Squad officers
-
‘పుట్ట’లోంచి బయటపడుతున్న కట్టల పాములు!
ఆపరేషన్ వన్ వీక్... డిసెంబర్ 1నుంచి ఎన్నికలు జరిగే 7వ తేదీవరకు ఆపరేషన్ వన్‌వీక్ పేరుతో ఎన్నికల స్క్వాడ్స్, పోలీస్ బృందాలు, రెవెన్యూ పరిశీలకులు, పోలీస్ పరిశీలకులు ప్రత్యేక నిఘా పెట్టబోతున్నారు. అభ్యర్థుల అనుచరులు, వారి కదలికలను పసిగట్టి ఎక్కడికక్కడ దాడులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలు స్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఎనిమిది ప్రధాన మార్గాల్లో 18 చెక్ పోస్టులు ఏర్పాటుచేశారు. ఇప్పుడు మరో 8 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు తెలిసింది. అదే విధంగా జిల్లాల సరిహద్దుల్లో 58కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అయితే ఇప్పుడు జిల్లాలు, ప్రధాన అర్బన్ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లోకి వెళ్లే రూట్లలో ఒక్కో మార్గానికి 5 నుంచి 6 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక చెక్‌పోస్టు నుంచి తప్పించుకున్నప్పటికీ మరో చెక్‌పోస్టులో దొరికిపోయే అవకాశం ఉంటుందన్న పరిశీలకుల నివేదికతో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న మద్యం, నగదు చూసి ఎన్నికల సంఘం షాక్ తింటోంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గరినుంచి ఇప్పటివరకు దాదాపుగా రూ.100 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వస్తువులను ఎన్నికల, పోలీస్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ఉధృతం చేస్తుండటం, ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రలోభాలు తీవ్రతరం కాబోతున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు చివరి వారంరోజుల్లో మరిన్ని దాడులు, సోదాలు నిర్వహించబోతున్నాయి. ఇన్నాళ్లు జరిగింది ఒక ఎత్తు, ఈ వారంరోజులు జరగబోయే తంతు మరో ఎత్తుగా ప్రత్యేక బృందాలు భావిస్తున్నాయి. బంగారం, వెండి, గంజాయి.. టికెట్ల కేటాయింపు దగ్గరి నుంచి ప్రచారం ముగిసే ఆఖరిరోజు వరకు కార్యకర్తలు, నేతలతోపాటు ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో నగదు, మద్యం, ఇతర కానుకలను ఇచ్చి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. డిసెంబర్ 7న జరిగే ఎన్నికలకు సరిగ్గా వారం రోజులముందు అంటే డిసెంబర్ 1నుంచి ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కీలకమైన రోజులను పార్టీలు, అభ్యర్థులు పెద్దఎత్తున ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనమవడమే ప్రలోభాల స్థాయికి పెద్ద ఉదాహరణ అని పోలీస్ శాఖ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ తనిఖీల్లో రూ.62.18 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఐటీ విభాగం రూ.21.22 కోట్లను స్వాధీనపర్చుకుంది. అంటే, మొత్తం నగదు రూ.83 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. ఇక పోలీస్ శాఖ తనిఖీల్లో రూ.87లక్షల విలువైన 24,087 లీటర్ల మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ నేతృత్వంలో దాడులు నిర్వహించగా రూ.9.20 కోట్ల విలువైన 41వేల లీటర్ల మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. మొత్తంగా రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యం ఎన్నికల నేపథ్యంలో స్వాధీనపరుచుకున్నారు. పోలీస్ శాఖ జరుపుతున్న తనిఖీల్లో భాగంగా బంగారం, వెండి, గుట్కా ప్యాకెట్లు, గంజాయి తదితరాలు సైతం పట్టుబడ్డాయి. ఇలా రూ.7.50 కోట్ల విలువైన బంగారం, వెండి, గుట్కా అక్రమ మార్గంలో రాష్ట్రానికి చేరినట్టు పోలీస్ శాఖ నివేదించింది. మొత్తంగా రూ.100 కోట్ల మేర నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడటం ఎన్నికల కమిషన్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జహీరాబాద్‌లో రూ. 50 లక్షలు పట్టివేత జహీరాబాద్ టౌన్: కారులో తరలిస్తున్న రూ. 50 లక్షలను జహీరాబాద్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్థానిక డీఎస్పీ నల్లమల రవి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దులోని చిరాగ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని మాడ్గి చౌరస్తాలో జాతీయ రహదారిపై వాహనాలను తని ఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ వద్ద రూ.50 లక్షలు లభించాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఎన్నికల సెల్‌కు సమాచారం అందించామని చెప్పారు. -
అక్రమ సరుకు వయా అధికార పార్టీ?
• చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న విదేశీ టేకు • నాయకుల రంగప్రవేశంతో అధికారులు సెలైంట్ ఒంగోలు క్రైం: విదేశీ టేకు అక్రమ వ్యాపారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నారుు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు కలప యథేచ్ఛగా తరలిపోతోంది. నాలుగు రోజులుగా ఒంగోలు రిజర్వు ఫారెస్ట్ కార్యాలయంలో ఉన్న రెండు లారీల వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి పెరగడంతో వాటిని అక్కడ నుంచి పంపించేందుకు అటవీ శాఖాధికారులు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. వేబిల్లులు సక్రమంగా లేకపోవడం ఒక ఎత్తు అయితే... గుంటూరు అటవీ శాఖకు చెందిన స్క్వాడ్ అధికారులు ఈ వ్యవహారంలో మెత్తబడినట్లు సమాచారం. ఒంగోలు అటవీ శాఖాధికారులు కూడా స్క్వాడ్ అధికారులతో చేతులు కలిపి నామమాత్రపు అపరాధరుసుం విధించి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా విదేశీ టేకు తరలిస్తున్న రెండు లారీలను అక్టోబర్ 31వ తేదీ రాత్రి అటవీ శాఖ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. గుంటూరు చెందిన స్క్వాడ్ రేంజర్ నాగేంద్రరావు ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు బైపాస్ రోడ్డులో మాటు వేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకున్న టేకును చెన్నై హార్బర్ నుంచి లారీల్లో తరలిస్తున్నారు. లారీ డ్రైవర ్లను టేకుకు సంబంధించిన ఇన్వాయిస్, సరుకు వివరాలు చూపించాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో లారీలను ఒంగోలు రెగ్యులర్ ఫారెస్ట్ రేంజర్ కార్యాలయూనికి తరలించారు. వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించి వెళ్లి పోయారు. -
తొలిరోజే ఇద్దరు డిబార్
⇒ ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం ⇒ పలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు ⇒ ఆలస్యంగా వచ్చి వెనుగిరిగిన కొందరు విద్యార్థులు నిజామాబాద్ అర్బన్ :ఇంటర్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ, ఎస్ఎస్ఆర్ కళాశాల కేంద్రాలను జేసీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. చిట్టిమిల్ల హరిప్రసాద్ కళాశాల కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా స్క్వాడ్ అధికారులు వారిని పట్టుకున్నారు. 45 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించినా, కొన్ని చోట్ల విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. కాకతీయ జూనియర్ కళాశాల లో ఇద్దరు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. ఖలీల్వాడిలోని ఎస్ఎస్ఆర్ పరీక్ష కేంద్రానికి చెందిన ఓ ఇన్విజిలేటర్ 9.40 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి వచ్చారు. అధికారులు ఆయననూ అనుమతించలేదు. సమాచారం ఆలస్యంగా ఇచ్చారని తెలిపినా, నిరాకరించారు. మొదటి రోజు పరీక్షలకు 2,121 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మంగళవారం ద్వితీయ ఇంటర్ పరీక్షలు మొదలవుతాయి. -
ఆదాయం పెరిగితేనే అదనపు రైళ్లు
సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు గిద్దలూరు : రైల్వేస్టేషన్ రోజు వారీ ఆదాయం పెరిగితేనే గిద్దలూరు మీదుగా అదనపు రైళ్లను నడపగలమని సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు చెప్పారు. స్థానిక రైల్వేస్టేషన్‌ను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించిన ఆయన.. స్టేషన్‌లోని అన్ని ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. రికార్డులను తనిఖీ చేసి టికెట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందని ఆరా తీశారు. అక్టోబర్ నెలలో తక్కువ ఆదాయం రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో రూ.17.60 లక్షల ఆదాయంరాగా, ఈ నెలలో ప్రస్తుతానికి రూ.13.87 లక్షలు వచ్చినట్లు శ్రీరాములు గుర్తించారు. ఇలా ప్రతి నెలా ఆదాయం తగ్గుతుంటే అదనపు బోగీలు, రైళ్లు నడపడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిం చారు. గిద్దలూరు ప్రాంతంలో ఎక్కువ మంది ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారని, గరీభ్థ్ ్రరైలును ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకోవాలని విలేకరులు కోరగా కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేందుకు టికెట్లు అమ్ముడుపోతేనే ఆ రైలును ఇక్కడ ఆపుతామని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటే అదనపు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారు గిద్దలూరులోనే పూర్తిస్థాయి టిక్కెట్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, బోగీలు సిద్ధం కావాల్సి ఉందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలి పారు. యడవల్లి రైల్వేస్టేషన్లో టిక్కెట్లు ఇచ్చేందుకు చొరవ చూపాలని కోరగా అక్కడ ఎంతమేర ఆదాయం వస్తుందో పరిశీలించి నివేదిక ప్రకారం టిక్కెట్లు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎక్కువ సమయం పనిచేసేలా చూడాలని, చాలా మంది నంద్యాల వెళ్లి రిజర్వేషన్ చేయించుకుంటున్నారని, రైల్వే విచారణ కోసం ఫోన్ చేస్తే సిబ్బంది ఫోన్ తీసి సమాధానం చెప్పడం లేదని విలేకర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టేషన్లో గంటకొట్టే వద్ద ఉన్న బూజు, దుమ్మును గమనించిన శ్రీరాములు.. స్టేషన్ మాస్టర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆయనతో పాటు పలువురు టిక్కెట్ కలెక్టర్లు, స్క్వాడ్ అధికారులు ఉన్నారు.