సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్
నెల్లూరు(సెంట్రల్): ఎనిమిది కోట్ల ఆంధ్రుల కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీపొట్టిశ్రీరాములుకు ‘భారతరత్న’ ఇవ్వాలని సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. పొట్టిశ్రీరాములు 62వ వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహానికి డిఫ్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్, వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవికి భారతరత్నతో గౌరవించినప్పుడే ఆ మహా నేతకు ఘననివాళి అన్నారు. అమరజీవికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామన్నారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ర్టం నుంచి తెలంగాణా విడిపోయిం దే కాని ఆంధ్రరాష్ట్రం విడిపోలేదన్నారు.
అసెంబ్లీలో సైతం శ్రీ పొట్టి శ్రీ రాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తామన్నారు. కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఖలీల్‌అహ్మద్, మీదూరి ప్రశాంతికుమార్, దేవరకొండ అశోక్, నాయకులు వేలూరు మహేష్ , కుంచాల శ్రీనివాసులు, వందవాసి రంగ, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గోతం బాలకృష్ణ, టి మురళి, ముదిరెడ్డి లక్ష్మీరెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు గంధం సుధీర్‌బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు శ్రీహరిరాయులు, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉప కార్యదర్శి హాజీ పాల్గొన్నారు.
అమరజీవికి నివాళి
నెల్లూరు(క్రైమ్): అమరజీవి పొట్టిశ్రీరాములకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సోమవారం ఘన నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు 63వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో అమరజీవి చిత్రపటం వద్ద ఏఎస్పీ రెడ్డి గంగాధర్, ఎస్‌బీ, ఏఆర్, డీసీఆర్‌బీ, డీఎస్పీలు రామారావు, చెంచురెడ్డి, నారాయణస్వామిరెడ్డి, నాగసుబ్బన్న, ఆర్‌ఐలు, ఏఆర్‌సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. అనంతరం అమరజీవి స్మృత్యార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. హోమ్‌గార్డ్స్ ఆర్‌ఐ చిర ంజీవి, ఆర్‌ఎస్‌ఐలు హుస్సేన్, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ రాజశేఖర్, ఎస్‌బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని చీల్చారు: మంత్రి నారాయణ
కొందరి రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చారని రాష్ర్ట మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు 62వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఆత్మకూరు బస్టాండు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని వారికి ప్రత్యేక రాష్ర్టం కావాలని 58 రోజులు పాటు ఆమరణనిరాహారదీక్ష చేసి ప్రాణాలను సైతం కోల్పోయారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జిల్లా వాసి కావడం అందరికి గర్వకారణం అన్నారు. కలెక్టరు జానకి, నగర మేయర్ అబ్దుల్‌అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఆర్డీఓ నివాళి:
ఆత్మకూరు బస్టాండు వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి నెల్లూరు ఆర్టీఓ సుబ్రమణ్వేశ్వరరెడ్డి, తహశీల్దార్ జనార్దన్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అమరజీవికి ‘భారతరత్న’ ఇవ్వాలి
Published Tue, Dec 16 2014 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement