నేరస్తులకు శిక్షలు పడితేనే దర్యాప్తునకు సార్థకత
- డీజీపీ అనురాగ్‌శర్మ వ్యాఖ్య
- పోలీసు అధికారులతో భేటీ
సాక్షి, హైదరాబాద్: నేరం జరిగిన ప్రతికేసులో దోషులకు కోర్టులలో శిక్షలు పడేలా చూస్తేనే పోలీ సులు జరిపే దర్యాప్తునకు సార్థకత ఏర్పడుతుం దని, ఆ దిశగా కృషిచేసి రాష్ట్రంలో శిక్షల రేటును మ రింత పెంచేలా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ అనురాగ్‌శర్మ ఆదేశించా రు. శనివారం నాడిక్కడ తన కార్యాలయంలో రీజి యన్ల ఐజీలతో, రేంజ్ డీఐజీలతో, జిల్లాల ఎస్పీల తో, నగర డీసీపీలతో, ఆయన సమావేశమయ్యారు.
సకాలంలో నేరస్తులను పట్టుకోవడం, పకడ్బందీగా చార్జ్జిషీట్లు వేయడం, కోర్టులలో దాఖలైన కేసులపై సరై న విచారణ జరగడం, నేరస్తులకు తగిన శిక్షలు పడేలా చూడడంపై ఆయన పోలీసు అధికారులతో చర్చించారు. కోర్టులలో అవసరమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోవడం, దొరికిన సాక్షులను తగిన సమయంలో కోర్టులలో హాజరుపరచకపోవడం వంటి కారణాలతో కేసులు వీగిపోతున్నాయన్నారు.
సగం కేసుల్లో శిక్షలు పడడం లేదు: శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు పోలీసుశాఖకు ప్ర భుత్వం భారీగా బడ్జెట్‌ను కేటాయిస్తున్నదని, నేరస్తులకు కోర్టులో శిక్షలు పడేలా చూస్తేనే కేటాయిం చిన ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించిన వారమవుతామన్నారు. నమోదైన కేసుల్లో కనీసం సగం కూడా శిక్షలు పడే స్థాయిలో దర్యాప్తులు సాగడం లేదని విమర్శలున్నాయన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలని, నేరస్తులకు శిక్షలు పడేలా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా చేయాలని ఆయన ఉద్భోధించారు.
సాక్షులు వెనుకంజ వేస్తున్నారు : ఎస్పీలు
కొందరు ఎస్పీలు మాట్లాడుతూ కేసు నమోదు సమయంలో సాక్ష్యమివ్వడానికి ముందుకొస్తున్న సాక్షు లు కోర్టుల్లో విచారణ సమయంలో కనిపించకుండా పోతున్నారని తెలిపారు. ఈ స్థితి నుంచి బయటపడడానికి చాలావరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించుకోవాలని డీజీపీ సూచించారు.