బ్రూస్‌లీ
పదునైన చూపుతో... చేతి మీద బ్రూస్‌లీ టాటూతో... తాను వేట మొద లుపెడితే రీసౌండ్స్ మాత్రమే ఉంటాయని ‘బ్రూస్‌లీ - ది ఫైటర్’ టీజర్‌లో చెప్పేశారు రామ్‌చరణ్. శ్రీను వైట్ల మార్క్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న స్పెషల్ రోల్. స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్న రామ్‌చరణ్‌కు ఇది తొమ్మిదో సినిమా. మెగాస్టార్ చిరంజీవికి అనుకోకుండా ఇది150వ సినిమా కావడం విశేషం. చాలా కాలం తర్వాత చిరంజీవి కాసేపు తెరపై తళుక్కుమన్న సన్నివేశాలను చూసి, ఆనందించాలనే ఆసక్తితో ఆయన అభిమానులు ఉన్నారు.
ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ‘ఐ ఫీస్ట్’ అని చిత్ర దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలను అక్టోబర్ 2న, చిత్రాన్ని అదే నెల 16వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.