పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించాలి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతి కోసం వినియోగించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తీకేయ మిశ్రా విద్యార్థులకు సూచించారు. అన్నాసాగరంలోని వరదారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించే ‘స్పుత్నిక్-2013’ జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్ ఫెస్ట్ గురువారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా మిశ్రా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. నవ సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షిం చా రు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్, మెడికల్ సబ్జెక్టులు ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉంటాయన్నారు. ఇప్పటివరకు 450 గుండె ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ‘గ్రామ ప్రజల గుండె చికిత్సాలయం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి ఫెస్ట్ లు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని తమ ఈవెంట్స్‌ను ప్రదర్శించారు.ప్రోగ్రాం కన్వీనర్ ఎన్.సుధాకర్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రమేష్, రాము, శరత్, పాండురంగ, గోవర్ధన్, మధుసూదన్, ఉపేందర్ పాల్గొన్నా రు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఈవెంట్స్‌ను అతిథులు తిలకించారు.