Anuragsarma
-
పోలీస్స్టేషన్లను అనుసంధానిస్తాం
రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మంథని: పోలీస్‌శాఖలో కమ్యూనికేషన్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లను అనుసంధానం చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా మహదేవపూర్, ముత్తారంలలో ఒక్కొక్కటి రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్ నూతన భవనాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్, డీజీపీ అనురాగ్‌శర్మతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అత్యాధునిక కమ్యూనికేషన్ విధానానికి రూ.20 కోట్లతో హైదరాబాద్‌లో 22 అంతస్తుల భవనం నిర్మిస్తామన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటుతో ఏ ఏ ఠాణాలో ఏం జరుగుతుందో తెలుసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు. -
సాధారణ నేరాలు తగ్గినా..
ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయి మహిళలు, ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాలు కూడా పెరిగాయి వార్షిక నివేదికలో డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ ఏడాది సవ్యంగా ఉన్నాయని, నేరాలు తగ్గుముఖం పట్టాయని, అయితే ఆర్థిక, సైబర్ నేరాలు పెరిగాయని డీజీపీ అనురాగ్‌శర్మ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, కొత్త ప్రణాళికల అమలుపై ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను విలేకరులకు అందజేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర పోలీసుల ప్రతిష్టను అంతర్జాతీయస్థాయికి పెంచుతామన్నారు. సార్వత్రిక ఎన్నికల బందోబస్తు విజయవంతంగా నిర్వహించామని, ఒక్క రీపోలింగ్ ఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. ఈ ఏడాది నవంబర్‌నాటికి రాష్ట్రంలో 93,392 నేరాలు నమోదు కాగా, గత ఏడాది 93,780 నమోదయ్యాయన్నారు. ఆర్థికనేరాలు గత ఏడాది కంటే ఈ సంవత్సరం 6.47 శాతం పెరిగాయని, సైబర్ నేరాలు కూడా గత ఏడాది కంటే వంద శాతం పెరిగాయన్నారు. గత ఏడాది రూ.139.19 కోట్ల రూపాయల ఆస్తి చోరుల పాలు కాగా, ఈ ఏడాది రూ.141.17 కోట్ల రూపాయల ఆస్తి చోరుల పాలైందన్నారు. అత్యాచారాలు 14.34 శాతం పెరిగాయన్నారు. ఎస్సీ,ఎస్టీలపై అత్యాచారాల నిరోధకచట్టం కింద కేసులు ఈ ఏడాది 57.86 శాతం పెరిగాయన్నారు. మహిళల అక్రమ రవాణాను అరికట్టామన్నారు. ఈ ఏడాది 370 ట్రాఫికింగ్ కేసులు నమోదు కాగా 528 మంది బాధితులను రక్షించామన్నారు. మావోయిస్టుల చేతుల్లో ఈ ఏడాది నలుగురు హత్యకు గురయ్యారని, ఒక నక్సలైట్ ఎదురుకాల్పుల్లో మరణించారని అన్నారు. ఏడు ఎన్కౌంటర్లు జరుగగా, 68 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 18 మంది అరెస్టయ్యారని పేర్కొన్నారు. ఐఎస్ఐ కార్యకలాపాలపై డేగ కన్ను.. రాష్ట్రంలో ఐఎస్ఐ దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలపై డేగ కన్నేశామని డీజీపీ వివరిం చారు. సిమికి చెందిన షాముదస్సిర్, షోయబ్ అహ్మద్‌ఖాన్‌లను అక్టోబర్ 22న సికింద్రాబాద్‌లో అరెస్టు చేశామన్నారు. అలాగే నలుగురు సిటీ విద్యార్థులు ఐఎస్ఐఎస్ భావజాలానికి లోనై దేశ సరిహద్దులు దాటుతుండగా వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. 