st category
-
Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్
కేరళలో కేవలం పదిహేను వేల మంది ఉండే గిరిజనులు ‘కరింపలనులు’. పోడు వ్యవసాయం, కట్టెబొగ్గు చేసి అమ్మడం వీరి వృత్తి. అలాంటి సమూహం నుంచి ఒకమ్మాయి ‘ఎయిర్‌హోస్టెస్’ కావాలనే కల కంది. కేరళలో అప్పటి వరకూ గిరిజనులు ఎవరూ ఇలాంటి కలను కనలేదు. 12 ఏళ్ల వయసులో కలకంటే 24 ఏళ్ల వయసులో నిజమైంది. పరిచయం చేసుకోండి కేరళ తొలి గిరిజన ఎయిర్‌హోస్టెస్‌ని. కేరళలోని కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ‘కరింపలనులు’. వీళ్లు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాషను మాట్లాడతారు. అటవీ భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. లేదంటే అడవిలోని పుల్లల్ని కాల్చి బొగ్గు చేసి అమ్ముతారు. గోపికా గోవింద్ ఇలాంటి సమూహంలో పుట్టింది. అయితే ఈ గిరిజనులకు ఇప్పుడు వ్యవసాయం కోసం అటవీభూమి దొరకడం లేదు. కట్టెలు కాల్చడాన్ని ఫారెస్టు వాళ్లు అడ్డుకుంటూ ఉండటంతో బొగ్గు అమ్మకం కూడా పోయింది. చిన్నప్పుడు అమ్మా నాన్న చేసే ఈ పని చూస్తూ పెరిగిన గోపికా ఇక్కడతో ఆగడమా... అంబరాన్ని తాకడమా అంటే అంబరాన్ని తాకడమే తన లక్ష్యం అని అనుకుంది. డిగ్రీ తర్వాత బిఎస్సీ చదివిన గోపిక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ కావాలంటే అవసరమైన కోర్సు గురించి వాకబు చేసింది. ప్రయివేటు కాలేజీలలో దాని విలువ లక్షల్లో ఉంది. కూలి పని చేసే తల్లిదండ్రులు ఆ డబ్బు కట్టలేరు. అందుకని ఎం.ఎస్సీ కెమిస్ట్రీ చేరింది. చదువుతున్నదన్న మాటేకాని ఎయిర్ హోస్టెస్ కావడం ఎలా... అని ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఐ.ఏ.టి.ఏ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) వాళ్ల కస్టమర్ సర్వీస్ కోర్సును గవర్నమెంట్ స్కాలర్షిప్ ద్వారా చదవొచ్చని తెలుసుకుంది. ఎస్.టి విద్యార్థులకు ఆ స్కాలర్షిప్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. అప్లై చేసింది. స్కాలర్షిప్ మంజూరు అయ్యింది. గోపిక రెక్కలు ఇక ముడుచుకు ఉండిపోలేదు. లక్ష రూపాయల కోర్సు వాయనాడ్‌లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్సును స్కాలర్షిప్ ద్వారా చేరింది గోపిక. చదువు, బస, భోజనం మొత్తం కలిపి లక్ష రూపాయలను ప్రభుత్వమే కట్టింది. మలయాళ మీడియం లో చదువుకున్న గోపిక ఎయిర్ హోస్టెస్‌కు అవసరమైన హిందీ, ఇంగ్లిష్‌లలో కూడా తర్ఫీదు అయ్యింది. కోర్సు పూర్తి చేసింది. ఒకసారి ఇంటర్వ్యూకు వెళితే సెలెక్ట్ కాలేదు. రెండోసారి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్‌గా ఎంపికయ్యింది. విమానం ఎప్పుడూ ఎక్కని గోపిక విమానంలోనే ఇక పై రోజూ చేసే ఉద్యోగం కోసం తిరువనంతపురం నుంచి ముంబైకి ట్రైనింగ్ కోసం వెళ్లింది. అక్టోబర్‌లో ఆమె కూడా యూనిఫామ్ వేసుకుని విమానంలో మనకు తారస పడొచ్చు. ఆమె కలను ఆమె నెరవేర్చుకుంది. ఇక మీ వంతు. 8వ క్లాసు కల గిరిజనులు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూస్తారు తప్ప ఎక్కలేరు. గోపికా గోవింద్ కూడా చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని ఉత్సాహంగా, వింతగా చూసేది. అందులో ఎక్కడం గురించి ఆలోచించేది. 8వ క్లాసుకు వచ్చినప్పుడు ఒక పేపర్లో ఎర్రటి స్కర్టు, తెల్లటి షర్టు వేసుకున్న ఒక చక్కటి అమ్మాయి గోపికా కంట పడింది. ఎవరా అమ్మాయి అని చూస్తే ‘ఎయిర్ హోస్టస్’ అని తెలిసింది. విమానంలో ఎగురుతూ విధి నిర్వహణ. ఇదేకదా తనకు కావాల్సింది అనుకుంది. కాని ఎవరికైనా చెప్తే నవ్వుతారు. బొగ్గులమ్ముకునే వాళ్ల అమ్మాయికి ఎంత పెద్ద కల అనుకుంటారు. అందుకని సిగ్గుపడింది. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. కాని కల నెరవేర్చుకోవాలన్న కలను మాత్రం రోజురోజుకు ఆశ పోసి పెంచి పెద్ద చేసుకుంది. -
మాలీలను ఎస్టీ జాబితాలో వెంటనే చేర్చాలి
సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్): మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి విస్మరించారని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే తెలిపారు. మాలీలను ఎస్టీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న మహాపాదయాత్ర సోమవారం వాంకిడికి చేరుకుంది. ఈ సందర్భంగా వాంకిడి మండల కేంద్రంలోని జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాగానే మాలీలను ఎస్టీలో కలిపే బిల్లుపై తొలి సంతకం పెడతామని సీఎం కేసీఆర్ 2009లో కాగజ్‌నగర్‌లో జరిగిన ఉద్యమ సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక చెల్లప్ప కమిషన్ ద్వారా సర్వే చేయించేందుకు జాప్యం ప్రదర్శిస్తూ ద్వంద వైఖరీని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. మాలీల పట్ల చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. మాలీల బలనిరూపణకు బెజ్జూర్ నుంచి జైనూర్ వరకూ దాదాపు 150 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా మాలీల స్థితిగతులపై చెల్లప్ప కమిషన్ ద్వారా సర్వే చేయించి కేంద్రానికి రిపోర్ట్ పంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ పాదయాత్రలో మాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాలీలకు ఎస్టీ హోదా కల్పన కమిటీ వ్యవస్థాపకుడు నారాయణ వాడై, జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్, డివిజన్ అధ్యక్షుడు మెంగాజీ, మండల అధ్యక్షుడు నారాయణ, తదితరులు పాల్గొన్నారు. 11న మాలీల మహాసభ.. జైనూర్(ఆసిఫాబాద్): ఈనెల 11న జైనూర్‌లో నిర్వహించే మాలీల మహాసభను విజయవంతం చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే కోరారు. జైనూర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న బెజ్జూర్ నుంచి జైనూర్ వరకూ మహాపాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. మహాసభలో మాలీల సమస్యలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా నుంచి మాలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, నాగోసే, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నందకుమార లేండుగురే, జైనూర్ మండల అధ్యక్షుడు హుస్సేన్ పేట్కులే, నాయకులు జేంగటే రాందాస్, వాటగురే హరి, దీపక్, శివాజీ, నానేశ్వర్ తదితరులున్నారు. -
ర్యాంకుల గిరిపుత్రుడు
జన్నారం (ఖానాపూర్): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పరీక్షల్లో ర్యాంకులు పొంది పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఈ గిరిపుత్రుడు. నీట్లో ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించిన ఇతను ఇప్పుడు జిప్మర్లో ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు ౖకైవసం చేసుకుని తన సత్తా చాటాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం రూప్‌నాయక్ తండాకు చెందిన లావుడ్యా హరిరాం, హారిక దంపతుల కుమారుడు హర్షవర్దన్. శుక్రవారం విడుదలైన జిప్మర్ ‡(జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) ప్రవేశ పరీక్షలో ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సాధించాడు. చురుకైన విద్యార్థి హర్షవర్దన్ మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి. పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధిం చాడు. ఇటీవల కేవీపీవై (కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన) 2018 పరీక్షలో అఖిల భారత స్థాయి లో 35వ ర్యాంకు సాధించాడు. హర్షవర్దన్ అక్క హరిప్రియ జైపూర్ నిట్ (జాతీయ విజ్ఞాన సంస్థ)లో ఈసీఈ బ్రాంచిలో ఇంజనీరింగ్ కోర్సు చేస్తూ ఎయిర్‌పోర్టు అథారిటీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. తండ్రి స్ఫూర్తితో క్రీడల్లోనూ.. హర్షవర్దన్ క్రీడల్లోనూ మంచి ప్రావీణ్యం కనబరుస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. తండ్రి లావుడ్యా హరిరాం గురుకుల కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన పీహెచ్డీ చేస్తున్నారు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువుల్లో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రుడు హర్షవర్దన్ ఇటీవలే ఎయిమ్స్ ఎంట్రన్స్ కూడా రాశాడు. అందులోనూ మంచి ర్యాంకు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. -
