sri venkateshwara zoo park
-
తిరుపతి: ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతి
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్కులో ఏనుగు మృతిచెందింది. చిత్తూరు జిల్లా మాదమరి మండలంలో పంటపొలాల విధ్వంసంలో ఏనుగుకు గాయాలవ్వగా అటవీశాఖ సిబ్బంది జూపార్క్‌కు తరలించారు. అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగుకి గాయాలు కావడంతో జూపార్క్‌లో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఎస్వీ జూపార్కులో మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఏనుగు కళేబరానికి బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మరోవైపు సదుం మండలం గంటా వారి పల్లి పంట పొలాలలో విద్యుత్ షాక్ తగిలి మరో ఏనుగు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. -
చిత్తూరులో 65వ వన్యప్రాణి వారోత్సవం
-
‘సమీర్- రాణి’ పిల్లలకు నామకరణం!
సాక్షి, తిరుపతి: శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్కుకు చెందిన తెల్ల పులులు సమీర్, రాణిలకు పుట్టిన సంతానానికి రాష్ట్ర అటవీశాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామకరణం చేశారు. మూడు మగ పులి పిల్లలకు వాసు, సిద్ధాన్, జగన్ అని... ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గ అనే పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్. ప్రదీప్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు నళినీ మోహన్, ఏకే ఝా, ఆర్కే సుమన్, శరవణన్, జూ క్యూరేటర్ బబిత తదితరులు పాల్గొన్నారు. -
నైట్ సఫారీగా తిరుపతి జూపార్క్
తిరుపతి : తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సింగపూర్ తరహా నైట్ సఫారీగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జూ అధికారులు తయారు చేసిన మాస్టర్ ప్లాన్, లే అవుట్లతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొత్తం 200 ఎకరాల విస్తీర్ణంలో సందర్శకులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దాలని అటవీ శాఖ యోచిస్తోంది. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలకు ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కార్యాలయం ఆమోదం తెలియజేస్తే జూ అధికారులు టెండర్లకు వెళ్లే అవకాశం ఉంది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతుల మేరకు నైట్ సఫారీ ఏర్పాటుకు పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న జూ మెయిన్ గేటు నుంచి శ్రీవారి మెట్లకు వెళ్లే రోడ్డుకు కుడివైపున నైట్ సఫారీ పనులు చేపట్టడం వల్ల సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగే వీలుందని జూ అధికారులు భావిస్తున్నారు.