sri potti sriramulu
-
పొట్టి శ్రీరాములు, వైఎస్ఆర్ కు నివాళులు చేస్తున్న సీఎం జగన్
-
అమరజీవికి ‘భారతరత్న’ ఇవ్వాలి
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ నెల్లూరు(సెంట్రల్): ఎనిమిది కోట్ల ఆంధ్రుల కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీపొట్టిశ్రీరాములుకు ‘భారతరత్న’ ఇవ్వాలని సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. పొట్టిశ్రీరాములు 62వ వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహానికి డిఫ్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్, వైఎస్సార్సీపీ కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవికి భారతరత్నతో గౌరవించినప్పుడే ఆ మహా నేతకు ఘననివాళి అన్నారు. అమరజీవికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామన్నారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ర్టం నుంచి తెలంగాణా విడిపోయిం దే కాని ఆంధ్రరాష్ట్రం విడిపోలేదన్నారు. అసెంబ్లీలో సైతం శ్రీ పొట్టి శ్రీ రాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుస్తామన్నారు. కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్‌అహ్మద్, మీదూరి ప్రశాంతికుమార్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్ , కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గోతం బాలకృష్ణ, టి మురళి, ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు గంధం సుధీర్‌బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు శ్రీహరిరాయులు, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉప కార్యదర్శి హాజీ పాల్గొన్నారు. అమరజీవికి నివాళి నెల్లూరు(క్రైమ్): అమరజీవి పొట్టిశ్రీరాములకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సోమవారం ఘన నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు 63వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో అమరజీవి చిత్రపటం వద్ద ఏఎస్పీ రెడ్డి గంగాధర్, ఎస్బీ, ఏఆర్, డీసీఆర్బీ, డీఎస్పీలు రామారావు, చెంచురెడ్డి, నారాయణస్వామిరెడ్డి, నాగసుబ్బన్న, ఆర్ఐలు, ఏఆర్సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. అనంతరం అమరజీవి స్మృత్యార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. హోమ్గార్డ్స్ ఆర్ఐ చిర ంజీవి, ఆర్ఎస్ఐలు హుస్సేన్, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ రాజశేఖర్, ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని చీల్చారు: మంత్రి నారాయణ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చారని రాష్ర్ట మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు 62వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని వారికి ప్రత్యేక రాష్ర్టం కావాలని 58 రోజులు పాటు ఆమరణనిరాహారదీక్ష చేసి ప్రాణాలను సైతం కోల్పోయారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జిల్లా వాసి కావడం అందరికి గర్వకారణం అన్నారు. కలెక్టరు జానకి, నగర మేయర్ అబ్దుల్అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆర్డీఓ నివాళి: ఆత్మకూరు బస్టాండు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి నెల్లూరు ఆర్టీఓ సుబ్రమణ్వేశ్వరరెడ్డి, తహశీల్దార్ జనార్దన్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 వ తేదీనే నిర్ణయించాలని సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చంద్రబాబు నిర్ణయాన్ని మేకపాటి ఈ సందర్బంగా ఖండించారు. అవతరణ దినోత్సవం విషయంలో మరోసారి ఆలోచించాలని మేకపాటి ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. శనివారం నెల్లూరు నగరంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'పొట్టి శ్రీరాములు తెలంగాణ ప్రజలకు ఆదర్శం'
-
'పొట్టి శ్రీరాములు తెలంగాణ ప్రజలకు ఆదర్శం'
తెలంగాణ ప్రజలకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆదర్శమని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. పొట్టి శ్రీరాములు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని, ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పోరాడారని గుర్తు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా ఈటెల మాట్లాడుతూ... 60 ఏళ్ల నిరీక్షణ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన టీఆర్ఎస్ తరఫున బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల మనస్సును దోచుకునే పని ఒక్కటి కూడా ఆంధ్ర పాలకులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇంతకాలం అన్నదమ్ముల్లా కలసి ఉన్నామని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అలాగే ఉందామని ఈటెల చెప్పారు. తెలంగాణ ఉద్యమం సంకుచితమైంది కాదని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మద్దతిచ్చేవారు సీమాంధ్రలో కూడా ఉన్నారని ఈటెల గుర్తు చేశారు. -
మరింత ఉధృతంగా..
సాక్షి నెట్వర్క్ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సహా ఎందరో త్యాగధనుల ఫలమైన సమైక్యాంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలు కానివ్వబోమంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సమైక్య రాష్ట్ర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంది. వరుసగా 94వరోజైన శుక్రవారం కూడా రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. విశాఖలో ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో భారీ మానవహారం నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమలాపురం, పెద్దాపురంలలో సమైక్యవాదులు అమరజీవి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అంబాజీపేటలో విద్యార్థులు సమైక్య గర్జన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు సమైక్యవాదులు, ఏన్జీవోలు పాలాభిషేకాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోవిద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. విజయనగరంలో న్యాయవాదుల బైక్ ర్యాలీని పోలీసులు భగ్నంచేసి సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిని పోలీస్ వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. వర్షంలో తడుస్తూ... వైఎస్సార్ జిల్లా బద్వేలులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో వర్షంలోనే తడుస్తూ నిరసన చేపట్టారు. కడపలో ఎన్జీఓలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వృథాగా పోనీయ్యబోమని ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులు ప్రతినబూనారు. అనంతపురంలో ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు, ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. గుంతకల్లు, కదిరి, లేపాక్షిలో విద్యార్థులు మహా మానవహారం నిర్మించారు. హిందూపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో ఎన్జీవోలు, న్యాయవాదులు, మెడికల్ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో గాండ్ల, చేనేత, బలిజ సంఘాలు విద్యార్థిగర్జన నిర్వహించాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మానవహారం నిర్వహించారు. అఖిలపక్షంలో సమైక్యవాదం వినిపించండి ‘కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ సమావేశంలో సమైక్యవాదం వినిపించి తీరాలి. లేకపోతే ఆయా పార్టీల నాయకులను రోడ్లపై తిరగనివ్వం’ అని కర్నూలు జిల్లా విద్యాసంస్థల జేఏసీ నాయకులు హెచ్చరించారు.కర్నూలులో వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగసభ నిర్వహించారు. నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.