గిరిపుత్రికకు గ్రూప్–1 కిరీటం
అనంతపురం టౌన్:నాన్న కష్టం.. అమ్మ ఆరాటం.. చదువుతోనే పిల్లల భవిష్యత్ బాగుంటుందన్న తల్లిదండ్రుల ఆకాంక్ష.. ఎంత కష్టమైన కూతుర్ని ప్రభుత్వ అధికారిగా చూడాలనే వారిక కోరిక.. భర్త అందించిన ప్రోత్సహాంతో ఆమె ఉన్నత చదువులు చదివింది. పోటీ పరీక్షల్లో రాణించింది. గ్రూప్–1 పోటీ పరీక్షలో ఎస్టీ కేటగిరిలో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అనంతపురం మండలం నరసనేయునికుంట గ్రామానికి చెందిన బొజ్జేనాయక్, బాలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. తాము పడ్డ కష్టం తమ పిల్లలకు రాకుడదనే సంకల్పంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. బొజ్జేనాయక్ తనకున్న 5 ఎకరాల పొలంతోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. వచ్చిన ప్రతి పైసాను పిల్లల చదువుల కోసమే ఖర్చు చేశాడు. పెద్ద కుమార్తెకు చదువు అబ్బలేదు. రెండో కుమార్తె రమాదేవిని బీఈడీ చదివించారు. కానీ ఆమెకు ప్రభుత్వ కొలువు మాత్రం రాలేదు. పెద్ద కొడుకు చంద్రానాయక్‌ను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివించాడు. అతనికీ ప్రభుత్వ ఉద్యోగం వరించలేదు. చిన్న కుమార్తె శాంతకుమారిని ఏలాగైన ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనే ఆశ బొజ్జేనాయక్‌లో బలంగా నాటుకుపోయింది. శాంతకుమారి చదువులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగించింది. నరసనేయునికుంట మండల పరిషత్ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివింది. కురుగుంట గురుకుల పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. 10వ తరగతిలో 74శాతం, ఇంటర్మీడియట్లో 78శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఎంసెట్‌లోనూ మంచి ర్యాంక్ సాధించి ఇంటెల్ కళాశాలలో 65శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసింది. అనంతరం పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. రెండేళ్లపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందింది. 2011లో గ్రూప్–1 పరీక్ష రాసింది. అయితే ప్రభుత్వం ఫలితాలను వెల్లడించలేదు. దీంతో తల్లిదండ్రులు కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి గ్రామానికి చెందిన రామూర్తి నాయక్‌తో శాంతకమారికి వివాహం జరిపించారు. గ్రూప్–1 ఫలితాలు వెల్లడికాలేదని నిరాశ చెందొద్దంటూ భర్త రామూర్తినాయక్ ప్రోత్సహం అందించాడు. బీటెక్ అర్హతతో విజయనగరంలోని పరిశ్రమల శాఖలో ఇండ్రస్టియల్ ప్రమోషనల్ ఆఫీసర్, మరో బ్యాంక్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆ రెండు కొలువులూ ఆమెను వరించాయి. దీంతో పరిశ్రమల శాఖలో ప్రమోషనల్ అధికారి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వం 2016 గ్రూప్–1 ఫలితాలతోపాటు పెండింగ్‌లో ఉన్న 2011 గ్రూప్–1 ఫలితాలనూ విడుదల చేసింది. 2011 గ్రూప్–1 ఫలితాల్లో ఎస్టీ కోటాలో సుగాలి శాంతకుమారి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్, జనరల్ కోటాలో 83వ ర్యాంకు సాధించి ఆర్టీఓ ఉద్యోగం కైవసం చేసుకుంది. ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే.. ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే విజయం సాధ్యమైంది. గ్రూప్–1 పరీక్షకు మొదటి సారే ప్రయత్నించినా విజయం సాధించగలిగాను. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఏలాగైనా కొలువు సాధించాలనే తపనతో అభ్యర్థులు చదవాలి. అప్పుడే విజయం సాధించగలం. మంచి అధికారిగా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తా. – శాంతకుమారి -
