నీటి కోసం జల్‌పల్లి వాసుల నిరసన | Jalpalli residents protest for water | Sakshi
Sakshi News home page

నీటి కోసం జల్‌పల్లి వాసుల నిరసన

Published Sun, Jul 17 2016 3:14 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

Jalpalli residents protest for water

జల్‌పల్లిలో తీవ్రమైన మంచినీటి ఎద్దడిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం షాహిన్‌నగర్ వద్ద శ్రీశైలం రహదారిపై రాస్తారోకోకు దిగారు. మంచినీటి సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల తీగల కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహ్మద్ సాబెర్ అలీకి తమ ఇబ్బందులను విన్నవించినా స్పందన కరువైందని ఆరోపించారు. పోలీసులు నచ్చజెప్పినా వారు వినలేదు. ఆందోళన కారణంగా ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వెంకటాపూర్ మీదుగా వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. నిరసన ఇంకా కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement