
అయ్యో! 150లో చిరు పాత్రే!
నిజమనుకునేరు? ఏదో కొడుకు మీద ఉన్న వాత్సల్యంతో... చెర్రీ (రామ్‌చరణ్)... వెరీ హ్యాపీగా వుండాలని... వెరీ వెరీ బిగ్‌హార్ట్‌తో ఆయన సినిమాలో చిరు పాత్ర వేయనున్నారు లవింగ్ డాడీ చిరంజీవి. ఈ మెగాస్టార్ వెండితెరపై కనిపించి దాదాపు ఐదేళ్లయ్యింది. అది కూడా ‘మగధీర’లో అలా కనిపించి, ఇలా మాయమ య్యారు.
అలా కాసేపే కనిపించినా, అభిమానులు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇప్పుడు మళ్లీ రామ్‌చరణ్ కోసం చిరంజీవి అతిథి పాత్ర అంగీకరించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనే చిరంజీవి ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
ఆ వరుసలో చూసుకుంటే, ఇదే చిరంజీవిరి 150వ చిత్రం అవుతుంది. సో.. ఆయన కథానాయకునిగా నటించనున్న సినిమా 151 అన్న మాట. చిత్రం కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారన్నమాట. ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.