24 అంతస్తుల భవనం... రూ.20 కోట్లతో బంజారాహిల్స్‌లో 24 అంతస్తుల అత్యంత ఆధునిక పోలీసు కమిషనరేట్ భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళా భద్రత కమిటీ చేసిన సిఫార్సుల మేరకు వన్‌స్టాప్ క్రైసిస్ సెంటర్లను ఏర్పాటుచేయడం, మహిళల కోసం ప్రత్యేకించి 181 నంబరుతో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామన్నారు. మహిళల ఫిర్యాదుల కోసం అన్ని పోలీసు స్టేషన్లలో డెస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ఏర్పాటు చేసి పోకిరీల భరతం పడుతున్నామని అన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణను చేపట్టడం జరిగిందన్నారు. శిక్షల రేటును పెంచడానికి కోర్టు మానిటరింగ్ సిస్టమ్‌ను చేపడుతున్నామని తెలిపారు. సోషల్‌మీడియాను ఆధారంగా చేసుకుని ప్రజలకు మరింతగా సేవలు అందించాలని, పీపుల్స్ ఫ్రెండ్లీ వ్యవస్థగా పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కొత్త రిక్రూట్మెంట్ పాలసీని అమలు చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో సీనియర్ అధికారులు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, సత్యనారాయణ్, చారుసిన్హా, శివధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేరస్తులకు శిక్షలు పడితేనే దర్యాప్తునకు సార్థకత
డీజీపీ అనురాగ్‌శర్మ వ్యాఖ్య పోలీసు అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: నేరం జరిగిన ప్రతికేసులో దోషులకు కోర్టులలో శిక్షలు పడేలా చూస్తేనే పోలీ సులు జరిపే దర్యాప్తునకు సార్థకత ఏర్పడుతుం దని, ఆ దిశగా కృషిచేసి రాష్ట్రంలో శిక్షల రేటును మ రింత పెంచేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించా రు. శనివారం నాడిక్కడ తన కార్యాలయంలో రీజి యన్ల ఐజీలతో, రేంజ్ డీఐజీలతో, జిల్లాల ఎస్పీల తో, నగర డీసీపీలతో, ఆయన సమావేశమయ్యారు. సకాలంలో నేరస్తులను పట్టుకోవడం, పకడ్బందీగా చార్జ్జిషీట్లు వేయడం, కోర్టులలో దాఖలైన కేసులపై సరై న విచారణ జరగడం, నేరస్తులకు తగిన శిక్షలు పడేలా చూడడంపై ఆయన పోలీసు అధికారులతో చర్చించారు. కోర్టులలో అవసరమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోవడం, దొరికిన సాక్షులను తగిన సమయంలో కోర్టులలో హాజరుపరచకపోవడం వంటి కారణాలతో కేసులు వీగిపోతున్నాయన్నారు. సగం కేసుల్లో శిక్షలు పడడం లేదు: శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు పోలీసుశాఖకు ప్ర భుత్వం భారీగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నదని, నేరస్తులకు కోర్టులో శిక్షలు పడేలా చూస్తేనే కేటాయిం చిన ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించిన వారమవుతామన్నారు. నమోదైన కేసుల్లో కనీసం సగం కూడా శిక్షలు పడే స్థాయిలో దర్యాప్తులు సాగడం లేదని విమర్శలున్నాయన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలని, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా చేయాలని ఆయన ఉద్భోధించారు. సాక్షులు వెనుకంజ వేస్తున్నారు : ఎస్పీలు కొందరు ఎస్పీలు మాట్లాడుతూ కేసు నమోదు సమయంలో సాక్ష్యమివ్వడానికి ముందుకొస్తున్న సాక్షు లు కోర్టుల్లో విచారణ సమయంలో కనిపించకుండా పోతున్నారని తెలిపారు. ఈ స్థితి నుంచి బయటపడడానికి చాలావరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించుకోవాలని డీజీపీ సూచించారు. -
‘ఎస్పీఎఫ్’ విలీనం అంశాన్ని పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: ఎస్పీఎఫ్ను పోలీసుశాఖ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ శుక్రవారం డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. దీనికి సంబంధించి గురువారం తనను కలిసిన ఎస్పీఎఫ్ అధికారులు ఇచ్చిన వినతిపత్రంపై స్పందించిన ఆయన పై విధంగా ఆదేశించారు. ఎస్పీఎఫ్ అధికారులు,సిబ్బందిని పోలీసు శాఖలో విలీనం చేయాలని కోరుతూ సచివాలయ భద్రతా అధికారి త్రినాథ్ నేతృత్వంలోని ఆ శాఖ సిబ్బంది గురువారం సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రస్తుతం ఎస్పీఎఫ్ విభాగం రాష్ట్ర సచివాలయం, హైకోర్టు మొదలుకొని పలు కీలక ప్రభుత్వ విభాగాలకు సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్నదని , కానీ సరిపడా సిబ్బంది లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ సమస్య తీరాలంటే రెండు వేల మంది సిబ్బంది అవసరమవుతారని వివరించారు. ఈ పరిస్థితుల్లో తమ విభాగాన్ని పోలీసు శాఖలోగానీ, ఎక్సైజ్శాఖలోగానీ విలీనం చేయాలని సీఎంకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. -
సిటీకాప్స్కు కొత్త వాహనాలు
సార్ చైన్‌స్నాచింగ్ జరిగింది...దొంగలు ఇప్పుడే పారిపోయారని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌చేశాడు. వీరు డొక్కు వాహనాన్ని తీసుకొని ఘ టనాస్థలానికి వెళ్లేలోపు ఆ దొంగలు కాస్తా పత్తా లేకుండా పోయారు. ఓ ఇంట్లో మర్డర్ జరిగింది. విషయం తెలుసుకొని పోలీసులు వెళ్లే సరికి అక్కడ ఆధారాలు మాయమయ్యాయి. ఇవీ కేవలం ఉదాహరణలు మాత్రమే. నగరంలో అనేక పోలీసుస్టేషన్ల పరిధి లో వాహనాలు పాతబడడం, తరచూ మొరాయిస్తుండడంతో ప్రతినిత్యం ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రోజూ వీటితో కుస్తీపట్టడం, మధ్యలో ఆగిపోతుండడంతో ప్రమాదం లేదా ఘటనా స్థలానికి చేరుకోవడంలో పోలీసులకు ఆలస్యమవుతోంది. ఈసమస్యను అధిగమించేందుకు నగర పోలీసుకమిషనర్ అనురాగ్‌శర్మ కొత్త వాహనాలు సమకూర్చుకునేందుకు కేంద్రానికి రూ.16 కోట్ల ప్రతిపాదనలు పంపిం చారు. ఈ నిధులు మంజూరైతే రెండుమూడు నెలల్లో వాహనాలతోపాటు కమ్యూనికేషన్,ట్రాఫిక్ ఉపకరణాలు సమకూర్చుకోవాలని నగర పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో ఉన్న వాహనాల్లో దాదాపు 90శాతం కాలం చెల్లినవే. రక్షక్లుగా, గస్తీ కోసం వినియోగిస్తున్న 200లకుపైగా వాహనాలు 2003లో కొనుగోలు చేసినవే. గడిచిన పదేళ్లుగా తిరుగుతున్న ఈ వాహనాలు రీ-ప్లేస్ కాకపోవడంతో అధ్వానస్థితికి చేరాయి. మరోపక్క రక్షక్ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పటికీ నగరం విస్తరించడంతోపాటు కాలనీలు, బస్తీలు పెరిగిపోవడంతో మరికొ న్ని అదనంగా అవసరమయ్యాయి. నగరవ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేయడం,పోలీసుల స్పందన వేగవంతం చేయడానికి, నేరగాళ్లపై పటిష్ట నిఘాకు పోలీసు సిబ్బందికి రవాణా సౌకర్యం కీలకంగా మారింది. ప్రతి సందర్భంలోనూ అద్దెవాహనాలు సమకూర్చుకోలేని పరి స్థితి ఉంది. ఈపరిణామాలను దృష్టిలో పెట్టుకొని మూడేళ్ల క్రితమే అధికారులు అదనపు వాహనాలను కోరుతూ డీజీపీ కార్యాలయం కేంద్రంగా పనిచేసే ప్రొవిజన్ అండ్ లాజిసి ్టక్స్ విభాగానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన అధికారులు ప్రాథమికంగా 70 వాహనాలను కేటాయిం చారు. ఇవి 2010లో అందుబాటులోకి వచ్చాయి. వాటి నుంచి 20 సుమోలను రక్షక్లుగా మార్చారు. వీటిని కమిషనరేట్ అత్యధిక కేసు లు నమోదవుతున్న ఎస్సార్‌నగర్,పంజగుట్ట వంటి 20 పోలీసుస్టేషన్లను అదనంగా కేటాయించారు. వీటితో మొబైల్కుతోడు రెండు రక్షక్‌లు వచ్చినట్లయ్యింది. అయితే ఇప్పటికీ అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్న వాటిలో అనేకం దీనస్థితిలో ఉన్నా యి. వీటివల్ల కాలుష్యం కూడా తీవ్రంగా విడుదలవుతోంది. తాజాగా పంపిం చిన రూ.16 కోట్ల ప్రతిపాదనల్లో కొత్త వాహనాలతోపాటు కమ్యూనికేషన్‌కు అవసరమైన మ్యాన్‌ప్యాక్స్ తదితరాలు, ట్రాఫిక్ వింగ్‌కు ఉపయుక్తంగా ఉండే అత్యాధునిక ఉపకరణాలను చేర్చారు. -సాక్షి,సిటీబ్యూరో