యువకుడు ఆత్మహత్య
గుంతకల్లు : పట్టణంలోని భాగ్యనగర్‌కు చెందిన శ్రావణ్‌రామ్ (24) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. దశరథరామ్, భాగ్యలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు శ్రావణ్‌రామ్ బీటెక్ వరకు చదివాడు. ప్రస్తుతం ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు. శుక్రవారం రాత్రి సినిమాకు వెళ్లొస్తానని బయటకు వెళ్లిన ఇతడు అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఉదయాన్నే ఇంటికి వస్తానని చెప్పాడు. శనివారం ఉదయం హనుమాన్ సర్కిల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. వెంటనే వారు సంఘటన స్థలానికి వెళ్లి బోరున విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.