. కాగా, ఆలయ ప్రాంగణంలోకి పంది రావడంతో అర్చకులు ఆలయంలో పుణ్యవచనం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం -
యాదాద్రి క్యూ కాంప్లెక్స్‌లో అడవి పంది పరుగులు
-
గాంధీ ఆస్పత్రిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు
హైదరాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి కేటాయించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) పోలీసులు గురువారం విధుల్లో చేరారు. కొన్ని సందర్భాల్లో రోగి కుటుంబసభ్యులు, బంధువులు చేసే దాడుల నుంచి ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని రక్షించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలోని గాంధీ, ఉస్మానియా, పేట్లబురుజు, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆస్పత్రులకు ఎస్పీఎఫ్ దళాలను కేటాయించింది. ఈ మేరకు ఎస్పీఎఫ్ డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు గురువారం గాంధీ ఆస్పత్రికి చెందిన విధుల్లో చేరారు. ఎనిమిది మంది కానిస్టేబుళ్లతో కూడిన ఎస్పీఎఫ్ దళం ఆస్పత్రి పరిసర ప్రాంతాలతోపాటు ఎమర్జెన్సీ, ఏఎంసీ, మార్చురీ తదితర విభాగాల వద్ద నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. ఎస్పీఎఫ్ పోలీసులు ఆస్పత్రిలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ వేంకటేశ్వర్లు తెలిపారు. -
‘ఎస్పీఎఫ్’ విలీనం అంశాన్ని పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: ఎస్పీఎఫ్ను పోలీసుశాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ శుక్రవారం డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. దీనికి సంబంధించి గురువారం తనను కలిసిన ఎస్పీఎఫ్ అధికారులు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించిన ఆయన పై విధంగా ఆదేశించారు. ఎస్పీఎఫ్ అధికారులు,సిబ్బందిని పోలీసు శాఖలో విలీనం చేయాలని కోరుతూ సచివాలయ భద్రతా అధికారి త్రినాథ్ నేతృత్వంలోని ఆ శాఖ సిబ్బంది గురువారం సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం ఎస్పీఎఫ్ విభాగం రాష్ట్ర సచివాలయం, హైకోర్టు మొదలుకొని పలు కీలక ప్రభుత్వ విభాగాలకు సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్నదని , కానీ సరిపడా సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ సమస్య తీరాలంటే రెండు వేల మంది సిబ్బంది అవసరమవుతారని వివరించారు. ఈ పరిస్థితుల్లో తమ విభాగాన్ని పోలీసు శాఖలోగానీ, ఎక్సైజ్శాఖలోగానీ విలీనం చేయాలని సీఎంకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. -
జేబు దొంగలు దొరికారు..
- పోలీసుల అదుపులో ఐదుగురు.. - సీసీ కెమెరాతో చిక్కిన వైనం - దొంగల్లో బాలుడు వేములవాడ అర్బన్ : వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం ఐదుగురు దొంగలు పర్సులు కొట్టేస్తూ ఎస్పీఎఫ్ పోలీసులకు చిక్కారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచే పలువురు భక్తుల డబ్బులు, సెల్ఫోన్లు దొంగతనానికి గురైనట్లు ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీఎఫ్ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ మహేందర్, గణేశ్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి దొంగలను పట్టుకునే పనిలోపడ్డారు. అప్పటికే అనుమానం కలిగిన కొందరిని ప్రశ్నించి వదిలిపెట్టారు. అయినా దొంగల బెడద పెరుగుతూనే వచ్చింది. ఈలోగా ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఆమేటి లక్ష్మి భర్త విజయ్‌కుమార్ తన పర్సును క్యూలైన్లో ఎవరో కొట్టేశారని ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఓ బాలుడు తనను వెంబడించి జేబులోని డబ్బులు తీశాడని క్లూ ఇచ్చాడు. దీంతో వారంతా కలిసి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. అందులో ఓ బాలుడు పర్సు కొట్టేసినట్లు నిర్ధారించుకున్నారు. ఈక్రమంలో పరుగులు తీస్తున్న బాలుడిని ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకుని ప్రశ్నించారు. దీంతో అసలు రంగు బయటపడింది. సిద్దిపేటకు చెందిన ఈ బాలుడితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీధర్, నగేశ్, రాకేశ్ దొంగతనాలు చేరుుస్తున్నట్లు తేలింది. శాస్త్రీనగర్‌లోని లాడ్జి వెళ్లి తనిఖీ చేయగా ఈ ముగ్గురు దొరికినట్లు ఎస్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. రెండురోజులుగా లాడ్జిలోనే మకాం వేసి ఈ బాలుడితో దొంగతనాలు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారివద్ద నుంచి తొమ్మిది సెల్ఫోన్లు, కొంత నగదు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుల్తానాబాద్‌కు చెందిన సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలుడు జేబు దొంగతనాలు చేస్తూ ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.