ఆయుర్వేదంతో రోగాలు నయం
కురబలకోట: ఆయుర్వేదం అపర సంజీవని లాంటిదని, ఎలాంటి మొండి రోగాల్నయినా బాగు చేయవచ్చని అంతర్జాతీయ ఆయుర్వేద డాక్టర్, శ్రీమహర్శి మహేష్ యోగి ఆయుర్వేద న్యూఢిల్లీ ఆస్పత్రి డెరైక్టర్ రాజు అన్నారు. కురబలకోట మండలం అంగళ్లు దగ్గరున్న మల్లయ్య కొండను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఆయుర్వేదంపై ప్రపంచ దేశాల్లో తిరిగానన్నారు. ఆయుర్వేదంతో ఎలాంటి జబ్బునయినా నయం చేయవచ్చన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ నియంత్రణ, చర్మవ్యాధులు, అధిక బరువు, షుగర్, పోలియో, కీళ్ల నొప్పులు, గుండెజబ్బులు, మూత్ర పిండాలు, సంతానలేమి, కంటి జబ్బులు తదితర వ్యాధులకు వైద్యం చేయవచ్చన్నారు.
ఆయుర్వేదానికి మదనపల్లె వాతావరణం అనువుగా ఉందని ఆయన తెలిపారు. దీనిని ఆంగ్లేయులు గుర్తించి ఆరోగ్యవరాన్ని (శానిటోరియం) ఏర్పాటు చేశారన్నారు. త్వరలో మదనపల్లెలోని శ్రీమహర్శి మహేష్ యోగి ధ్యాన మం దిరంలో ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నామన్నారు. మందులను కూడా అందజేస్తామన్నారు. అంగళ్లు మల్లయ్యకొండపై ఆయుర్వేద ఔషధవనాన్ని ఏర్పాటు చే స్తున్నామన్నారు. అలాగే మదనపల్లెలో ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఆయన వెంట హైదరాబాదు ఆయర్వేద హాస్పిటల్ నిపుణులు రాజు, దేవరబురుజు రమణరెడ్డి, కరక్కాయల రంగన్న, మల్లయ్య కొండ చైర్మన్ కాకర్ల కృష్ణమూర్తి, రియల్టర్ రంగనాథం తదితరులు పాల్గొన్నారు.