Sripriyanka
-
మహిళా పోలీసులకే మిగమిగ అవసరం
తమిళసినిమా: మిగమిగ అవసరం చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి తెలిపారు. ఇంతకు ముందు అమెదిపడై 2, కంగారు చిత్రాలను నిర్మించిన సురేశ్ కామాక్షి మూడవ చిత్రానికి తానే దర్శకుడిగా అవతారమెత్తారు. ఆయన స్వీయ నిర్మిస్తున్న చిత్రానికి మిగ మిగ అవసరం అని పేరు నిర్ణయించారు. శ్రీప్రియాంక నాయకిగా సెంట్రిక్ పాత్రను పోషిస్తున్న ఇందులో హరీశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో దర్శకుడు సీమాన్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో లళక్కు ఎన్ ముత్తరామన్, సేతుపతి లింగ, పరంజ్యోతి, దర్శకుడు సరవణ శక్తి నటిస్తున్నారు. దర్శకుడు జగన్ కథ, కథనాన్ని అందించిన ఈ చిత్రాన్ని సురేశ్ కామాక్ష్మి స్వీయ దర్శకత్వంలో తన వి.హౌస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మిగ మిగ అవసరం చిత్రంలో మహిళా పోలీసుల మనోధైర్యాన్ని, మానవత్వాన్ని, వాటితో పాటు వాళ్ల సమస్యలను అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన ట్లు తెలిపారు. అందువల్ల ఈ చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అజిత్, విజయ్‌ల మధ్య చిచ్చు
నటుడు అజిత్, విజయ్‌ల మధ్య వృత్తిపరంగా పోటీ ఉన్న మాట నిజమే అయినా వ్యక్తిగతంగా వాళ్లిద్దరూ మంచి స్నేహితులే. అయితే వీరి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ అంశాన్ని దర్శకుడు తన చిత్రంలో వాడుకున్నారు. సింధు సమవెళి, మృగం లాంటి చర్చనీయాంశ కథాచిత్రాలను తెరకెక్కించిన ఈయన కొంచెం గ్యాప్ తరువాత దర్శకత్వం వహించిన చిత్రం కంగారు. వి హౌస్ ప్రొడక్షన్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవ నటుడు అర్జున్ హీరోగాను, ఆయనకు చెల్లెలిగా శ్రీప్రియాంక ప్రేయసిగా వర్ష అశ్వత్ నటించారు. తంబిరామయ్య, కళాభవన్ మణి, గంజాకరుప్పు, దర్శకుడు ఆర్.సుందర్ రాజన్, జగన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని దర్శకుడు సామి చిత్రీకరించారు. దీని గురించి ఆయన తెలుపుతూ చిత్రంలో నటి శ్రీప్రియాంక అజిత్‌కు, నటి వర్ష అశ్వత్ విజయ్‌కు తీవ్ర అభిమానులన్నారు. వీరిద్దరూ నా హీరో గొప్ప అంటే నా హీరో గొప్ప అంటూ పోట్లాడుకుంటూ పెద్ద రణరంగమే సృష్టిస్తారని చివరికి శ్రీప్రియాంక అజిత్ అభిమానిని పెళ్లి చేసుకుంటుందని తెలిపారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని ఏప్రిల్‌లో చిత్రాన్ని 150 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.