srisailam highway
-
కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత
అచ్చంపేట/ఉప్పునుంతల: హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై పిరట్వాన్‌పల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం ఉదయం 8 గంటలకు మృతుల కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, కార్తీక్ అలియాస్ సంపత్ కుటుంబసభ్యులకు సమాచారం అలస్యంగా చేరడంతో వారు ఉదయం 11.45 గంటలకు వచ్చారు. ఇతని పేరు, అడ్రస్ సరిగా లేకపోవడంతో గుర్తించడంలో జాప్యం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి, అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ క్షతగాత్రుడు నరేశ్ తనతో పాటు వచ్చిన స్నేహితులు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ప్రమాదంపై నరేశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ అజ్మీర రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటన దురదృష్టకరం: ఎంపీ రాములు రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం దురదృష్టకరమని నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు అన్నారు. ఆయన అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీశైలం హైవేపై ట్రామా సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించగా.. సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గడ్కారీ హామీ ఇచ్చారని తెలిపారు. కాగా, సకాలంలో వైద్యులు ఆస్పత్రికి రాకపోవడంతో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శ్రీశైలంలో చిరుతల సంచారం
శ్రీశైలం: శ్రీశైలం క్షేత్ర పరిధిలోని సాక్షిగణపతి, హఠకేశ్వరం రోడ్డు మార్గంలో రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో దేవస్థానం మైకుల ద్వారా స్థానికులకు తగు జాగ్రత్తలు సూచిస్తున్నారు. లాక్డౌన్ వల్ల శ్రీశైలానికి ఎలాంటి రాకపోకలూ లేవు. సున్నిపెంట– శ్రీశైలం మధ్య కూడా రాకపోకలపై నిషేధం ఉంది. అయితే.. సాక్షి గణపతి, హఠకేశ్వరం, చెక్‌పోస్ట్ తదితర ప్రదేశాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది శనివారం రాత్రి చిరుతల సంచారం గురించి తెలియజేశారు. దీంతో దేవస్థానం అధికారులు మైకుల ద్వారా స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవిలో చిరుతలతో పాటు ఇతర వన్యప్రాణులు నీటి కోసం రహదారులను దాటుకుని వెళ్తుంటాయి. లాక్డౌన్ సందర్భంగా వాహన రాకపోకలు, జనసంచారం లేకపోవడంతో చిరుతలు, జింకలు, అడవి పందులు వంటి వన్యప్రాణులు ఘాట్‌రోడ్లపై కనిపిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. -
శ్రీశైలం హైవేపై రోడ్డు ప్రమాదం
-
విగ్రహాలు తొలగించాలంటూ ఆందోళన
కందుకూరు: కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై రాకపోకలకు అడ్డుగా ఉన్న అన్ని విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వ్యాపార సంఘం ఆధ్వర్యంలో షాపులను మూసేసి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల సర్వసభ్య సమావేశం కొనసాగుతున్న హాల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రహదారిపై ఉన్న విగ్రహాలతో రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, దీంతో డ్రైనేజీ నిర్మాణం లేక మురుగు నీటితో పాటు వర్షం నీరు వెళ్లడం లేదని చెప్పారు. దీంతోపాటు తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రహదారులపై విగ్రహాలు తొలగించాలని స్పష్టంగా ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అన్ని విగ్రహాలను వదిలేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళనకారులతో తహసీల్దార్ సుశీల, సీఐ విజయ్‌కుమార్ మాట్లాడారు. నెల రోజుల్లో విగ్రహాలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నీటి కోసం జల్పల్లి వాసుల నిరసన
జల్పల్లిలో తీవ్రమైన మంచినీటి ఎద్దడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం షాహిన్‌నగర్ వద్ద శ్రీశైలం రహదారిపై రాస్తారోకోకు దిగారు. మంచినీటి సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల తీగల కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ సాబెర్ అలీకి తమ ఇబ్బందులను విన్నవించినా స్పందన కరువైందని ఆరోపించారు. పోలీసులు నచ్చజెప్పినా వారు వినలేదు. ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంకటాపూర్ మీదుగా వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. నిరసన ఇంకా కొనసాగుతోంది. -
కారు, ఆర్టీసీ బస్సు ఢీ..చిన్నారి మృతి
రంగారెడ్డి(మహేశ్వరం): మహేశ్వరం గేటు వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, స్విఫ్ట్ కారు ఢీకొన్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో స్విఫ్ట్‌కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతిచెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా హైదరాబాద్ నగరవాసులని సమాచారం.