దురయప్ప స్టేడియంను ప్రారంభించిన మోదీ | India's growth must bring benefits to its neighbours: PM | Sakshi
Sakshi News home page

దురయప్ప స్టేడియంను ప్రారంభించిన మోదీ

Published Sat, Jun 18 2016 12:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

India's growth must bring benefits to its neighbours: PM

న్యూఢిల్లీ : శ్రీలంకలోని జాఫ్నాలో దురైయప్ప మైదానం శనివారం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంయుక్తంగా ఆరంభించారు. జఫ్నా మాజీ మేయర్ ఆల్‌ఫ్రెడ్ తంబిరాజా దురయప్ప పేరుతో భారత్  ఈ స్టేడియాన్ని రూ.7కోట్లతో పునరుద్ధరించింది. అనంతరం మైదానాన్ని జాతికి అంకితం ఇచ్చారు.  దురైయప్ప మైదానం పునర్నిర్మాణానికి సాయం చేసిన భారత్‌కు ఈ సందర్భంగా మైత్రిపాల సిరిసేన కృతజ్ఞతలు తెలిపారు.

కాగా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడుతూ భారత్ ఆర్థిక వృద్ది పొరుగు దేశాలకు లాభదాయకం కావాలన్నారు. శ్రీలంక ఆర్థికంగా మరింత సంపన్నంగా కావాలని భారత్ కోరుకుంటుందని మోదీ ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పరిమితం కాదని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement