సాక్షి, హైదరాబాద్: ఎస్‌పీఎఫ్‌ను పోలీసుశాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ శుక్రవారం డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. దీనికి సంబంధించి గురువారం తనను కలిసిన ఎస్‌పీఎఫ్ అధికారులు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించిన ఆయన పై విధంగా ఆదేశించారు.
ఎస్‌పీఎఫ్ అధికారులు,సిబ్బందిని పోలీసు శాఖలో విలీనం చేయాలని కోరుతూ సచివాలయ భద్రతా అధికారి త్రినాథ్ నేతృత్వంలోని ఆ శాఖ సిబ్బంది గురువారం సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం ఎస్‌పీఎఫ్ విభాగం రాష్ట్ర సచివాలయం, హైకోర్టు మొదలుకొని పలు కీలక ప్రభుత్వ విభాగాలకు సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్నదని , కానీ సరిపడా సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు.
ఈ సమస్య తీరాలంటే రెండు వేల మంది సిబ్బంది అవసరమవుతారని వివరించారు. ఈ పరిస్థితుల్లో తమ విభాగాన్ని పోలీసు శాఖలోగానీ, ఎక్సైజ్‌శాఖలోగానీ విలీనం చేయాలని సీఎంకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
‘ఎస్‌పీఎఫ్’ విలీనం అంశాన్ని పరిశీలించండి
Published Sat, Dec 6 2014 2:50 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement