Srikanth Reddy gattu
-
‘పవన్ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని’
సాక్షి, అమరావతి : విపక్షాలు ప్రతిరోజు ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతన్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం ప్రభుత్వ విప్‌లు సమావేశమయ్యి చర్చించారు. ఈ నేపథ్యంలో ప్రతి బుధవారం ఈ తరహా సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా ఉండాలన్నదే ప్రతిపక్షాల ప్రయత్నమని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర నవంబర్ 6నే మొదలుపెట్టి పూర్తి చేశారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుర్తు చేశారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు సమస్యలు తెలుసుకొని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేస్తున్న రోజే ఈనాడు పత్రికలో ఇసుక కొరత, నిర్మాణ రంగంపై కథనం వచ్చిందని, దాన్ని అనుసరించే ఇసుక అవినీతిని అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చంద్రబాబు ఇసుకపై చేసే దీక్షకు విలువ ఉండదని, ఇసుక విషయంలో ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉందని స్పష్టం చేశారు. ప్రతి బుధవారం పార్టీ కోర్ కమిటీ సమావేశమయ్యి ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా వివిధ అంశాలు చర్చిస్తుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పేర్కొన్నారు. ఇసుక వల్ల తలెత్తిన ఇబ్బందిని సరిచేస్తామన్నారు. చంద్రబాబు ఇసుక కోసం చేసే దొంగ దీక్షలను ప్రజలు హర్షించరని దుయ్యబట్టారు. విశాఖలో పవన్ చేసిన ధర్నా పిచ్చి వాళ్లు చేసే పని అని, కొందరు పిచ్చి వాళ్లను పిలిచి చేతులు ఊపితే సరిపోదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాన్‌ను హెచ్చరించారు. -
23 జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 23 జిల్లాలకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది. ఆయా జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు... బొడ్డు సాయినాథ్‌రెడ్డి (గ్రేటర్ హైదరాబాద్), బెంబడి శ్రీనివాసరెడ్డి(మేడ్చల్-మల్కాజిగిరి), తుమ్మల పల్లి భాస్కరరావు (సూర్యాపేట), లక్కినేని సుధీర్ (ఖమ్మం), సంగాల ఇర్మియా (వరంగల్-అర్బన్), బొబ్బిలి సుధాకర్‌రెడ్డి (రంగారెడ్డి), మాదిరెడ్ది భగవంతురెడ్డి (నాగర్‌కర్నూల్), నీలం రమేశ్ (కామారెడ్డి), చొక్కాల రాము (రాజన్న-సిరిసిల్ల), బీస మరియమ్మ (మహబూబ్‌నగర్), గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి (సంగారెడ్డి), ఏనుగు రాజీవ్‌రెడ్డి (జగిత్యాల), వొడ్నాల సతీశ్ (మంచిర్యాల), బెజ్జంకి అనిల్‌కుమార్ (ఆదిలాబాద్), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), మద్దిరాల విష్ణువర్ధన్‌రెడ్డి (వనపర్తి),జమాల్పూర్ సుధాకర్(కుమ్రంభీం-ఆసిఫాబాద్),తడక జగదీశ్వర్ గుప్తా(సిద్దిపేట), సెగ్గెం రాజేశ్(పెద్దపల్లి), అప్పం కిషన్ (జయశంకర్- భూపాలపల్లి), కాందాడి అచ్చిరెడ్డి (మహబూబాబాద్), నాడం శాంతికుమార్ (వరంగల్-రూరల్), డా.కె.నగేశ్ (కరీంనగర్). కాగా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. సోమవారం ఈ మేరకు 23 జిల్లాల అధ్యక్షుల నియామకానికి సంబంధించి పార్టీ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది.