SSC girl
-
అస్సాంలో బాలికపై సామూహిక అత్యాచారం
గౌహతి: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో దారుణం జరిగింది. నాగావ్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మహిళలకు రక్షణ కలి్పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని, మహిళలకు రక్షణ కలి్పస్తామని హామీ ఇచ్చారు. నాగావ్ జిల్లాలోని ధింగ్ ప్రాంతంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ వచి్చ, ఆమెను బంధించి అత్యాచారానికి పాల్పడి, రోడ్డు పక్కన విసిరేసి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలు పదో తరగతి చదువుతోందని, దుండగుల దుశ్చర్య వల్ల గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుందని తెలిపారు. స్థానికులు గమనించి, తమకు సమాచారం ఇచ్చారని వెల్లడించారు. బాధితురాలిని అసుపత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, పరారీలో ఉన్న మరొకడి కోసం గాలింపు ముమ్మరం చేశామని అస్సాం డీజీపీ జి.పి.సింగ్ చెప్పారు. ముష్కరుల ఆగడాలను అడ్డుకుంటాం బాలికపై అత్యాచారం గురించి తెలియగానే శుక్రవారం అస్సాం అట్టుడికిపోయింది. జనం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని మండిçపడ్డారు. బాధితురాలికి న్యాయం చేయాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. మైనర్ బాలికపై అత్యాచార ఘటన ఘటన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అస్సాంలో ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా రెచి్చపోతున్నారని, వారి ఆగడాలను కచి్చతంగా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో గత రెండు నెలల్లో 23 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనసాగుతున్న వలసల వల్ల స్థానికులు మైనార్టీలుగా మారిపోతున్నారని చెప్పారు. -
ప్రేమికుల రోజు.. పెళ్లికి నిరాకరించారని
చేవెళ్ల: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించారని ఓ యువతి ఇంట్లోని బాత్రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోకిలతండాలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. మోకిలతండాకు చెందిన జెత్యానాయక్ కూతురు అనూష(19)10వ తరగతి వరకు చదువుకుంది. జెత్యానాయక్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అనూష ఇటీవల నర్సు కోర్సుకోసం బెంగుళూరు వెళ్లి ఈనెల 5న వస్తానని చెప్పి వెళ్లింది. అప్పటి నుంచి ఫోన్ చేయకపోవడంతో తల్లిదండ్రులు ఈనెల 6న తమ కూతరు కనిపించటం లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతిని ట్రేస్ చేసి శనివారం ఇంటికి రప్పించారు. తను ఒక వ్యక్తిని ప్రేమించానని చెప్పడంతో పోలీసులు అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో ఇంటికి పంపించారు. శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లిన యువతి తాను ఒక వ్యక్తిని ప్రేమించానని అతన్నేపెళ్లిచేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. ఇందుకు వారు వద్దని వారించారు. దీంతో ఆదివారం ఉదయం స్నానానికి వెళ్లిన యువతి బాత్రూమ్లో చున్నీతో ఉరేసుకుంది. స్నానానికి వెళ్లిన అనూష ఎంతకు రాకపోవడంతో తల్లిదండ్రులు బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దార్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: నికితాపై నాన్‌బెయిలబుల్ వారెంట్ చదవండి: దోశ పిండి నీలాగే ఉందనడంతో -
బాలికపై అత్యాచారయత్నం
హైదరాబాద్: నగరంలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ప్రబుద్దుడు. ప్రేమ పేరుతో మభ్యపెట్టి బాలిక ను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. దీనికి సంబంధించి సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి వివరాలను సనత్ నగర్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.