'శ్రీరస్తు..శుభమస్తు' పై బన్నీ ఏమన్నాడంటే
అల్లు శిరీష్ హీరోగా వస్తున్న తాజా చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ ప్రధాన చిత్రాల్లో విజయాలు సాదిస్తున్న పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రెయిలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ , తమ్ముడు హీరో అల్లు శిరీష్, హీరోయిన్ లావణ్య చిత్ర ఇంకా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్ చేశాడు. దీంతో పాటుగా ఈ ట్రెయిలర్ ను కూడా షేర్ చేశాడు.
మెగా ఫ్యామిలీ నుంచి బన్నీ సోదరుడు అల్లు శిరీష్ ఎలాగైనా హిట్టు కొట్టాలన్న ధ్యేయంతో శ్రీరస్తు శుభమస్తుతో ఆగస్ట్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా శ్రీరస్తు శుభమస్తు థియేట్రికల్ ట్రెయిలర్ విడుదలైంది. ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రెయిలర్ ఈ టీజర్ ఓ లుక్కేయండి.
కాగా అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. గత టీజర్ ఫ్యాన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, సుమలత, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
All the Best Dad , @AlluSirish @Itslavanya , Dir & the whole team of SS
— Allu Arjun (@alluarjun) July 26, 2016