Sports Policy
-
గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: కొత్త క్రీడా పాలసీని 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధి కారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చే విధంగా క్రీడా విధానం ఉండాలని సూచించారు. అద్భుతమైన క్రీడాకారులను తయారు చేయా లన్నారు. గచ్చిబౌలిలోని క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ యూని వర్సిటీని ప్రారంభించాలని చెప్పారు.దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ క్రీడలకు రెడీమేడ్ సదుపాయాలున్నాయని.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వాటిని అధునాతనంగా తీర్చిదిద్దాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో కొత్త క్రీడా విధానంపై సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, జితేందర్‌రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, సీఎంవో అధికారులు శేషాద్రి, షాన వాజ్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరి స్తున్న విధానాలపై సమావేశంలో చర్చించారు.క్రీడల్లో రాణించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటు లోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు.చైర్మన్‌ను నియమించాలి...యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)లో ఏర్పాటు చేసినట్లుగానే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా అదే తరహాలో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సి టీగా తీర్చిదిద్దాలని సూచించారు.క్రీడా విశ్వవిద్యాలయానికి చైర్మన్‌ను నియమించాలని.. వర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండేలా చూడాలని ఆదేశించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీలో ప్రాథమికంగా 14 కోర్సులను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో పొందుపరిచారు.ప్రముఖ క్రీడా మైదానాలన్నీ ఒకే గొడుకు కిందకు..ప్రముఖ క్రీడా మైదానాలన్నింటినీ స్పోర్ట్స్ హబ్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడి యం, యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రమ్ లాంటి వాటన్నింటినీ గుర్తించి ఒకే గొడుగు కిందకు తేవాలని చెప్పారు.చదువుకు ఆటంకం లేకుండా..రాష్ట్రవ్యాప్తంగా వివిధ క్రీడల్లో ప్రతిభావంతులను గుర్తించి వారి చదువులకు ఆటంకం లేకుండా జాతీయ, అంతర్జా తీయ స్థాయి పోటీలకు అవసరమైన శిక్షణ అందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా కొత్త పాలసీ ఉండాలని అధికా రులకు దిశానిర్దేశం చేశారు. భౌగోళిక అనుకూల పరిస్థితుల తోపాటు తెలంగాణ ప్రాంత యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దేశ, విదేశాల కోచ్‌లను రప్పించాలని, అక్కడున్న వర్సిటీల సహకారం తీసుకొనేలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు.ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానం..జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడా కారులకు ఇచ్చే ప్రోత్సాహకాల విషయంలో స్పష్టమైన విధా నాన్ని అనుసరించాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి? ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే విషయంలో మార్గదర్శకాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ముసాయిదాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను పరిశీలించి పలు మార్పుచేర్పులను సూచించారు. -
మహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 జాబ్స్..
-
బీసీసీఐతో మాట్లాడాం.. తెలంగాణలో మరో క్రికెట్ స్టేడియం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఒక స్టేడియంపై ఏర్పాటుపై చర్చలు జరిపినట్టు తెలిపారు. అలాగే, రాష్ట్రంలో క్రీడాకారులకు తప్పకుండా ప్రోత్సాహం ఉంటుందన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నియామక బిల్లుపై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గతంలో లేని విధంగా రూ.361 కోట్లను స్పోర్ట్స్ కోసం కేటాయించాడం జరిగింది. ఇంటర్ పాసైన భారత క్రికెటర్ సిరాజ్‌కు ఉద్యోగం ఇస్తున్నాం. బాక్సర్ నిఖత్ జరీన్‌కు కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. చదువులోనే కాదు ఆటల్లో రాణించినా మంచి భవిష్యత్తు ఉంటుందని మా ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. చదువులోనే కాదు.. క్రీడల్లోరాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుంది. కుటుంబ గౌరవం పెరుగుతుంది.