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) ప్రిలిమినరీ రాత పరీక్షా ఫలితాలను డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం విడుదల చేశారు. సివిల్, ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెల 17న రాత పరీక్షలు నిర్వహించింది. సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాల్లో 510 పోస్టులకుగాను 1,74,962 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాయగా 88,875 మంది(50.79 శాతం) ఉత్తీర్ణత సాధిం చారు. వీరిలో పురుషులు 79,854 మంది కాగా.. మహిళలు 9,021 మంది ఉన్నారు. కమ్యూనికేషన్, పీటీవో విభాగాల్లో 29 పోస్టులకుగాను 10,584 మంది ప్రిలిమినరీ రాత పరీక్ష రాయగా 1,709 మంది (16.14 శాతం) అర్హత సాధించారు. వీరిలో పురుషులు 1,513 మంది ఉండగా, మహిళలు 196 మంది ఉన్నారు. మొత్తమ్మీద పరీక్షా ఫలితాల్లో ఖమ్మం జిల్లా 54.36 శాతంతో అత్యధిక ఉత్తీర్ణత సాధించగా.. మెదక్ జిల్లా అతి తక్కువగా కేవ లం 44 శాతం ఉత్తీర్ణత సాధించింది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్‌లో దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు స్పష్టం చేశారు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్లు శుక్రవారం నుంచి మే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జవాబు పత్రాల మధింపులో ఏమైనా అనుమానాలు ఉంటే మే 5వ తేదీలోగా అభ్యర్థులు నిర్దేశిత మొత్తం చెల్లించి ఓఎంఆర్ షీట్లు పొందవచ్చు. ఇందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది.ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లోనే అత్యధిక ఉత్తీర్ణత ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు అతి తక్కువగా అర్హత సాధించారు. ఓపెన్ కేటగిరీ వారికి అర్హత మార్కులు అత్యధికంగా ఉండటంతో కేవలం 28.62 శాతం మంది మాత్రమే తదుపరి పరీక్షలకు ఎంపికయ్యారు. ఎస్సై ప్రిలిమినరీలో జనరల్ కేటగిరీకి కటాఫ్‌గా 80 మార్కులు నిర్ణయించడంతో కేవలం 4,454 మంది మాత్రమే అర్హత సాధించారు. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించారు. ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 17,386 మంది(63.74 శాతం), ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు 22,882 మంది (61.54 శాతం) అర్హత సాధించారు. అలాగే బీసీ-ఏ కేటగిరీలో 5,742 మంది(42.77 శాతం), బీసీ-బీలో 18,422 మంది (49.20 శాతం), బీసీ-సీలో 174 మంది (31.35 శాతం), బీసీ-డీలో 17,728 మంది (48.19 శాతం) బీసీ-ఈలో 2,009 (30.19 శాతం) మంది అర్హత సాధించారు. -
ఎస్టీ ఫస్ట్ ర్యాంకర్‌కు దక్కని సీటు
సీమాంధ్రకు చెందిన మూడో ర్యాంకర్‌కు ఉస్మానియాలో సీటు ఎండీఎస్ కౌన్సెలింగ్‌లో వివాదం విజయవాడ/హైదరాబాద్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన ఎండీఎస్ కౌన్సెలింగ్‌పై ఆరోపణలు మొదలయ్యాయి. ఎస్టీ కేటగిరీలో తొలి ర్యాంక్ సాధించిన విద్యార్థినికి సీటు రాకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే మెడికల్ పీజీ పరీక్ష, కౌన్సెలింగ్ విషయంలో అనేక అపవాదులు మూటగట్టుకున్న వర్సిటీ అధికారులు.. తాజాగా ఎండీఎస్ కౌన్సెలింగ్ విషయంలోనూ నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. గత నెల 27, 28 తేదీల్లో విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎండీఎస్ కౌన్సెలింగ్ జరిగింది. ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో మొదటి స్థానంలో ఉన్న డాక్టర్ ప్రవీణ నాయక్ ప్యూరో డాంటిస్ట్రీ కోర్సులో సీటును ఆశించారు. అయితే అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఆ సీటును మరొకరితో భర్తీ చేయడంతో.. ఆంధ్రా వర్సిటీ పరిధిలో ప్రవీణకు సీటు ఇవ్వడానికి కౌన్సెలింగ్ అధికారులు నిరాకరించారు. ఆంధ్రావర్సిటీ పరిధిలో ఎస్టీ కేటగిరీలో సీటు ఉన్నప్పుటికీ దాన్ని ఇప్పటికే స్థానిక విద్యార్థికి కేటయించామని.. నాన్‌లోకల్ అయిన ప్రవీణకు సీటు ఇవ్వడం కుదరదని వారు తేల్చిచెప్పారు. మరోవైపు ఉస్మానియా పరిధిలోనూ ఎస్టీ కేటగిరీలో మూడో ర్యాంకర్‌కు, అదీ సీమాంధ్ర విద్యార్థికి సీటు కేటాయించారని, తన కన్నా తక్కువ ర్యాంకు వచ్చిన వారికి ఎలా అడ్మిషన్ ఇస్తారంటూ ప్రవీణ అభ్యంతరం తెలిపారు. తనకు న్యాయం చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మంగళవారం కలిసి వేడుకున్నారు.