సిటీకాప్స్‌కు కొత్త వాహనాలు
Published Wed, Aug 7 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
సార్ చైన్‌స్నాచింగ్ జరిగింది...దొంగలు ఇప్పుడే పారిపోయారని ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌చేశాడు. వీరు డొక్కు వాహనాన్ని తీసుకొని ఘ టనాస్థలానికి వెళ్లేలోపు ఆ దొంగలు కాస్తా పత్తా లేకుండా పోయారు. ఓ ఇంట్లో మర్డర్ జరిగింది. విషయం తెలుసుకొని పోలీసులు వెళ్లే సరికి అక్కడ ఆధారాలు మాయమయ్యాయి. ఇవీ కేవలం ఉదాహరణలు మాత్రమే. నగరంలో అనేక పోలీసుస్టేషన్ల పరిధి లో వాహనాలు పాతబడడం, తరచూ మొరాయిస్తుండడంతో ప్రతినిత్యం ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రోజూ వీటితో కుస్తీపట్టడం, మధ్యలో ఆగిపోతుండడంతో ప్రమాదం లేదా ఘటనా స్థలానికి చేరుకోవడంలో పోలీసులకు ఆలస్యమవుతోంది. ఈసమస్యను అధిగమించేందుకు నగర పోలీసుకమిషనర్ అనురాగ్‌శర్మ కొత్త వాహనాలు సమకూర్చుకునేందుకు కేంద్రానికి రూ.16 కోట్ల ప్రతిపాదనలు పంపిం చారు.
ఈ నిధులు మంజూరైతే రెండుమూడు నెలల్లో వాహనాలతోపాటు కమ్యూనికేషన్,ట్రాఫిక్ ఉపకరణాలు సమకూర్చుకోవాలని నగర పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కమిషనరేట్ పరిధిలో ఉన్న వాహనాల్లో దాదాపు 90శాతం కాలం చెల్లినవే. రక్షక్‌లుగా, గస్తీ కోసం వినియోగిస్తున్న 200లకుపైగా వాహనాలు 2003లో కొనుగోలు చేసినవే. గడిచిన పదేళ్లుగా తిరుగుతున్న ఈ వాహనాలు రీ-ప్లేస్ కాకపోవడంతో అధ్వానస్థితికి చేరాయి. మరోపక్క రక్షక్ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పటికీ నగరం విస్తరించడంతోపాటు కాలనీలు, బస్తీలు పెరిగిపోవడంతో మరికొ న్ని అదనంగా అవసరమయ్యాయి. నగరవ్యాప్తంగా గస్తీ ముమ్మరం చేయడం,పోలీసుల స్పందన వేగవంతం చేయడానికి,
నేరగాళ్లపై పటిష్ట నిఘాకు పోలీసు సిబ్బందికి రవాణా సౌకర్యం కీలకంగా మారింది. ప్రతి సందర్భంలోనూ అద్దెవాహనాలు సమకూర్చుకోలేని పరి స్థితి ఉంది. ఈపరిణామాలను దృష్టిలో పెట్టుకొని మూడేళ్ల క్రితమే అధికారులు అదనపు వాహనాలను కోరుతూ డీజీపీ కార్యాలయం కేంద్రంగా పనిచేసే ప్రొవిజన్ అండ్ లాజిసి ్టక్స్ విభాగానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించిన అధికారులు ప్రాథమికంగా 70 వాహనాలను కేటాయిం చారు. ఇవి 2010లో అందుబాటులోకి వచ్చాయి. వాటి నుంచి 20 సుమోలను రక్షక్‌లుగా మార్చారు.
వీటిని కమిషనరేట్ అత్యధిక కేసు లు నమోదవుతున్న ఎస్సార్‌నగర్,పంజగుట్ట వంటి 20 పోలీసుస్టేషన్లను అదనంగా కేటాయించారు. వీటితో మొబైల్‌కుతోడు రెండు రక్షక్‌లు వచ్చినట్లయ్యింది. అయితే ఇప్పటికీ అధికారులు, సిబ్బంది వినియోగిస్తున్న వాటిలో అనేకం దీనస్థితిలో ఉన్నా యి. వీటివల్ల కాలుష్యం కూడా తీవ్రంగా విడుదలవుతోంది. తాజాగా పంపిం చిన రూ.16 కోట్ల ప్రతిపాదనల్లో కొత్త వాహనాలతోపాటు కమ్యూనికేషన్‌కు అవసరమైన మ్యాన్‌ప్యాక్స్ తదితరాలు, ట్రాఫిక్ వింగ్‌కు ఉపయుక్తంగా ఉండే అత్యాధునిక ఉపకరణాలను చేర్చారు. -సాక్షి,సిటీబ్యూరో
Advertisement
Advertisement