Sri Lankan President Maithripala Sirisena
-
పార్లమెంటు భేటీకి సిరిసేన అంగీకారం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంటును వచ్చే వారం సమావేశపర్చే అవకాశముందని స్పీకర్ కరు జయసూర్య కార్యాలయం తెలిపింది. దేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిష్కారం కనుగొనాలని చేసిన సూచనకు అధ్యక్షుడు ఓకే చెప్పారు. శ్రీలంక కొత్త ప్రధానిగా రాజపక్స నియామకంపై అటార్నీ జనరల్ జె.జయసూర్య న్యాయసలహా ఇచ్చేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం అధికారం లేకపోయినప్పటికీ ప్రధాని విక్రమసింఘేను పదవి నుంచి సిరిసేన తప్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. మరోవైపు రాజపక్సను కొత్త ప్రధానిగా చైనా, బురుండి తప్ప మరేదేశాలు అంగీకరించకపోగా, సిరిసేనపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. -
దురయప్ప స్టేడియంను ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ : శ్రీలంకలోని జాఫ్నాలో దురైయప్ప మైదానం శనివారం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంయుక్తంగా ఆరంభించారు. జఫ్నా మాజీ మేయర్ ఆల్ఫ్రెడ్ తంబిరాజా దురయప్ప పేరుతో భారత్ ఈ స్టేడియాన్ని రూ.7కోట్లతో పునరుద్ధరించింది. అనంతరం మైదానాన్ని జాతికి అంకితం ఇచ్చారు. దురైయప్ప మైదానం పునర్నిర్మాణానికి సాయం చేసిన భారత్‌కు ఈ సందర్భంగా మైత్రిపాల సిరిసేన కృతజ్ఞతలు తెలిపారు. కాగా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడుతూ భారత్ ఆర్థిక వృద్ది పొరుగు దేశాలకు లాభదాయకం కావాలన్నారు. శ్రీలంక ఆర్థికంగా మరింత సంపన్నంగా కావాలని భారత్ కోరుకుంటుందని మోదీ ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పరిమితం కాదని అన్నారు. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శుక్రవారం ఆ దేశ పార్లమెంటును రద్దు చేశారు. షెడ్యూలు ప్రకారం 2016 ఏప్రిల్‌లో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 8 నెలలు ముందుగానే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేస్తూ పార్లమెంటును రద్దు చేశారు. సంబంధిత గెజిట్ నోటిఫికేషన్‌పై అధ్యక్షుడు శుక్రవారం సంతకం చేశారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. లంక పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉన్నారు. అయితే, పార్లమెంటును రద్దు చేస్తానని ఏప్రిల్ 23నే ప్రకటించిన సిరిసేన రాజ్యాంగ, ఎన్నికల సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయాన్ని వాయిదా వేశారు. రాజ్యాంగానికి 19వ సవరణ ఏప్రిల్ చివర్లోనే పార్లమెంటు ఆమోదం పొందినా, ఎన్నికల సంస్కరణల విషయంలో మాత్రం పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కాగా, జనవరిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్సపై విజయం సాధించిన సిరిసేన ప్రధాని రణిల్ విక్రమసింఘే నేతృత్వంలోని మైనార్టీ సర్కారును నియమించారు.