srikanth reddy mla
-
చంద్రబాబు హయాంలో వ్యవసాయరంగం నిర్వీర్యం అయిపోయింది : శ్రీకాంత్ రెడ్డి
-
చంద్రబాబు SCలను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నాడు
-
శవరాజకీయాలు చేయటం బాబుకు అలవాటు
-
టీడీపీ హయాంలో గ్లోబల్ టెండర్లతో అవినీతి
-
ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు
-
‘పుల్వామా ఉగ్రదాడి హేయమైన చర్య’
సాక్షి, వైఎస్సార్ : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్యని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న జవాన్లను యుద్ధ భూమిలో కాకుండా ఉగ్రదాడి చేయటం దుర్మార్గమన్నారు. పిరికితనంతో చేసిన దాడిలో, విధినిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
పెట్టుబడులు ఎంతో.. శ్వేతపత్రం విడుదల చేయాలి
వైఎస్సార్ జిల్లా : పార్టనర్ షిప్ సమ్మిట్లలో ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాధనం వెచ్చించి జరిపిన పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రచార ఆర్భాటమేనని వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అంటున్నారు..ఢిల్లీలోని డీఐపీపీలో నమోదైన రికార్డుల ప్రకారం ఏపీకి లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు కనబడటం లేదని ప్రశ్నించారు. సమ్మిట్ల పేరుతో విదేశాలు చక్కర్లు కొట్టి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తప్పుడు లెక్కలు చూపి కేంద్రాన్ని, ఏపీ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడి, దారుణమైన పరిస్తితి ఏర్పడిందని అన్నారు. ఊరు, పేరు లేని సంస్థలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయని చెబుతూ అబద్దాలు ఆడుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేశాయని, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుందని చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. నేడు సమ్మిట్ కోసం వందల, వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఒక్క పరిశ్రమ రాలేదని, అన్ని పెట్టుబడులు వస్తే నిరుద్యోగ సమస్య ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తప్పిదాల్ని ఎత్తిచూపితే, అది ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి, రాయలసీమను నిట్టనిలువునా ముంచారని మండిపడ్డారు. హైకోర్టు అడిగితే సుప్రీంకోర్టు, రాజధాని అడిగితే పార్లమెంటు నిర్మించుకోండంటూ కేబినేట్ మంత్రులు అవహేళన చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. మీ మంత్రులు, ఎంపీలు దేశ సమగ్రతను మరిచి దక్షిణ భారత దేశం వేరే దేశంగా విడిపోవాలంటూ మాట్లాడటం దేశాన్ని కించపరిచే విధానం కాదా? అని ప్రశ్నించారు. -
గణాంకాలు చెప్పి మభ్యపెట్టే యత్నం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గణాంకాలు చెప్పి సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిత్యానందరెడ్డికి శనివారం సాయంత్రం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ గణాంకాలు చెప్పడం గొప్పతనం కాదని, సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఓవైపు పదవిలో ఉంటూ ప్రజలకు నీతులు చెబుతారా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పులిబిడ్డలా రాజీనామా చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారన్నారు. గతంలో ఇందిరాగాంధీ విదేశీ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెప్పేవారని, కానీ తన కోడలే ఒక అరాచక శక్తి అని ఆమె గ్రహించలేకపోయిందన్నారు. సీమాంధ్రలోని కొందరు నాయకులకు మంత్రి పదవులు ఎరగా వేసి విభజన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. విభజన జరుగుతుందని తెలిసి కూడా మౌనంగాఉన్న నేతలను సమైక్య వాదులు నిలదీయాలని పిలుపునిచ్చారు. సీఎం, చంద్రబాబు రాజీనామా చేయాలి : రఘురామిరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించిఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. చేతగాని ముఖ్యమంత్రి, మంత్రులు రాయలసీమను ఎడారిగా చేయడానికే విభజన నిర్ణయం తీసుకుంటున్నా మౌనంగా ఉన్నారని విరుచుకుపడ్డారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ రాజీనామాలు చేయడం శుభపరిణామమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఏకమై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయని మండిపడ్డారు.నిత్యానందరెడ్డికి మద్దతు ప్రకటించిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రామకృష్ణ కళాశాల కరాస్పాండెంట్ కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.