Srikartik
-
అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
‘‘గతం తాలూకు ఆలోచనలతో మనం దిగాలుగా ఉంటే అది బాధ. భవిష్యత్ గురించి ఆలోచిçస్తుంటే అది ఆశ. కానీ ఆలోచనలతో ఈ వర్తమాన క్షణాలను ఆస్వాదించడం మనం మర్చిపోతున్నాం. అది గుర్తిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్. ఈ విషయాన్నే శ్రీ కార్తీక్ ‘ఒకే ఒక జీవితం’తో చెప్పాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అనేది ఒక భాగం మాత్రమే. నా పాత్ర, వెన్నెల కిశోర్, ప్రియదర్శి.. ఇలా ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతారు’’ అన్నారు శర్వానంద్. శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ‘‘ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో నటించాను. పదేళ్ల తర్వాత నేను చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమాతో నాకు శర్వానంద్ మూడో కొడుకు అయ్యారు (నవ్వుతూ). ఈ సినిమాలో ముగ్గురి జర్నీ చూస్తారు. ఈ ముగ్గురూ కాలంతో ఆడుకుని ఓ అంశాన్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు విధి మాత్రం మారదు. ఎందుకనేది థియేటర్స్‌లో చూడాలి’’ అన్నారు అమల. ‘‘నేను తెలుగువాడినే. మా అమ్మగారి మాతృభాష తెలుగు. ఇప్పుడు మా అమ్మగారు లేరు. మా అమ్మ గురించి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ‘అమ్మ’ పాట చిరకాలం నిలిచిపోతుంది’’ అన్నారు శ్రీ కార్తీక్. ‘‘మా బ్యానర్ నుంచి వచ్చిన ‘ఖాకీ’, ‘ఖైదీ’ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ నమ్మకంతోనే తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చేశాం’’ అన్నారు ఎస్ఆర్ ప్రభు. ‘‘అమలగారు నాకు స్ఫూర్తి’’ అన్నారు రీతూ వర్మ. -
సుజనా తనయుడి కార్ రేసింగ్
కార్ రేసింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన శ్రీకార్తీక్ ర్యాష్ డ్రైవింగ్‌తో ముచ్చటగా మూడోసారి... రూ.1000 జరిమానా, ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్: స్నేహితులతో పందెం కాసి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తనయుడు యలమంచిలి శ్రీకార్తీక్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ రహదారులపై శుక్ర వారం అర్ధరాత్రి శ్రీకార్తీక్ (25) తన స్నేహితులతో కలసి ఖరీదైన స్పోర్ట్స్ కారులో రేసింగ్‌కు పాల్పడి పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రేస్‌లు జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా వరకు ప్రత్యేక బలగాలను, పికెట్లను ఏర్పాటు చేశారు. ఒంటిగంట సమయంలో శ్రీకార్తీక్ తన పోర్షే స్పోర్ట్స్ కారు(ఏపీ 09 సీవీ 9699)లో కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా వైపు అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చాడు. చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను చూసి యూటర్న్ తీసుకుని తిరిగి ఎన్టీఆర్ ట్రస్ట్భవన్వైపు అంతే స్పీడ్‌తో దూసుకెళ్లాడు. అయితే కేబీఆర్ పార్కు చౌరస్తాలో మరో స్పెషల్ డ్రైవ్ బృందానికి పట్టుబడ్డాడు. శ్రీకార్తీక్పై ర్యాష్ డ్రైవింగ్ కేసులో మోటారు వాహనాల చట్టం 184(బి), ఓవర్ స్పీడ్ చట్టం 183 కింద, నంబర్‌ప్లేట్ అడ్డదిడ్డంగా ఉన్నందుకు సెక్షన్ 80(ఏ) కింద కేసులు నమోదు చేశారు. పారిపోవడానికి యత్నం.. ఓవర్‌స్పీడ్ కేసులో రూ. 1000 జరిమానా విధించి చలానా అందజేశారు. పోలీసులు పట్టుకున్న సమయంలో శ్రీకార్తీక్ మరోసారి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించారు. శ్రీకార్తీక్పై కేసు నమోదు చేసి జరిమానా విధించిన పోలీసులు బేగంపేటలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిందిగా సూచించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. మరోసారి పట్టుబడితే ఐపీసీ సెక్షన్‌తో పాటు రిమాండ్‌కు తరలించాల్సి ఉంటుందని.. డ్రైవింగ్ లెసైన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని వెస్ట్‌జోన్ ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్చౌహాన్ వెల్లడించారు. కాగా శ్రీకార్తీక్ పెళ్లి రెండు రోజుల్లో జరుగనుంది. శనివారం ఆయనను పెళ్లి కొడుకును చేసేందుకు ఏర్పాటు కూడా చేశారు.