లెక్చరర్ మందలించాడని...
లెక్చరర్ మందలించాడని మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని కొత్తపేట శ్రీమేధావి కళాశాలలో శుక్రవారం వెలగుచూసింది. కళాశాలలో ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించడంతో.. ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకొని విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తూ.. కళాశాల ముందు ఉన్న అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.