పోలీస్‌స్టేషన్లను అనుసంధానిస్తాం
- రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
మంథని: పోలీస్‌శాఖలో కమ్యూనికేషన్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను అనుసంధానం చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా మహదేవపూర్, ముత్తారంలలో ఒక్కొక్కటి రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన మోడల్ పోలీస్‌స్టేషన్ నూతన భవనాలను మండలి చైర్మన్ స్వామిగౌడ్, డీజీపీ అనురాగ్‌శర్మతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
అత్యాధునిక కమ్యూనికేషన్ విధానానికి రూ.20 కోట్లతో హైదరాబాద్‌లో 22 అంతస్తుల భవనం నిర్మిస్తామన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటుతో ఏ ఏ ఠాణాలో ఏం జరుగుతుందో తెలుసుకునే సౌకర్యం కల్పిస్తామన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు.