ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
► మరో ఇద్దరి విద్యార్థులకు తీవ్రగాయాలు
► కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఘటన
► బర్త్‌డే పార్టీ తిరుగు ప్రయూణంలో విషాదం
► పంథిని, నాగేంద్రనగర్‌లో విషాదఛాయలు
బర్త్‌డే పార్టీ వేడుక విషాదాంతమైంది.. శుక్రవారం అర్ధరాత్రి కారు అతివేగంగా చెట్టును ఢీకొనడంతో పిన్నింటి అనిదీప్‌రావు, అభినవ్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి గాయూలయ్యూరుు. వీరు ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు.. ఘటన వరంగల్-ఖమ్మం రహదారి నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో జరిగింది.. వర్ధన్నపేట మండలం పంథిని, నగరంలోని నాగేంద్ర నగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నారుు.
మామునూరు : నలుగురు బీటెక్ విద్యార్థులు కలిసి బర్త్‌డే పార్టీ చేసుకుని తిరిగి వస్తున్న వారి ప్ర యాణం విషాదాంతమైంది. కారు స్టీరింగ్ అదుపుతప్పి చెట్టును వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెం దగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవా రం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం పంథినికి చెందిన పిన్నింటి అమరేందర్‌రావు, కృష్ణజ్యోతి దంపతులకు కుమారుడు అనిదీప్‌రావు(19), కూతురు సిర ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహమైంది.
అమరేందర్‌రావు వ్యవసాయం చేస్తూ కుమారుడు అనిదీప్రావును బీటెక్ చదివిస్తున్నారు. అనిదీప్‌రావు హన్మకొండలో ఉంటూ హసన్‌పర్తిలోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల అని దీప్‌రావు బర్త్‌డే సందర్బంగా కుమారుడి కోరిక మేరకు అమరేందర్‌రావు వేర్న కారు (సెకండ్ హ్యాండ్)ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో స్నేహితుల కోరిక మేరకు కళాశాలలో బీటెక్ చేస్తున్న వరంగల్ నగరంలోని 11వ డివిజన్ నాగేంద్రనగర్ కాలనీకి చెందిన బిల్ల శంకర్ కుమారుడు బిల్ల అభినవ్(18), 16వ డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మారినేని లక్ష్మణ్‌రావు కుమారుడు కృష్ణ ప్రసాద్ (18), కాజీపేట సి ద్దార్థనగర్కు చెందిన బాలమోహన్‌రెడ్డి కుమారుడు బాల ప్రణయ్‌రెడ్డి(18)తో కలిసి అనిదీప్‌రావు శుక్రవారం సాయంత్రం కారులో తన స్వ గ్రామమైన పంధినికి వెళ్లాడు.
బర్త్‌డే పార్టీ పూర్తి చేసుకుని ఆ నలుగురు విద్యార్థులు తిరిగి శుక్రవారం అర్ధరాత్రి నగరానికి కారులో బయలుదేరారు. ఈక్రమంలో వరంగల్-ఖమ్మం జాతీ య ర హదారిపై నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో వేగంతో ఉన్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న పిన్నింటి అనిదీప్రావుతోపా టు బిల్ల అభినవ్ అక్కడిక్కడే మృతిచెందగా... మరో ఇద్దరు మారినేని కృష్ణప్రసాద్, బాల ప్రణయ్‌రెడ్డి తీవ్ర ంగా గాయపడ్డారు. వీరిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 108 వా హనంలో తరలించారు.
వైద్యుల సూచనల మే రకు బాల ప్రణయ్‌రెడ్డిని హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మారినేని కృష్ణప్రసాద్ హన్మకొండ లైఫ్లెన్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నాడు. మృతిచెందిన బిల్ల అ భినవ్, పిన్నింటి అనిదీప్‌రావు తల్లిదండ్రుల పిర్యాదు మేరకు మామునూరు పోలీసులు కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హతిరాం తెలిపారు.కాగా, అతివేగం.. మద్యమత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కరణమై ఉంటుందని, ప్రమాదానికి గురైన కారు లో మద్యం సీసాలు దొరికినట్లు తెలిసింది.
వి ద్యార్థులు మృతిచెందడంతో పంధిని, నాగేంద్రనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నారుు. ఇదిలాఉండగా, మామునూరు నాయుడు పె ట్రోల్ బంక్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆభినవ్(19) తన కళ్లను వరంగల్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. వరంగల్ కంటి ఆస్పత్రి డాక్టర్ ఎల్వీ ప్రసాద్ సూచనమేరకు ఆభినవ్ కళ్లను డొనేట్ చేశామని మృతుడి తండ్రి శంకర్ తెలిపారు.