ఇక, వచ్చే సమావేశాల్లో స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామన్నారు. వివిధ రాష్ట్రాల పాలసీలు అధ్యయనం చేసి బెస్ట్ పాలసీని తీసుకొస్తాం. హర్యానాలో అత్యధికంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. స్పోర్ట్స్ పాలసీ కోసం ఎవరు ఏ సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాం. హైదరాబాద్‌లో గతంలో నిర్మించిన స్టేడియాలు ప్రైవేట్, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యాయి. వీటన్నింటినీ అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు క్రీడలపై ఆసక్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. అందుకు మీ అందరి మద్దతు కోరుతున్నా. మండలానికి ఒక మినీ స్టేడియం ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్నారు. బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిపామన్నారు. బ్యాగరి కంచెలో అంతర్జాతీయ స్టేడియానికి కూడా స్థలం కేటాయిస్తామన్నారు. ఇప్పటికే స్టేడియం నిర్మించాలని బీసీసీఐని కోరినట్టు చెప్పుకొచ్చారు. క్రీడాకారులకు కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. -
'క్రీడా విధానంలో మార్పులు చేయాలి'
హైదరాబాద్ : క్రీడా విధానంలో మార్పులు చేయాల్సి అవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్. ఇంద్రసేనారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ... కోచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే క్రీడాకారులకు ఇచ్చే పారితోషకంలో కోచ్‌లను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. గ్యాంగ్‌స్టర్ నయిమ్ కేసును సీబీఐకీ అప్పగించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
క్రీడాపాలసీకి మంత్రివర్గ ఉపసంఘం
‘వ్యాయామ విద్య అక్షరాస్యత- క్రీడలు’ వర్క్‌షాపు ముగింపులో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో విద్యార్థులు మొదలు పెద్దవారి వరకు అంతా వ్యాయామ విద్యలో సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర క్రీడాశాఖ, శాప్ సంయుక్త ఆధ్వర్యంలో ‘వ్యాయమ విద్య అక్షరాస్యత-క్రీడలు’ అంశం పై నాగార్జున వర్సిటీలో ఈ నెల 13నుంచి నిర్వహిస్తున్న వర్క్‌షాపు శనివారం ముగిసింది. చివరిరోజు విజయవాడ ఎ-కన్వెషన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. వ్యాయామ అక్షరాస్యతను పూర్తిస్థాయిలో అమల్లోకితెచ్చేందుకు క్రీడా పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. వ్యాయామ విద్యకు కావాల్సిన మౌలిక వసతులు తదితర అంశాలపై ఏప్రిల్ నాటికి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇస్తుందన్నారు. మే ఆఖరుకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు, జూన్ కల్లా స్పోర్ట్స్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. కేబినెట్ సబ్‌కమిటీలో క్రీడాశాఖ, విద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. హైస్కూల్ వరకు వ్యాయామ విద్య తప్పనిసరి చేస్తూ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పా రు. పరీక్షల్లో వ్యాయామ విద్యకు మార్కులు ఇచ్చి వెయిటేజీ లెక్కిస్తామన్నారు. సర్టిఫికెట్లలో ఫిజికల్ ఫిట్నెస్ కాలమ్ చేరుస్తామని ప్రకటించారు. ఆనందంగా ఉండే విషయంలో మన దేశం ప్రపంచంలో 117వ స్థానంలో ఉందని, 2029 నాటికి రాష్ట్రాన్ని హ్యాపీనెస్ ఇండెక్స్‌లో దేశంలోనే నెంబర్‌వన్ స్థానానికి చేర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక స్టేడియాలు.. అమరావతి, విశాఖ, తిరుపతి రీజియన్లుగా ఆధునిక వసతులున్న స్టేడియాలు నిర్మించనున్నట్లు సీఎం చెప్పారు. వ్యాయామ విద్య-క్రీడలు రెండు విభాగాలుగా చేస్తామన్నారు. ప్రతి పాఠశాలలో కావల్సిన పీఈటీలు, పీడీలు, వ్యాయామ విద్య బోధకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు లింకేజీతో విద్యార్థులు, క్రీడాకారుల ఫిట్నెస్, డేటాను నమోదు చేస్తామన్నారు. వర్క్‌షాపు నిర్వహించిన బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపిచంద్‌ను సీఎం అభినందించారు. స్వయం ఉపాధికి ‘పెట్టీ’ చేయూత: సీఎం విశిష్ట ప్రతిభావంతులకు (వికలాంగులకు) స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో సోలార్ మొబైల్ బడ్డీకొట్టు(పెట్టీ) వాహనాలు చేయూతగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ఏ1-కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో ఆర్స్ట్రీచ్ కంపెనీ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా వికలాంగుల కోసం రూపొందించిన సన్ని స్పెల్టర్-సోలార్ చార్జ్డ్ పెట్టీ షాపు వాహన పనితీరును శనివారం సీఎం పరిశీలించి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వాహనాన్ని నడిపి దాని పనితీరుపై ప్రతినిధులను అభినందించారు. ఈ వాహనం గంటకు 12 కి.మీ. నడుస్తుంది. ఒక్కసారి చార్జ్డ్ అయ్యాక 70 కి.మీ. నడుస్తుంది. 200 కేజీల బరువును ఇది మోసుకుపోగలదు. చిరు వ్యాపారాలు పండ్లు, కూరగాయలు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ వంటి వాటిని దీని ద్వారా అమ్ముకోవచ్చని కంపెనీ ప్రతినిధి వైవీ రత్నకుమార్ సీఎంకు వివరించారు.