Srinivasa Yadav talasani
-
సంక్షేమ పథకాల్లో రాష్ట్రం అగ్రగామి
► అన్ని కులాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం ► లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుతో తాగునీటి సమస్యకు చెక్ ► కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం ► మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కేశంపేట(షాద్‌నగర్): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని అల్వాల గ్రామంలో బీరప్ప ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ముందుగా గ్రామంలోని ముఖ్యకూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అభివృద్ధి పథకాల అమల్లో రాష్ట్రం అగ్రాగామిగా ఉందన్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తయితే తాగునీటి సమస్య తీరి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని 18 సంవత్సరాలు నిండిన గొల్ల,కురుమలు సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి 75శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఒక్కొక్కరికి 20 గొర్రెలను, ఒక పొట్టేలును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్రంలోని అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకొన్న కేసీఆర్ ముఖ్య మంత్రిగా ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. అన్ని కులవృత్తులు అభివృద్ధి చెందేలా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కా ర్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మార్కెట్‌కమిటీ చైర్మెన్ లిం గారం యాదమ్మ, వైస్ చైర్మెన్ వెంకట్‌రెడ్డి, సర్పంచి విజయేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్‌గౌడ్, లక్ష్మీనారాయణ , రాంబల్ నాయక్, జమాల్‌ఖాన్, నారాయణరెడ్డి, వేణుగోపాలాచా రి, యాదగిరి రావు, కొత్తూరు, కొందూ రు టీఆర్ఎస్ నాయకులు,పాల్గొన్నారు. -
ప్రచారం కోసమే బీజేపీ రాద్ధాంతం
► అసెంబ్లీలో మంత్రి తలసాని విమర్శ ► బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్న ఆర్.కృష్ణయ్య ► తక్షణమే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఇవ్వాలి: జీవన్‌రెడ్డి ► వాల్మీకి, కాగిత లంబాడాలను మినహాయించాలి: రాజయ్య సాక్షి, హైదరాబాద్: ప్రచారం కోసమే బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై రాద్ధాం తం చేస్తుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. అసెంబ్లీలో ఆదివారం ఆయన మాట్లాడుతూ మతపరంగా దేశంలో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటే వచ్చేసారి బీజేపీ అసెంబ్లీకి వచ్చే పరిస్థితే ఉండదని ఆపార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ముస్లిం, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుపై టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఆ వర్గాలకు రిజర్వేషన్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వాల్మీకి, రజకులు, వడ్డెరలను ఎస్టీలో కలపాలన్న డిమాండ్ ఉందన్నారు. ముస్లింల కోసం బీసీ (ఇ) రిజర్వేషన్లు పెంచినప్పుడు మిగిలిన ఏబీసీడీ వర్గాల వారు అసంతృప్తికి గురవుతా రన్నారు. బీసీలకు 25 శాతం నుంచి 52 శాతం రిజర్వేషన్లు పెంచాలన్నారు. కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీలకు 14 నుంచి 15 శాతం, ఎస్టీలకు 4 నుంచి 6 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీచేశారన్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలా చేసుకోవచ్చన్నారు. కాబట్టి ప్రస్తుత బిల్లులో పేర్కొన్న ఎస్టీల రిజర్వేషన్లకు జీవో జారీచేసి వెంటనే అమలు చేయాలన్నారు. ఎస్సీలకు ఒక శాతం పెంచుతూ జీవో జారీచేయాలన్నారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచడాన్ని స్వాగతిస్తున్నట్లు సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య పేర్కొన్నారు. వాల్మీకి, కాగిత లంబాడీలను ఇందులో చేర్చకూడదన్నారు. -
ఎల్లమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
సనత్‌నగర్‌లో ఎల్లమ్మ తల్లి ఆలయంలో కల్యాణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దైవ దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు. -
నీ ముఖం ఓసారి అద్దంలో చూసుకో!
-
బాబూ.. నీ ముఖం ఓసారి అద్దంలో చూసుకో!
విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలు నీవు కట్టింది హైటెక్ సిటీని.. హైదరాబాద్‌ను కాదు సంపద ఏపీలో సృష్టించుకో.. పట్టిసీమలో అయ్యా, కొడుకు ఎంత కొట్టేశారో తెలుసు హైదరాబాద్: ‘‘సంపదను సృష్టించాను. దాన్ని కేసీఆర్ బాగా చూసుకోవాలి’’ అని మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని ఘాటుగా స్పందించారు. హైటెక్‌సిటీని కట్టి హైదరాబాద్ అభివృద్ధి అంతా తన ఘనతే అని చెబుతున్న చంద్రబాబు తన ముఖాన్ని ఓసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మహానగర చరిత్ర 400 ఏళ్ల పైమాటే అని, అది తెలుసుకుని మాట్లాడాలన్నారు. దిక్కూ మొక్కు లేని ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించుకుంటే బాగుంటుందని తలసాని చంద్రబాబుకు సూచించారు. అయ్యా.. కొడుకు పట్టిసీమలో ఎంత కొట్టేశారో తనకు తెలుసని, ఒక్క రోజు యోగా కోసం రూ. కోటి 25 లక్షలు ప్రభుత్వ నిధులను విడుదల చేస్తే ఎవరూ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ట్విట్టర్ పిట్టీ మహానాడులో మాట్లాడుతుంటే కరెంటు పోయిందంట... ఇదీ ఇక్కడి పరిస్థితి అని అంటున్నాడు... ఇంట్లో ఎలా పడుకుంటున్నాడో’’అంటూ లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. రెండు గదుల బెడ్రూంలు ఐడీహెచ్ కాలనీలో తయారవుతున్నాయని వెల్లడించారు. అంతకు ముందు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సచివాలయంలో విలేకరులతో తలసాని మాట్లాడుతూ జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని 50 ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జేఏసీతో పాటు, ఓయూ విద్యార్థులను, అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలుపుకొని ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు.