Srinu White
-
బ్రూస్లీ
పదునైన చూపుతో... చేతి మీద బ్రూస్లీ టాటూతో... తాను వేట మొద లుపెడితే రీసౌండ్స్ మాత్రమే ఉంటాయని ‘బ్రూస్లీ - ది ఫైటర్’ టీజర్లో చెప్పేశారు రామ్‌చరణ్. శ్రీను వైట్ల మార్క్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న స్పెషల్ రోల్. స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్న రామ్‌చరణ్‌కు ఇది తొమ్మిదో సినిమా. మెగాస్టార్ చిరంజీవికి అనుకోకుండా ఇది150వ సినిమా కావడం విశేషం. చాలా కాలం తర్వాత చిరంజీవి కాసేపు తెరపై తళుక్కుమన్న సన్నివేశాలను చూసి, ఆనందించాలనే ఆసక్తితో ఆయన అభిమానులు ఉన్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ‘ఐ ఫీస్ట్’ అని చిత్ర దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలను అక్టోబర్ 2న, చిత్రాన్ని అదే నెల 16వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. -
మెరుపు వేగంతో...
రామ్‌చరణ్‌తో శ్రీను వైట్ల తీస్తున్న సినిమా మెరుపు వేగంతో సిద్ధమవుతోంది. ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో చిరంజీవి చేయనున్న అతిథి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను త్వరలో చిత్రీకరించనున్నారు. ‘‘రామ్‌చరణ్ పాత్ర చాలా జోష్‌గా ఉంటుంది. చిరంజీవిగారితో చేయబోయే షూటింగ్ కోసం మేమంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని శ్రీను వైట్ల అన్నారు. ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: కోన వెంకట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.వై.ప్రవీణ్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్: కృష్ణ, సమర్పణ: డి. పార్వతి. -
అయ్యో! 150లో చిరు పాత్రే!
నిజమనుకునేరు? ఏదో కొడుకు మీద ఉన్న వాత్సల్యంతో... చెర్రీ (రామ్‌చరణ్)... వెరీ హ్యాపీగా వుండాలని... వెరీ వెరీ బిగ్హార్ట్తో ఆయన సినిమాలో చిరు పాత్ర వేయనున్నారు లవింగ్ డాడీ చిరంజీవి. ఈ మెగాస్టార్ వెండితెరపై కనిపించి దాదాపు ఐదేళ్లయ్యింది. అది కూడా ‘మగధీర’లో అలా కనిపించి, ఇలా మాయమ య్యారు. అలా కాసేపే కనిపించినా, అభిమానులు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇప్పుడు మళ్లీ రామ్‌చరణ్ కోసం చిరంజీవి అతిథి పాత్ర అంగీకరించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనే చిరంజీవి ఓ స్పెషల్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఆ వరుసలో చూసుకుంటే, ఇదే చిరంజీవిరి 150వ చిత్రం అవుతుంది. సో.. ఆయన కథానాయకునిగా నటించనున్న సినిమా 151 అన్న మాట. చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారన్నమాట. ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. -
రామ్‌చరణ్ సరసన ఇలియానా?
లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్... ఇలా సినిమాలో అన్ని ఐటమ్స్‌తో పాటు ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటే కెవ్వు కేక అంటారు ప్రేక్షకులు. పైగా, ఆ ఐటమ్ సాంగ్‌కి స్టార్ హీరోయిన్లు కాలు కదిపితే ఆ కిక్కే వేరు. తాము డ్యాన్స్ చేస్తే ఆ కిక్ ఉంటుందని నాయికలకు తెలుసు కాబట్టే, భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. దక్షిణాది తారల్లో ఒకే ఒక్క ఐటమ్ సాంగ్‌కి 50లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకున్న తారలు ఉన్నారు. ఇప్పుడు ఇలియానా ‘కోటి’ జాబితాలో ఉన్నారట. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. ఈ పాటకు ఇలియానాని తీసుకోవాలనుకున్నారట. ఈ గోవా బ్యూటీకి ఐటమ్ సాంగ్స్ చేయడం గురించి పెద్దగా అభ్యంతరం లేకపోయినా పారితోషికం విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉన్నారట. ఒక్క పాట కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారని భోగట్టా. 40 లక్షలు ఇవ్వడానికి చిత్రనిర్మాత డీవీవీ దానయ్య సుముఖంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం పారితోషికం విషయంలో నిర్మాతకు, ఇలియానా మధ్య చర్చలు జరుగుతున్నాయట. మరి.. ఆ చర్చల ఫలితం ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే తెలుగులో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత ఇలియానా ఇక్కడ వేరే సినిమాలు చేయలేదు. ‘బర్ఫీ’ చిత్రం ద్వారా హిందీ రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం ఈ గోవా బ్యూటీకి మంచి పేరు తెచ్చింది. దాంతో అక్కడ బాగానే అవకాశాలు వచ్చాయి. ‘బర్ఫీ’ తర్వాత ‘హ్యాపీ ఎండింగ్’, ‘మై తేరా హీరో’ చిత్రాల్లో నటించారామె. ఇప్పుడు మళ్లీ దక్షిణాది చిత్రాల్లో నటించాలనుకుంటున్నారట. అందుకని, పారితోషికం విషయంలో పట్టువిడుపుగా వ్యవహరించి, చరణ్‌తో ఐటమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.