పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి | YSR Congress party leaders pays tribute to Sri Potti Sriramulu | Sakshi
Sakshi News home page

పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి

Published Sat, Nov 1 2014 11:05 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి - Sakshi

పొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలి

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 వ తేదీనే నిర్ణయించాలని సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చంద్రబాబు నిర్ణయాన్ని మేకపాటి ఈ సందర్బంగా ఖండించారు. అవతరణ దినోత్సవం విషయంలో మరోసారి ఆలోచించాలని మేకపాటి ఈ సందర్భంగా చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

శనివారం నెల్లూరు నగరంలోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షడు ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి  పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement